twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రామ్ చరణ్ గురించి వార్త...అందరూ షాక్

    By Srikanya
    |

    హైదరాబాద్ : కొన్ని వార్తలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ప్రస్తుతం రామ్ చరణ్ ...టాలివుడ్ సర్కిల్స్ లో అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. రామ్ చరణ్ కేవలం సినిమా నటుడుగానే ఉండదలుచుకోలేదు. ఆయన పెద్ద బిజినెస్ మ్యాన్ గా కూడా ఎదగదలుచుకున్నారు. అందులో భాగంగా ఆయన విమానయాన బిజినెస్ లోకి దిగుతున్నారు. ఈ మేరకు ఆయన ప్రభుత్వం నుంచి అనుమతి సంపాదించుకున్నారు. ఆయన నిర్వహించబోయే విమానయాన సంస్ధ పేరు టర్బో మేఘ. దీన్ని టాలీవుడ్ లో ఎవరూ నామ మాత్రంగా అయినా ఊహించకపోవటంతో అందరూ దీని గురించే చర్చించుకోవటం జరుగుతోంది.

    హైదరాబాద్‌ కేంద్రంగా 2013 మార్చి 14న టర్బో మేఘా ఎయిర్‌వేస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ నమోదైంది. ఈ సంస్థ డైరెక్టర్లుగా కొణిదెల రామ్‌చరణ్‌ తేజ్‌, వంకాయలపాటి ఉమేశ్‌ ఉన్నారు. అధీకృత పెట్టుబడిగా రూ.15 కోట్లు, చెల్లించిన మూలధనంగా రూ.12.01 కోట్లు పెట్టుబడి పెట్టారు.

    Ram Charan's New Airlines - Turbo Megha

    వివరాల్లోకి వెళితే...గత నెల రోజుల వ్యవధిలో కేంద్ర పౌర విమానయాన శాఖ 6 విమానయాన సంస్థలకు నిరభ్యంతర పత్రాల (ఎన్‌ఓసీ)ను అందజేసింది. విమానయాన శాఖ అనుమతించిన సంస్థల్లో హైదరాబాద్‌కు చెందిన టర్బో మేఘా కూడా ఉంది. ఈ సంస్థకు ఇద్దరు డైరెక్టర్లు ఉండగా.. వీరిలో ఒకరు ఎంపీ చిరంజీవి తనయుడు, సినీహీరో రామ్‌చరణ్‌ తేజ్‌ కావడం గమనార్హం. మరో డైరెక్టర్‌ వంకాయలపాటి ఉమేష్‌.

    ఇప్పటివరకు తెలుగు రాష్ట్రానికి సంబంధించి, విమానయాన సేవల్లో విజయవాడకు చెందిన ఎయిర్‌కోస్టా ఒక్కటే సేవలు అందిస్తోంది. ప్రభుత్వం నుంచి ఎన్‌ఓసీ పొందిన మిగతా అయిదు సంస్థల్లో ఎయిర్‌వన్‌ ఏవియేషన్‌, జెక్సస్‌ ఎయిర్‌, ప్రీమియర్‌ ఎయిర్‌లు జాతీయ స్థాయి సేవలకు సన్నాహాలు చేసుకుంటుండగా..ఎయిర్‌ కార్నివాల్‌, జావ్‌ ఎయిర్‌లైన్స్‌లు ప్రాంతీయ సేవలకు పరిమితం కానున్నాయి. దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ఈ సంస్థలకు పౌరవిమానయాన మంత్రి అశోక్‌గజపతి రాజు ఎన్‌ఓసీ జారీ చేసినట్లు తెలుస్తోంది. సాధ్యమైనన్ని నగరాలకు విమానాలు నిర్వహించాలనే ఆకాంక్షను మంత్రి పలుమార్లు వ్యక్తంచేశారు.

    చార్టర్‌ విమానాలు నిర్వహించే సంస్థలతో పాటు నాన్‌ షెడ్యూల్డ్‌ ఆపరేటర్లు షెడ్యూల్డ్‌ ఆపరేటర్లుగా మారేందుకు అనుమతిస్తామని కూడా పౌర విమానయాన శాఖ ప్రకటించిన నేపథ్యంలో తాజా అనుమతులు వచ్చాయి. ఇవన్నీ కార్యకలాపాలు ప్రారంభిస్తే.. దేశంలోని వివిధ ప్రాంతాలకు విమాన సేవలు అందుబాటులోకి రావడమే కాదు.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే రికార్డు స్థాయిలో 8 సంస్థలు విమాన సేవలకు శ్రీకారం చుట్టినట్లు అవుతుంది.


    English summary
    Along with his friend Vankayalapati Umesh, actor Ram Charan Tej Konidela will be now setting up his own regional airlines business that is named 'Turbo Megha'.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X