twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కొమ్ములతో మృగంలా విక్రమ్(ఫొటో ఫీచర్)

    By Srikanya
    |

    హైదరాబాద్ :హై టెక్నిక‌ల్ వాల్యూస్‌తో తెర‌కెక్కిస్తున్న 'మనోహరుడు' చిత్రానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. ఈ మూవీను శంక‌ర్ డైరెక్ట్ చేస్తున్నాడు. అలాగే హీరో, హీరోయిన్‌గా విక్రమ్ స‌ర‌స‌న అమీజాక్సన్ న‌టిస్తుంది. ఇదిలా ఉంటే ఈ మూవీ రిలీజ్ కోసం శంక‌ర్ అభిమానులు తెగ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. దీంతో ఐ మూవీ రిలీజ్ డేట్‌ను బ‌య‌ట‌కు అనౌన్స్ చేశారు. దీపావళి రోజున అంటే అక్టోబర్ 22న విడుదల చేస్తామని తెలియచేసారు.

    ప్రముఖ దర్శకుడు శంకర్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న తాజా చిత్రం 'ఐ'. తెలుగులో 'మనోహరుడు'గా విడుదలచేస్తున్నారు. ఇందులో విక్రమ్‌ హీరో. అమీజాక్సన్‌ హీరోయిన్. ఆస్కార్‌ ఫిలిమ్స్‌ పతాకంపై రవిచంద్రన్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రచార చిత్రాన్ని ఆదివారం చెన్నైలో మీడియా కోసం ప్రదర్శించారు.

    తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ వంటి భారతీయ భాషలతో పాటు చైనా, తైవాన్‌ తదితర 25 పైచిలుకు విదేశీ భాషల్లో సినిమాను విడుదల చేస్తున్నారు. ప్రత్యేకంగా చైనా మార్కెట్‌పై దృష్టి పెట్టారు.

    విక్రమ్‌ సాధారణంగా 70 కిలోల బరువుండేవారు. ఈ సినిమాలో ఓ భయంకరమైన మృగరూపంలో నటించేందుకు ఆయన 130 కిలోలకు బరువు పెరిగారు. ఈ పాత్రకు కొమ్ములు ఉన్నాయి. కింగ్‌కాంగ్‌కన్నా భయంకరంగా కనిపిస్తారు విక్రమ్‌. ఈ పాత్ర కోసం ఏఆర్‌ రెహ్మాన్‌ ఓ పాట పాడారు. ఇలాంటి ఎన్నో ఈ చిత్రం గురించి కొత్త విశేషాలు నిర్మాత రవిచంద్రన్ తెలియచేసారు. అవి మీ కోసం...

    ఈ చిత్రం కొత్త విశేషాలు...స్లైడ్ షోలో ...

    కథ వినలేదు

    కథ వినలేదు

    'ఓ సినిమా తెరకెక్కించాలనుకుంటున్నా. కానీ అది 'రోబో' కన్నా భారీ బడ్జెట్‌ చిత్రమవ్వాలి. మీరు చేస్తారా?' అని ఆస్కార్‌ రవిచంద్రన్‌ను శంకర్‌ అడిగారు. కానీ అప్పట్లో తన వద్ద డబ్బు లేకపోయినా సరేనని ఒప్పుకున్నారు రవిచంద్రన్‌. అలా ప్రారంభించిన చిత్రం 'ఐ'. అయితే రవిచంద్రన్‌ కనీసం చిత్ర కథ కూడా వినలేదట.

    ఎంత టైమ్ పట్టిందంటే...

    ఎంత టైమ్ పట్టిందంటే...


    2012 జులైలో 'ఐ' చిత్రీకరణ ప్రారంభించారు. పూర్తి కావడానికి రెండేళ్ల ఎనిమిది నెలలు పట్టింది. ఏఆర్‌ రెహ్మాన్‌ సంగీతం సమకూర్చారు. నిర్మాణానంతర పనులు సాగుతున్నాయి. కొన్ని సన్నివేశాలను చేర్చుతున్నారు. దీపావళికి విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు.

    బడ్జెట్...

    బడ్జెట్...

    ఇప్పటి వరకు సినిమాకు రూ.180 కోట్లు వెచ్చించారు. ఆస్కార్‌ ఫిలిమ్స్‌ చరిత్రలో ఇదే అత్యంత భారీ బడ్జెట్‌ చిత్రం.

    ఫైట్స్

    ఫైట్స్


    ఇందులో నాలుగు కీలకమైన పోరాట సన్నివేశాలున్నాయి. ఒక్కొక్కదాన్నీ 40 రోజులకు పైగా చిత్రీకరించారు.

     మ్యూజిక్ రిపీట్ చేస్తారా

    మ్యూజిక్ రిపీట్ చేస్తారా

    అందుకు విక్రం అన్నం పూర్తిగా తగ్గించేశాడని సమాచారం. ఆకుకూరలు, పళ్లరసాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. శంకర్‌ దర్శకత్వంలోని 'అన్నియన్‌'లో రెమో, అంబి, అన్నియన్‌గా మూడు పాత్రల్లో కనిపించిన విక్రం.. ఇందులోనూ అలానే కనిపిస్తాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

    జాకీచాన్ గెస్ట్ గా..

    జాకీచాన్ గెస్ట్ గా..

    'ఐ' పాటల వేడుకను సెప్టెంబరు 15వ తేదీన చెన్నైలో అత్యంత వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అందుకు తగ్గట్టు వేదిక లభించకపోతే రామోజీ ఫిల్మ్‌సిటీలో నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి జాకీచాన్‌ ముఖ్య అతిథిగా విచ్చేయనున్నట్లు సమాచారం.

    చర్మం కాలింది

    చర్మం కాలింది

    హీరో విక్రమ్‌కు క్లిష్టతరమైన మేకప్‌ కోసం ఓ రకమైన యాసిడ్‌ను వినియోగించారు. దాన్ని వాడిన తర్వాత బాగా చల్లని ప్రాంతంలో మాత్రమే ఉండాలి. అలా లేకపోతే చర్మం వూడిపోతుంది. ఇందుకోసం జాగ్రత్తలు తీసుకుంది యూనిట్. అయినప్పటికీ ఓసారి యాసిడ్‌ ప్రభావంతో విక్రమ్‌ చర్మం కాస్త కాలిందట.

    ఇండియన్ జేమ్స్ కామెరూన్

    ఇండియన్ జేమ్స్ కామెరూన్

    ''ఈ సినిమా తర్వాత చిత్ర పరిశ్రమను 'ఐ'కి ముందు 'ఐ'కి తర్వాత అనేలా విభజించుకోవచ్చు. శంకర్‌ సాధారణమైన వ్యక్తికాదు. ఆయన ఓ ఇండియన్‌ జేమ్స్‌ కామెరూన్‌. అతనికే 'ఐ'లాంటి సినిమాలు సాధ్యం''

    క్యారక్టరైజేషన్

    క్యారక్టరైజేషన్

    ఈ చిత్రంలో విక్రమ్...తమిళనాడు స్టేట్ భాక్సింగ్ ఛాంపియన్ గా కనిపించనున్నాడని సమాచారం. . ఇందులో ఒక సాధారణ యువకుడైన విక్రమ్ ఒలింపిక్‌లో బంగారు పతకం ఎలా సాధించారనేది 'ఐ' చిత్ర కథ అని వినపడుతోంది. అందుకోసం ఆయన ఎనిమిది కేజీలు పైగా బరువు తగ్గారు.

     నిజమో కాదో...

    నిజమో కాదో...

    ఆస్కార్ రవిచంద్రన్ అత్యంత భారీ ఎత్తున నిర్మిస్తున్న ఐ చిత్రం ఒలింపిక్ క్రీడల నేపథ్యంలో సాగుతుందనే సమాచారం. ఈ నేపథ్యాన్ని ఇతివృత్తంగా తీసుకుని శంకర్ ఐ చిత్రాన్ని ఓ రేంజిలో తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది. ఇందులో ఒక సాధారణ యువకుడైన విక్రమ్ ఒలింపిక్‌లో బంగారు పతకం ఎలా సాధించారనేది ఐ చిత్ర కథ అని వినపడుతోంది.

    టాప్ టెక్నీషియన్స్

    టాప్ టెక్నీషియన్స్

    ప్రముఖ సంగీత దర్శకడు రెహమాన్ మ్యూజిక్ కంపోజ్ చేసారు. పీసీ శ్రీరామ్ కెమెరామేన్. శుభతో కలిసి శంకర్ కూడా కథను రాశారు. భారీ ఎక్స్పెక్టేషన్స్ తో రానున్న ఈ సినిమాను అంతే అపురూపంగా నెక్స్ట్ లెవల్ సినిమాగా తీర్చిదిద్దుతున్నారట శంకర్.

    ఎన్ని థియోటర్స్

    ఎన్ని థియోటర్స్

    ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మొత్తం 20 వేల థియేటర్లలో విడుదల కాబోతుంటే వాటిలో 15 వేల థియేటర్లు చైనాలోనివే కావడం విశేషం. ఆ దేశంలోనూ కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు.

    English summary
    Oscar Ravichandran has revealed about 'Ai' & 'Manoharudu' in detail. He has also shown a Trailer and a song for the Journalists and announced he will be releasing the film for Oct 22nd on Diwali eve.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X