twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫ్లాఫు హీరో ప్లానింగ్ :హిట్ బ్యాచ్ పోగయ్యాకే ఓపినింగ్

    By Srikanya
    |

     'Pandaga Chesko' to be launched on May 17th
    హైదరాబాద్ : వరస ప్లాఫుల్లో ఉన్నప్పుడు హిట్ బ్యాచ్ తో జతకడితే వారి హిట్ అదృష్టం కొంతైనా మనకు అంటుకోవచ్చు. ఇదే స్ట్రాటజీని రామ్ ఫాలో అవుతున్నట్లున్నారు. కంటిన్యూగా మూడు డిజాస్టర్స్ ఇచ్చిన ఈ హీరో...ఈ సారి ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. దర్శకుడుగా బలుపుతో హిట్ కొట్టిన గోపీచంద్ మలినేని ఎంపిక చేసుకోవటమే కాక, హీరోయిన్ గా హిట్ చిత్రం 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌' తో ఆకట్టుకొన్న రకుల్‌ ప్రీత్‌సింగ్‌ని ఎంచుకొన్నాడు. అలాగే హిట్ చిత్రాలకు సంగీతం అందిస్తున్న తమన్ ని టీమ్ లోకి తెచ్చుకున్నాడు. దాంతో ఇప్పుడు తనకు విజయం ఢోకా లేదనే ధైర్యంతో ఈనెల 17 నుంచి చిత్రీకరణ ప్రారంభిస్తున్నాడు.

    రామ్‌ హీరోగా యునైటెడ్‌ మూవీస్‌ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. అదే... 'పండగ చేస్కో'. పరుచూరి కిరీటి నిర్మాత. గోపీచంద్‌ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. 'బలుపు' తరవాత ఆయన నుంచి వస్తున్న చిత్రమిదే. 'పండగ చేస్కో'లో హీరోయిన్ గా హీరోయిన్ .. రకుల్‌. ఆ విజయంతో మూడు సినిమాలు తన ఖాతాలో వేసుకొంది. 'పండగ చేస్కో'తో మరోటి చేరిందన్నమాట.

    చిత్ర సమర్పకుడు పరుచూరి ప్రసాద్‌ మాట్లాడుతూ ''వాణిజ్య అంశాలన్నీ మేళవించిన కథ ఇది. టైటిల్‌కి మంచి స్పందన వస్తోంది. రామ్‌ నటన, ఆయన పాత్ర తీరుతెన్నులు కొత్తగా ఉంటాయి. మిగిలిన తారాగణాన్ని త్వరలోనే ఎంపిక చేస్తాం'' అన్నారు. ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందిస్తున్నారు.

    గోపీచంద్ మలినేని మాట్లాడుతూ ''రామ్‌లోని హుషారుకి తగిన కథ ఇది. మాస్‌, యాక్షన్‌, వినోదం.. ఇవన్నీ కలగలిసి ఉంటుంది. డాన్‌శీను', 'బాడీగార్డ్', 'బలుపు' వంటి హిట్ చిత్రాల తరువాత చేస్తున్న సినిమా ఇది. రామ్ ఎనర్జీకి తగినట్లుగా మంచి యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను రూపొందించడానికి సబ్జెక్ట్ రెడీ చేశాం. రామ్‌కిది మరో మంచి సినిమా అవుతుంది' అన్నారు.

    నిర్మాత మాట్లాడుతూ... ''స్క్రిప్టు బాగా వచ్చింది. రామ్‌ కెరీర్‌లో మర్చిపోలేని చిత్రం అవుతుంది. హీరోయిన్, మిగిలిన సాంకేతిన నిపుణుల వివరాలు త్వరలో చెబుతాము''అన్నారు . వరసగా మూడు డిజాస్టర్ ఫ్లాపులు(ఎందుకంటే ప్రేమంట,ఒంగోలు గిత్త,మసాలా) అందించిన రామ్ ఈ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకున్నారు.

    English summary
    Now, Rakul Preeti Singh steps in Ram's Pandaga Chesko. Producer Parachuri Prasad says that the film will be launched on May 17th. Gopichand Malineni of Balupu fame will direct the movie. S S Thaman will compose the music.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X