twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రజనీకాంత్‌ పై వార్త నిజమా?...షాక్(ఫొటో ఫీచర్)

    By Srikanya
    |

    చెన్నై : రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్ పై రకరకాల వార్తలు వస్తూంటాయి. అయితే అవి ఎంత వరకూ నిజం అనేది ఆయన ఆ స్ధాయి వారు నోరు విప్పితే గాని తెలియదు. తాజాగా 2016 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా భాజపా పావులు కదుపుతున్నట్లు సమాచారం. తమిళనాడులో పార్టీ బలోపేతానికి ఇప్పటి నుంచే కసరత్తులు ప్రారంభిస్తోంది. ఇందులో భాగంగనే రజనీని రంగంలోకి తీసుకొస్తున్నట్లు సమాచారం. ఆయన అంగీకరిస్తే.. ఏకంగా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించేందుకు ఆ పార్టీ సిద్ధంగా ఉన్నట్లు వినికిడి. దాంతో అభిమానులు ఆనందపడుతున్నారు. మరికొందరు షాక్ అవుతున్నారు.

    అయితే ప్రస్తుతం 'లింగా' చిత్రీకరణలో బిజీగా ఉన్న రజనీ... త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. మరోవైపు 'లింగా' చిత్రంలోనూ ప్రజాప్రతినిధిగా ఓ పాత్ర పోషిస్తున్నారని, అందులోనూ రాజకీయంగా కొన్ని డైలాగులు ఉన్నాయని కోలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. మరి.. 'అరుణాచలం' తన రాజకీయ ప్రస్తావనపై ఏమంటారో వేచిచూడాల్సిందే.

    స్లైడ్ షోలో ...అసలేం జరుగుతోంది?

    ఈ సారి తేలుస్తారా

    ఈ సారి తేలుస్తారా

    తనదైన స్టయిల్‌తో అశేష ప్రేక్షకాభిమానులను సొంతం చేసుకున్న రజినీకాంత్‌ రాజకీయ ప్రవేశంపై ఎప్పటినుంచో వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ రజనీ మాత్రం ప్రతిసారీ దేవునిదే నిర్ణయమంటూ వెళ్లిపోతున్నారు.

    అమితాషాకు భాధ్యత

    అమితాషాకు భాధ్యత

    ఈసారి భాజపా మాత్రం ఆయనను ఒప్పించి పార్టీలోకి తెచ్చేందుకు పావులు కదుపుతోందని రాష్ట్ర రాజకీయవర్గాల్లో ఒక్కసారిగా ప్రచారం మొదలైంది. భాజపా అధిష్ఠానం ఈ విషయంలో తలమునకలై ఉందని, ఆ బాధ్యతను అమిత్‌షాకు అందించారని సమాచారం.

    భాజపా ప్రియుడిగా

    భాజపా ప్రియుడిగా

    వాయ్‌పేయి ప్రధాని అభ్యర్థిగా పోటీ చేసిన తరుణంలో భాజపాపై ఉన్న అభిమానాన్ని రజనీకాంత్‌ చాటుకున్నారు. అప్పట్లో భాజపాకు మద్దతుగానూ మాట్లాడారు. కానీ తన అభిమానులు కూడా అదే తీరు ప్రదర్శించాల్సిన అవసరం లేదని, వారి వ్యక్తిగతంగా వెళ్లాలని కూడా కోరారు. అప్పటి నుంచే రజనీ భాజపా ప్రియుడిగా కనిపించారు. కానీ ఆ తర్వాతి ఎన్నికల నుంచి అసలు ఏ పార్టీ ప్రస్తావనా చేసేవారు కాదాయన.

    రెండు రోజుల క్రితం ఫోన్ లో..

    రెండు రోజుల క్రితం ఫోన్ లో..

    ఈ నేపథ్యంలో మళ్లీ రజనీకాంత్‌ రాజకీయపరంగా వార్తల్లో నిలిచారు. ఆయనను భాజపాలోకి తీసుకొచ్చేందుకు మోడీ తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తున్నట్లు చిత్ర పరిశ్రమలోనూ, రాజకీయవర్గాల్లోనూ జోరుగా ప్రచారమవుతోంది. ఈ విషయమై అమిత్‌షా రెండు రోజుల క్రితం రజినీకాంత్‌తో ఫోనులో మాట్లాడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

    భరోసానే...

    భరోసానే...

    సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ ప్రత్యక్షంగా ఇదివరకు రాజకీయాల్లోకి అడుగుపెట్టకపోయినా.. ఒకట్రెండు సార్లు మాత్రం ఆయన పరోక్షంగా తన మద్దతు 'మాట'ను మాత్రం ఇచ్చారు. డీఎంకేకు ఓసారి దూరం నుంచి వత్తాసు పలకగా.. జీకే మూప్పనార్‌ నేతృత్వంలోని తమిళ మానిక కాంగ్రెస్‌ పార్టీకి కూడా అలాంటి భరోసానే ఓసారి ఇచ్చారు.

    మాటసాయం

    మాటసాయం

    కానీ తాను రాజకీయాలవాదిని కాదని పలుమార్లు ఆయన దూరం జరిగారు. ఓ సందర్భంలో పొగతాగే సన్నివేశాలపై పీఎంకే రజనీపై విరుచుకుపడగా.. అప్పుడు పీఎంకే ప్రత్యర్థికి 'మాటసాయం' చేశారు సూపర్‌స్టార్‌. అంతే తప్ప ఆయన రాజకీయ అరంగేట్రం గురించి ఏనాడూ ప్రస్తావించలేదు.

    'ఏ పార్టీలో చేరాలనుకుంటున్నారు'

    'ఏ పార్టీలో చేరాలనుకుంటున్నారు'

    ...తన రాజకీయ అరంగేట్రానికి సంబంధించి పాత్రికేయులు ఇలా ఏ రీతిలో ప్రశ్నించినా?.. ఆయన తొలి సమాధానం 'చూపుడువేలు ఆకాశాన్ని చూపిస్తుంది'!

     వివరంగా చెప్పమంటే...

    వివరంగా చెప్పమంటే...

    ''నేను రాజకీయాల్లోకి రావడం దైవాజ్ఞ. ఆయన ఆజ్ఞ ఇస్తే. నా పాత్ర నిమిత్తమాత్రమే. ఇందులో నా అభిప్రాయం ఉండదు. దేవుని అభిప్రాయమే నా అభిప్రాయం.''

    English summary
    
 Rajinikanth yet again makes headlines for rumours about his pariticipation in politics. However, new reports say that Superstar Rajinikanth is being considered by Narendra Modi's close confidante Amit Shah to join the BJP.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X