twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాజకీయాల్లోకి రాకపై రజనీకాంత్ స్పందన

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారా? లేరా? అనే అంశంపై చాలా కాలంగా హాట్ హాట్ చర్చ నడుస్తున్నా....ఇంత వరకు ఆయన పాలిటిక్స్ పై పాజిటివ్ గా స్పందించిన దాఖలాలు లేవు. ఈ విషయమై ఎప్పుడు అడిగినా దాటవేత దోరణి ప్రదర్శిస్తూ వచ్చిన ఆయన తాజాగా మరోసారి అలాంటి వైఖరే ప్రదర్శించారు.

    'లింగా' షూటింగులో భాగంగా ఇటీవల మంగుళూరు వచ్చిన రజనీకాంత్ ను ఓ రిపోర్టరు రాజకీయ ప్రవేశంపై ప్రశ్నించగా...రజనీ స్పందిస్తూ....'దేవుడు నడిపిస్తే ఆ వైపు తప్పకుండా నడుస్తాను' అని స్పందించారు. మొత్తానికి రజనీకాంత్ రాజకీయాలపై నొప్పించక, తానొవ్వక అన్నట్లు వ్యవహరిస్తున్నారు.

     Rajinikanth about politics

    'లింగా' సినిమా రిజలీ పై రజనీకాంత్ స్పందిస్తూ తన పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 12న 'లింగా' విడుదల అవుతుందని ప్రకటించారు. ఈ చిత్రంలో రజనీ దొంగగా, ఇంజినీరు గా ద్విపాత్రలలో కనపించనున్నారు. దర్శకుడు కేఎస్‌ రవికుమార్ ఇందుకోసం బాణీలను త్వరగా సమకూర్చి ఇవ్వాలని ఏఆర్‌ రెహ్మాన్‌ను అడిగారట. బాలీవుడ్‌, హాలీవుడ్‌ చిత్రాలతో బిజీగా ఉన్న రెహ్మాన్‌.. రజనీ సినిమాపై దృష్టి పెట్టినట్లు సమాచారం.

    చిత్రంలో అనుష్క, సోనాక్షి సిన్హా హీరోయిన్స్. జగపతిబాబు ముఖ్య పాత్రలో కనిపిస్తారు. కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. రాక్‌లైన్‌ వెంకటేష్‌ నిర్మాత. ఈ సినిమాలో నయనతార ప్రత్యేక గీతంలో నర్తించనుందని సమాచారం. ఈ చిత్రానికి సంగీతం: ఎ.ఆర్‌.రెహమాన్‌, ఛాయాగ్రహణం: ఆర్‌.రత్నవేలు.

    English summary
    
 Rajinikanth confirmed that ‘Lingaa’ will release on December 12, as his birthday treat to his fans if all things go as per plans and said at present he is healthy with god’s grace. Answering to an oft repeated question on whether he will be entering politics the star said, he will do that if God wishes so.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X