twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'బాహుబలి' యుద్ధం గురించి రాజమౌళి

    By Srikanya
    |

    హైదరాబాద్ : ఎప్పటికప్పుడు ట్విట్టర్ ద్వారా వివిధ విషయాలపై స్పందించే రాజమౌళి తాజాగా తన సినిమా లేటెస్ట్ ఇన్ఫోని వెళ్లడించారు.
    నెలల తరబడి సాగిన బాహుబలి యుద్ధం చివరి దశకు చేరుకొందని తెలియచేసారు. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి ట్విట్టర్‌ ద్వారా తెలిపారు.

    రాజమౌళి ట్వీట్ చేస్తూ... ''ఒక పెద్ద షెడ్యూల్‌ పూర్తవబోతోంది. ఈ సన్నివేశాల్లో నటించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు చెప్పాలి. రోజూ ఉదయం 5:30కి వచ్చి, వాళ్ల కాస్ట్యూమ్స్‌, మేకప్‌తో సిద్ధమై పరిగెత్తుతూ, అరుస్తూ, పోరాటం చేశారు. అది కూడా సాయంత్రం వరకు ఏమాత్రం అలసిపోకుండా సెట్‌లో కష్టపడ్డారు. వాళ్ల సహకారం లేనిదే మేం ఏమీ చేసేవాళ్లం కాదు'' అని ట్వీట్‌ చేశారు రాజమౌళి.

    Rajamouli tweet about Baahubali

    ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న చిత్రం 'బాహుబలి'. రానా ముఖ్యభూమిక పోషిస్తున్నారు. అనుష్క, తమన్నా హీరోయిన్స్. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో చిత్రీకరణ సాగుతోంది. కొన్ని నెలలుగా అక్కడ యుద్ధం నేపథ్యంలో కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. 2000 మంది కళాకారులపై చిత్రీకరణ జరుపుతున్నారు. ఈ చిత్రాన్ని ఆర్కా మీడియా సంస్థ నిర్మిస్తోంది.

    ప్రభాస్‌, రానా, అనుష్క ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మిస్తున్నారు. కె.రాఘవేంద్రరావు సమర్పకులు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. అనంతరం ఇతర భాషల్లో అనువదించి ఒకేసారి విడుదల చేస్తారు. ఈ సినిమాకోసం ఇప్పటికే ప్రధాన తారాగణమంతా కత్తి యుద్ధాలు, గుర్రపుస్వారీ నేర్చుకొంది.

    English summary
    Rajamouli tweeted: "A heavy Baahubali schedule comes to an end. Thanking the gym boys of Vizag batch, Vinay batch and Taufeeq batch who toiled extremely hard. They come at 5:30am, get into their costumes, apply war paint and run, shout, fight in sun till evening with full enthu. Couldn't have done it without them.."
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X