twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    40 రోజులు రామానాయుడు స్టూడియోలోనే రామ్ చరణ్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కాజల్ జంటగా, క్రియేటివ్ దర్శకుడు కృష్ణ వంశీ దర్శకత్వంలో, శివబాబు బండ్ల సమర్పణలో, పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై అత్యంత భారీ తారాగణంతో నిర్మిస్తున్న చిత్రం యూనిట్ కన్యాకుమారి, పొలాచ్చి షెడ్యూల్ పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరారు.

    ఏప్రిల్ 21 నుండి హైదరాబాద్‌లో రామానాయుడు సినీ విలేజ్ లోని హౌస్ సెట్‌లో ప్రధాన తారాగణం అంతా నటించే భారీ షెడ్యూల్ దాదాపు 40 రోజులు జరుగుతుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కాజల్ జంటగా వస్తున్న ఈ చిత్రానికి 'గోవిందుడు అందరి వాడేలే' అనే టైటిల్ ఖరారు చేయడంతో అభిమానులతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌లో భారీగా అంచనాలు పెరిగాయి.

    Ram Charan 'Govindudu Andarivadele' news

    ఈ సందర్భంగా నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడుతూ...'మా చిన్న బాస్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'గోవిందుడు అందరి వాడేలే' చిత్రం పిబ్రవరి 6న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి కన్యాకుమారి, పొలాచ్చిలోని చక్కటి లొకేషన్స్‌లో షూటింగ్ జరుపుకున్నాము. ఏప్రిల్ 21 నుండి హైదరాబాద్‌లోని రామానాయుడు సినీ విలేజ్‌లోని హౌస్ సెట్‌లో ప్రధాన తారాగణం అంతా పాల్గొనే సన్నివేశాలు చిత్రీకరిస్తారు అన్నారు.

    ఈ షెడ్యూల్ దాదాపు 40 రోజుల జరుగుతుంది. దీని తరువాత ఫారిన్‌లో సాంగ్స్ చిత్రీకరణ జరుగుతుంది. రామ్ చరణ్, కాజల్, రాజ్ కిరణ్, శ్రీకాంత్ కాంబినేషన్లో చిత్రీకరించిన సన్నివేశాలు సూపర్బ్ గా రావడమే కాక ఎంటర్టెన్మెంట్ గా ఉంటాయి. అందరూ ఎంజాయ్ చేస్తూ నటిస్తున్నారు. శ్రీకాంత్ కి జోడీగా కమలినీ ముఖర్జీ నటిస్తున్నారు అన్నారు. చక్కటి ఫ్యామిలీ ఎంటర్టెనర్‌గా తెలుగు సంప్రదాయాలు ఉట్టిపడేలా దర్శకుడు కృష్ణ వంశీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సమీరా రెడ్డి సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నట్లు బండ్ల గణేష్ తెలిపారు.

    English summary
    Mega Powerstar Ram Charan starrer ‘Govindudu Andarivadele’ unit has finished its shooting schedules at Kanyakumari, Polachhi in recent and reached Hyderabad. They will be resuming it at Ramanaidu Cine Village, Hyderabad from 21st of this month which may last for 40 days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X