twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పిక్చర్: ఆగస్టు 16న మిర్చి మ్యూజిక్ అవార్డు

    By Pratap
    |

    హైదరాబాద్: గత నాలుగేళ్లుగా దక్షిణాది సినీ సంగీత కళాకారుల ప్రతిభకు పట్టు కడుతూ వారిని మిర్చి మ్యూజిక్ అవార్డ్స్ సౌత్‌తో సత్కరిస్తున్న రేడియో మిర్చి ఈ ఏడాది కూడా ఈ వేడుకకు శ్రీకారం చుట్టింది. 2013 మిర్చి మ్యూజిక్ అవార్డుల కార్యక్రమాన్ని ఆగస్టు 16వ తేదీన హైదరాబాదులోని అన్నపూర్ణ స్టూడియోలో వైభవంగా నిర్వహించనుంది.

    తెలుగు, తమిళం, కన్న, మలయాళ భాషలకు చెందిన సినీ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరవుతారు. ఈ అవార్డుల వేడుకలో భాగంగా సినిమా రంగంలోని 16 విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన కళాకారులను జ్యూరీ ప్రతినిధుల చేత ఎంపిక చేయించి వారిని మిర్చి మ్యూజిక్ అవార్డ్స్ సౌత్‌తో సత్కరిస్తారు.

    ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను తెలియజేస్తూ మంగళవారం హైదరాబాదులోని జ్యూరీ ప్రతినిధులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సంగీతకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసి వారిని ప్రోత్సహించేందుకు ఈ అవార్డులు ఎంతగానో తోడ్పడుతాయని తెలుగు జ్యూరీ చైర్మన్ సురేష్ బాబు అన్నారు. ప్రతి ఏడాది మాదిరిగా ఈ ఏడాది కూడా చాలా సినిమాలు పోటీలో నిలిచాయని చెప్పారు.

     Photos: Music Mirchi awards will be presented

    వాటిలోంచి విభాగాలవారీగా అత్యుత్తుమమైన వాటిని ఎంపిక చేశామని సురేష్ బాబు చెప్పారు. విజేతలను మాత్రం ఆగస్టు 16వ తేదీననే వెల్లడిస్తామని అన్నారు. సినీ రంగానికి చాలా ఏళ్లుగా సేవలు చేస్తున్నవారిలో ఒకరిని ఎంపిక చేసి వారిని లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ పురస్కారంతో సత్కరిస్తామని ఆయన చెప్పారు.

    గత నాలుగేళ్లుగా సురేష్ బాబు పెద్ద దిక్కుగా ఉండి నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో సీనియర్ సంగీత దర్శకుడిగా తాను ఓ భాగం కావడం ఆనందంగా ఉందని ప్రముఖ సంగీత దర్శకుడు కోటీ అన్నారు. కొత్త టాలెంట్‌తో, కొత్త పాయింట్‌తో అనేక మంది కళాకారులు ప్రతి ఏడాది సినిమా రంగానికి పరిచయమవుతున్నట్లు తెలిపారు.

    వారి ప్రతిభకు సరైన గుర్తింపు అందించేందుకు ఈ అవార్డులు ఉపయోగపడుతాయని, ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ఎటువంటి పక్షపాతానికి తావు లేకుండా ఈ అవార్డుల ఎంపిక జరిగిందని కోటీ చెప్పారు. ఈ కార్యక్రమంలో సునీత, ఆర్పీ పట్నాయక్, రామజోగయ్య శాస్త్రి, చంద్రబోస్, విఎన్ ఆదిత్య, కెఎం రాధాకృష్ణన్, కౌసల్య పాల్గొన్నారు.

    English summary
    Telugu film producer Suresh Bbau said that Radio Mirchi awards will be presented on august 16 this year.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X