twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నిఖిల్ సినిమాపై రాజమౌళి ప్రశంసల వర్షం

    By Srikanya
    |

    హైదరాబాద్ తనకు నచ్చింది ఎక్కడున్నా చిన్నా,పెద్దా తేడా లేకుండా మెచ్చుకోవటం రాజమౌళి నైజం. ఆయన తాజాగా నిఖిల్ నటిస్తున్న కార్తికేయ చిత్రం టీజర్ ని పొగడ్తల్లో ముంచెత్తారు. దాంతో కార్తీకేయ టీమ్ మొత్తం ఆనందంలో మునిగితేలుతోంది. రాజమౌళి పొగడ్త తమ సినిమాకు బూస్టప్ గా భావిస్తున్నారు. రాజమౌళి ఈ పొగడ్తలను ట్విట్టర్ లో కురిపించారు.

    రాజమౌళి ట్వీట్ లో... " వెరీ ఇంప్రెసివ్ విజువల్స్... ఈ సినిమా చూడాలని ఆసక్తిగా ఉంది. కార్తికేయ టీమ్ కు ఆల్ ది బెస్ట్... ", అని ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. 'మాగ్నస్ సినీ ప్రైమ్' సంస్థ రూపొందిస్తున్న చిత్రం 'కార్తికేయ' యువ కథానాయకుడు నిఖిల్ తో తాము నిర్మిస్తున్న 'కార్తికేయ' చిత్రం తెలుగు, తమిళ భాషలలో ఏక కాలంలొ రూపొందుతుందని నిర్మాత వెంకట శ్రీనివాస్ బొగ్గరం తెలిపారు.

    Rajamouli

    పాండిచ్చేరి, కుంభకోణం తదితర ప్రాంతాలలో చిత్రం షూటింగ్ జరుగుతుందని నిర్మాత తెలిపారు. తొలిచిత్రమే ద్వి భాషా చిత్రంగా రూపొందిచటం ఎంతో ఆనందంగా ఉందని ఆయన అన్నారు. శిరువూరి రాజేష్ వర్మ సమర్పణలో నిర్మాత వెంకట శ్రీనివాస్ బొగ్గరం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా చందు మొండేటి దర్శకునిగా పరిచయం అవుతున్నారు.

    కార్తికేయ ద్విభాషా చిత్రంగా రూపొందటం పట్ల తన సంతోషాన్ని వ్యక్తం చేసారు హీరో నిఖిల్. ధ్రిల్లర్ తో కూడిన వినొదాత్మక చిత్రం గా దీనికి రూపకల్పన చేస్తున్నట్లు చిత్ర దర్శకుడు చందు మొండేటి తెలిపారు. చిత్ర హీరో,హీరోయిన్స్ వైద్య విద్యార్ధులుగా కనిపిస్తారీ చిత్రంలో..ఈ ప్రపంచంలో సమాధానం దొరకని ప్రశ్న అంటూ ఉండదు..ఒక వేళ సమాధానం దొరకలేదు అంటే ఆ లోపం ప్రశ్నది కాదు, ప్రయత్నానిదే అని నమ్మే మనస్తత్వం చిత్ర హీరో 'నిఖిల్'ది. ఈ నేపథ్యంలో అతనికి ఎదురైన సంఘటనలు, సన్నివేశాల సమాహారమే ఈ 'కార్తికేయ' చిత్రం.

    వచ్చే ఏడాది ప్రారంభంలో విడుదల అయ్యే దిశగా చిత్ర నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయని చిత్ర నిర్మాత తెలిపారు. కథానాయకుడు నిఖిల్ గత చిత్రాలకన్నా అధిక బడ్జెట్ లో రూపొందుతున్న ఈ చిత్రం విజయంపై ఎంతో నమ్మకముందని నిర్మాత తెలిపారు

    ఇతర ప్రధాన పాత్రలలో తనికెళ్ళభర ణి, నాజర్, రావు రమేష్, ప్రవీణ్, తులసి, కిషోర్, స్వామిరారా సత్య, జోగినాయుడు,శివన్నారాయణ, మీనాకుమారి, చంద్రశేఖర్ గిరి, కృష్ణంరాజు,వేణుగోపాలరావు, ఐ,కె. త్రినాధ్, అప్పారావు ఐ పేట,లు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమేరా: కార్తీక్ ఘట్టమనేని. ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్, సంగీతం: శేఖర్ చంద్ర, పాటలు: కృష్ణ చైతన్య, కొరియో గ్రఫీ : రఘు, ఆర్ట్: సాహి సురేష్, కో డైరెక్టర్ :అను కె రెడ్డి, ఎగ్జిక్యుటివ్ నిర్మాత: గునకల మల్లికార్జున నిర్మాత: వెంకట శ్రీనివాస్ బొగ్గరం; సమర్పణ: శిరువూరి రాజేష్ వర్మ; కధ- మాటలు -స్రీన్ ప్లే- దర్శకత్వం: చందు మొండేటి.

    English summary
    Director S.S.Rajamouli praised the film ‘Karthikeya’’ s visuals via his Twitter account. “Very impressive visuals…looking forward for this film..All the best to the makers of “karthikeya”, he tweeted. The film is being directed by Chandu Mondeti and Sekhar Chandra has composed the music. Nikhil and Swathi will be seen in lead roles. Hero Nikhil was delighted with Rajamouli’s tweet and thanked the ace director profusely.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X