twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చీటింగ్ కేసులో అరెస్టు అంటూ వార్తలు, నేను కాదంటూ హీరో నిఖిల్ వివరణ

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: " హ్యాపీడేస్, స్వామిరారా చిత్రాల్లో నటించిన నటుడు నిఖిల్ రెడ్డి చీటింగు కేసులో పట్టుబడ్డాడు. పోలీసులు అతన్ని అరెస్టు చేసారు. నారాయణగూడకు చెందిన వసంత్ అనే వ్యక్తికి రూ. 50 లక్షల ఫాల్స్ చెక్కు ఇవ్వడంతో అతను నిఖిల్ రెడ్డిపై కంప్లైంట్ చేసాడు. దీంతో పోలీసులు నిఖిల్ రెడ్డిని అరెస్టు చేసారు" అంటూ సోషల్ మీడియాలో వార్తలు గుప్పు మన్నాయి.

    కొందరు వ్యక్తులు ఫేస్ బుక్, ట్విట్టర్ లాంటి సైట్ల ద్వారా ఈ వార్తలకు మరింత ప్రచారం చేపట్టారు. తర్వాత తేలింది ఏమిటంటే....అతను హ్యాపీడేస్, స్వామి రారా చిత్రాల్లో నటించిన నిఖిల్ కాదు అని. మన హీరో పేరు నిఖిల్ సిద్ధార్థ్ అయితే...అరెస్టయిన వ్యక్తి నిఖిల్ రెడ్డి అనే ఓ పాపులారిటీ లేని యాక్టర్.

    ఈ వార్తలతో నిఖిల్ సిద్దార్థ్ అభిమానులు ఒక్కసారిగా షాకయ్యారు. తనకు సంబంధం లేని ఈ వార్తలు ప్రచారంలోకి రావడంపై హీరో నిఖిల్ సిద్దార్థ్ కూడా ఖంగుతిన్నాడు. అభిమానుల్లోకి, ప్రేక్షకుల్లోకి తన గురించి తప్పుడు సంకేతాలు వెళ్లకముందే నివారణ చర్యలు చేపట్టాడు. ట్విట్టర్ ద్వారా ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చి అయోమయానికి తెరదించారు.

    'నా గురించి తప్పుడు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. కానీ అది నేను కాదు. అతను వేరొక యాక్టర్ నిఖిల్ రెడ్డి. నా పేరు నిఖిల్ సిద్దార్థ్. దయచేసి అయోమయానికి గురి కావొద్దు. మీరే ఏమైనా పోస్టు చేసే మందు ఒకసారి క్లారిఫై చేసుకోండి. మరోసారి స్పష్టంగా చెబుతున్నాను నా గురించిన తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు' అంటూ ట్వీట్ చేసాడు.

    English summary
    Nikhil Siddhartha tweeted “Guys there is a false news about me being circulated. Its regarding another actor called Nikhil Reddy.. I am Nikhil Siddhartha.. Please don’t confuse. Please check before you post anything… I am clarifying again.. It is a false news which has nothing to do with me… Thank u guys.”
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X