Englishবাংলাગુજરાતીहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

దోపిడి బ్యాచ్ లో చేరిన హీరో నాని

Posted by:
Published: Tuesday, September 24, 2013, 8:16 [IST]
 

దోపిడి బ్యాచ్ లో చేరిన హీరో నాని
 

హైదరాబాద్: వరుణ్ సందేష్, సందీప్ కిషన్, మెలని, నవీన్, రాకేష్ ముఖ్యమైన పాత్రల్లో నటిస్తూ రూపొందుతున్న చిత్రం ‘డి ఫర్ దోపిడి'. దొబ్బడానికి? దొబ్బించుకోడానికా? అనేది సబ్ టైటిల్. హిందీలో ‘99', ‘షోర్ ఇన్ ద సిటీ' చిత్రాలకు దర్శకత్వం వహించిన రాజ్ నిడిమోరు, కృష్ణా డి.కెలు ‘డి ఫర్ దోడిపి' చిత్రాన్ని తెలుగులో నిర్మిస్తున్నారు. సిరాజ్ కల్లాన్ని ఈచిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ఈ చిత్రం నిర్మాణ టీమ్ లో హీరో నాని కూడా జాయిన్ అయ్యారు.

హీరోలు బహుముఖ ప్రజ్ఞ చూపిస్తున్నారు. కెమెరా ముందు, వెనుక... తమ ప్రతిభ బయటపెడుతున్నారు. కొంతమంది నిర్మాణ రంగంలోనూ అడుగుపెడుతున్నారు. సిద్దార్థ్‌, మంచు విష్ణు, శర్వానంద్‌లాంటి యువ కథానాయకులు నిర్మాతలుగా మారారు. ఇప్పుడు ఆ జాబితాలో నాని పేరు కూడా చేరనుంది. వరుణ్‌ సందేశ్‌, సందీప్‌ కిషన్‌ హీరోలుగా నటించిన చిత్రం 'డి ఫర్‌ దోపిడీ'. సిరాజ్‌ కల్లా దర్శకత్వం వహించారు. రాజ్‌నిడుమోరు, కృష్ణడికె నిర్మాతలు. ఇప్పుడు నాని కూడా ఓ భాగస్వామిగా చేరారని సమాచారం. ఈ చిత్రాన్ని ఇటీవలే నాని ప్రత్యేకంగా చూశారు. గాత్రదానం కూడా చేశారు. ఈ సినిమాలోని ప్రధాన పాత్రల్ని నాని తన గొంతుతో పరిచయం చేస్తారు. ఈ సినిమా నచ్చి... ఆయన నిర్మాణ భాగస్వామిగా చేరారని చెప్తున్నారు. సెప్టెంబర్ 27 న ఈ చిత్రంలోని పాటల్ని విడుదల చేస్తారు.

ఎప్పటినుంచో తెలుగులో సినిమా చేయాలనుకుంటున్నాం. మా దర్శకత్వంలో ఓ సినిమా తీయడానికంటే ముందు ఒక తెలుగు చిత్రాన్ని నిర్మిస్తే బాగుంటుందనే ఆలోచనతో ఉన్న మాకు సిరాజ్‌ చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా ప్రారంభించాం. హిందీలో మేం రూపొందించిన షోర్‌ ఇన్‌ ద సిటీ అనే చిత్రానికి అతను అసోసియేట్‌ డెరెక్టర్‌గా పనిచేశారు. తెలుగు సినిమాలు చూస్తూ పెరిగిన మేం తెలుగు నేటివిటీకి అనుగుణంగా నిర్మిస్తున్న చిత్రమిది. క్రైమ్‌, కామెడీ, సెటైర్‌ అంశాలతో తయారవుతున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. ప్రేక్షకులకు వినోదాన్ని కలిగించే సినిమాలు తీయాలన్నది మా ధ్యేయం. వచ్చే ఏడాది రెండు తెలుగు చిత్రాలు నిర్మించాలనుకుంటున్నాం అని తెలిపారు.డీ ఫర్‌ దోపిడి చిత్రీకరణ చివరి దశలో ఉందని, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని రాజ్‌, కృష్ణ చెప్పారు.


క్రైం, కామెడీ నేపథ్యంలో ఈచిత్రం సాగుతుంది. ప్రేక్షకులకు సస్పెన్స్ తో పాటు థ్రిల్, కామెడీని ఈచిత్రం నుంచి ఆశించ వచ్చు. ఈ చిత్రంలో ఇంకా తనికెళ్ల భరణి, హేమ, పృథ్వి, పావలా శ్యామల తదితరులు నటిస్తున్నారు. సంగీతం: మహేష్ శంకర్, కెమెరా: లుకాస్, కళ: ఉపేంద్ర రెడ్డి, కూర్పు: ధర్మేంద్ర, నిర్మాతలు: రాజ్ నిడిమోరు, కృష్ణా డి.కె, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సిరాజ్ కల్లా.

English summary
Nani has bought a 50 % stake in D for Dopidi movie. Varun Sandesh and Sundeep Kishan have played the lead roles in this movie which is directed by debutant Siraj Kalla. Apparently Nani has also given voice over for the movie and he has the seen the complete movie and liked it immensely thereby took a stake from the producers Krish D K and Raj Nidamoru.
మీ వ్యాఖ్య రాయండి

Please read our comments policy before posting

Click here to type in Telugu
Subscribe Newsletter
Coupons
My Place My Voice