twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాజమౌళి జీవితంలో మరవలేని సంఘటన

    By Srikanya
    |

    హైదరాబాద్: ఒక్కొక్కరి జీవితంలో కొన్ని కొన్ని సంఘటనలు అలా నిలిచిపోతాయి. అలా తనకు జీవితాంతం నిలిచిపోయే సంఘటన జరిగిందని రాజమౌళి అంటున్నారు. అది నిన్న (శనివారం)రాత్రి విక్రమ్ సింహా ఆడియో పంక్షన్ లో జరిగింది. అదేమిటనేది రాజమౌళి ట్వీట్ చేసి తన అభిమానులతో పంచుకున్నాడు.

    రాజమౌళి ట్వీట్ చేస్తూ..." నా జీవితంలో మరవలేని జ్ఞాపకాలు : రజనీకాంత్ నన్ను చూసి ' రాజమౌళి, నాకు ఒకసారి బాహుబలి సెట్స్ కి వచ్చి నువ్వు చేసే షూటింగ్ చూడాలని వుంది " అన్నారు. ఆ సమయంలో నేను ఏం మాట్లాడాలో తెలియక "థాంక్ యు సార్" అన్నట్టు చెప్పానని ట్విట్టర్ లో తెలిపాడు.

    Rajamouli tweet about Rajanikanth

    ప్రస్తుతం రాజమౌళి..బాహుబలి షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం కథ మహాభారతాన్ని పోలి ఉండబోతుందని, అన్నదమ్ముల మధ్య జరిగే అధికారం కోసం జరిగే పోరు చుట్టూ సినిమా తిరగనుంది. తమిళంలో దీనిని 'మహాబలి'గా ఏకకాలంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవలే ట్రైలర్‌ - మేకింగ్‌ వీడియోను విడుదల చేశారు. తొలి రోజు నుంచే విశేష స్పందన లభించింది. ఈ చిత్రం కోసం అక్కడ వారు సైతం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అక్కడ కూడా రికార్డ్ స్ధాయిలో వ్యూస్ వచ్చాయి. బిజినెస్ పరంగా కూడా తమిళనాట ఓ రేంజిలో క్రేజ్ వస్తుందని అక్కడ ట్రేడ్ లో అంచనాలు మొదలయ్యాయి.

    ప్రభాస్‌, రానా, అనుష్క ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మిస్తున్నారు. కె.రాఘవేంద్రరావు సమర్పకులు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. అనంతరం ఇతర భాషల్లో అనువదించి ఒకేసారి విడుదల చేస్తారు. ప్రస్తుతం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమాకోసం ఇప్పటికే ప్రధాన తారాగణమంతా కత్తి యుద్ధాలు, గుర్రపుస్వారీ నేర్చుకుని,విశ్వరూపం ప్రదర్శశిస్తోంది.

    English summary
    Rajamouli tweeted:One of my most memorable moments: Rajini sir leaned across and said "Rajamouli, I want to come to sets of Baahubali and see your shooting" And...One of my most forgettable moment: I gaped at him tongue tied and said something resembling "Thank you sir" .
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X