twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హత్యల సంఖ్యదేముంది.. కానీ: 'సాక్షి'పై ప్రశ్నకు జగన్

    By Srinivas
    |

    హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతల అంశంపై శాసన సభలో వాడిగా వేడిగా చర్చ జరిగిన విషయం తెలిసిందే. శుక్రవారం సభ వాయిదా పడిన అనంతరం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. హత్యల సంఖ్య పైన తాను సభను తప్పుదారి పట్టించలేదన్నారు.

    హత్యల సంఖ్యలో తాను తప్పుదారి పట్టంచలేదని, సంఖ్యలది ఏముందని, మానవీయ కోణంలో చూడాలని జగన్ అన్నారు. హత్యల పైన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ చెప్పే సంఖ్యకు, సాక్షి పత్రిక ప్రచురించిన సంఖ్యకు తేడా ఉంది కదా అని విలేకరులు ప్రశ్నించారు. దీనిపై జగన్ పై విధంగా స్పందించారు.

    YSR Congress

    కాగా, ఉదయం శాసన సభలో శాంతిభద్రతల పైన చర్చ జరిగిన విషయం తెలిసిందే. దీని పైన అధికార తెలుగుదేశం, ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెసు పార్టీల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇరు పార్టీలు ఒకరి పైన మరొకరు ఆగ్రహం వ్యక్తం చేశాయి. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి తమ పార్టీ కార్యకర్తలు హత్య గావించబడుతున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆరోపించింది. దీనిపై టీడీపీ కూడా ధీటుగా స్పందించింది.

    వైయస్ హయాంలోనే చాలా హత్యలు జరిగాయన్నారు. పరిటాల హత్య కేసులో జగన్ ఉన్నారని ఆరోపించారు. ఓ సమయంలో సభలో ఊగిపోయిన జగన్ టీడీపీ వారిని బఫూన్లు అన్నారు. జగన్ క్షమాపణ చెప్పాలని టీడీపీ డిమాండ్ చేసింది. స్పీకర్ కూడా వాటిని వెనక్కి తీసుకోవాలని సూచించారు.

    దీనికి జగన్ స్పందిస్తూ.. ఇదే సభలో టీడీపీ సభ్యులు తనను హంతకుడు అన్నారని, నరరూపరాక్షసుడు అన్నారన్నారు. తమ ఎమ్మెల్యేలను స్మగ్లర్లు అని కూడా అన్నారన్నారు. తనను అలాంటి ఘోరమైన మాటలతో దూషించిన తర్వాత, తాను వారిని బఫూన్లు అన్నానని సమర్థించుకునే ప్రయత్నాలు చేశారు.

    English summary
    YSR congress Party chief YS Jaganmohan Reddy said he was not misled Assembly.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X