twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    లేనట్లే అని పవన్ తేల్చేసాడు

    By Srikanya
    |

    హైదరాబాద్‌: జనసేన తరఫున ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేయరాదని, 2019 ఎన్నికల బరిలోనే నిలవాలన్న విధానానికే కట్టుబడి ఉండాలని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ నిర్ణయించారు. తనతోపాటు మరో ఏడుగురు అభ్యర్థుల్ని బరిలో నిలపాలని నిర్మాత, పారిశ్రామికవేత్త అయిన పొట్లూరి వరప్రసాద్‌ చేసిన ప్రతిపాదనను ఆయన అంగీకరించలేదని సమాచారం.

    గురువారం పొట్లూరి రెండు విడతలుగా పవన్‌తో భేటీ అయ్యారు. తెదేపా, భాజపాల మధ్య పొత్తు ప్రతిపాదన రద్దయితే... విజయవాడ నుంచి వరప్రసాద్‌ని పోటీకి దింపాలని భావించారు. భాజపా అభ్యర్థిగానే బరిలో నిలిచే అవకాశముంది. ఆయన శనివారం నామినేషన్‌ దాఖలు చేయనున్నారు.

    Pawan's full political entry only in 2019

    కేశినేని నాని విషయంలో తెదేపా అధినేత చంద్రబాబు ముందుగా ఇచ్చిన మాటకు కట్టుబడి విజయవాడ లోక్‌సభ స్థానం నుంచి పార్టీ అభ్యర్థిగా రంగంలోకి దింపారు. ఎట్టకేలకు వూహాగానాలకు, అనుమానాలకు తెరపడింది. గత ఏడాది జనవరిలో జిల్లాకు చేరిన చంద్రబాబు 'వస్తున్నా మీ కోసం' పాదయాత్ర సమయం నుంచి కేశినేని తెదేపాలో క్రియాశీలకంగా మారారు. లోక్‌సభ నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి.. లోక్‌సభ పరిధిలోని అన్ని మండలాల్లో పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న కేశినేనికి టిక్కెట్టు కేటాయింపు కొద్ది కాలంగా అనుమానంలో పడింది. ఈ స్థానం నుంచి అభ్యర్థిత్వం కోసం పలువురు పోటీపడ్డారు.

    ప్రముఖ పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్‌(పీవీపీ) టిక్కెట్టు కోసం తీవ్రప్రయత్నాలు చివరి నిమిషం వరకు కొనసాగాయి. పవన్‌ కళ్యాణ్‌ పీవీపీకి టిక్కెట్టు కోసం గట్టిగా ప్రయత్నించారనేది ప్రచారం. ఈ నేపథ్యంలో కేశినేని హైదరాబాద్‌లో మూడు నాలుగు రోజులుగా తిష్ఠవేసి పలు దఫాలు అధినేతతో భేటీ అయ్యారు. ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేయాలనే అధిష్ఠానం ప్రతిపాదనను ఆయన తిరస్కరించారు. ఎట్టకేలకు టిక్కెట్టు దక్కించుకున్నారు. కాగా బీఫారం చేతికి అందేవరకు ఆయన వర్గీయుల్లో ఆందోళన నెలకొంది. పీవీపీ అన్నివిధాలా ప్రయత్నిస్తున్నారనే సమాచారం ఎప్పటికప్పుడు జిల్లాకు చేరుతుండటంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

    English summary
    Pawan is not ready to contest the 2014 elections. He wants to prepare his party go for people’s mandate by 2019, when the next General elections will be held.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X