twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'చుట్టాలబ్బాయి'గా దగ్గుపాటి రానా

    By Srikanya
    |

    హైదరాబాద్: బాహుబలి,రుద్రమదేవి చిత్రాలతో బిజీగా ఉన్న దగ్గుపాటి రానా త్వరలో 'చుట్టాలబ్బాయి'గా కనిపించి అలరించనున్నారు. ఈ టైటిల్ ని రానా,పరుసరామ్ కాంబినేషన్ లో రూపొందే చిత్రానికి ఖరారు చేసారు. ఈ చిత్రాన్ని సురేష్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించనుంది. 'యువత', 'ఆంజనేయులు', 'సోలో' చిత్రాలతో మాస్, కుటుంబ ప్రేక్షకులనూ మెప్పించిన పరుశరామ్ గత కొంతకాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఆ మధ్యన రామ్ తో చిత్రం ఓకే అయ్యి ఆగిపోయింది.

    దాంతో రానా కోసం ఇప్పుడు మరో కథ సిద్ధం చేసుకుని సురేష్ బాబుకి వినిపించారు. అలాగే ఇప్పటికే రానా సైతం స్టోరీ లైన్‌ విని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పూర్తి స్థాయిలో స్క్రిప్టు తయారు చేసే పనిలో ఉన్నారు పరశురామ్‌. ఈ చిత్రానికి 'చుట్టాలబ్బాయి' అనే పేరు నిర్ణయించినట్టు తెలుస్తోంది. యువత, కుటుంబ ప్రేక్షకుల్ని అలరించే కథాంశమని భోగట్టా. ప్రస్తుతం హీరోయిన్ ఎంపికపై కసరత్తు జరుగుతోంది.

    రానా విషయానికి వస్తే....రుద్రమదేవిలో రానా పాత్ర చుట్టూ కథ నడవనుంది. ఈ చిత్రంలో చాళుక్య వీరభద్రునిగా.... రానా కనిపిస్తారు. మిగతా కీలకపాత్రల్లో రాణీ రుద్రమగా....అనుష్క, , గణపతిదేవునిగా.... కృష్ణంరాజు, శివదేవయ్యగా... ప్రకాష్‌రాజ్, హరిహరదేవునిగా.... సుమన్, మురారిదేవునిగా... ఆదిత్యమీనన్, నాగదేవునిగా.... బాబా సెహగల్, కన్నాంబికగా.... నటాలియాకౌర్, ముమ్మడమ్మగా.... 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' ఫేం జరాషా, మదనికగా.... హంసానందిని, అంబదేవునిగా.... జయప్రకాష్‌రెడ్డి, గణపాంబగా.... అదితి చంగప్ప, కోటారెడ్డిగా.... ఆహుతి ప్రసాద్, టిట్టిబిగా..... వేణుమాధవ్,ప్రసాదాదిత్యగా .....అజయ్ కనిపించనున్నారు.

    Rana

    ప్రస్తుతం కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మరోవైపు గ్రాఫిక్ వర్క్ జరుగుతోంది. తెలుగుజాతి గర్వించే కాకతీయ వైభవాన్ని కళ్లకు కట్టే సినిమా ఇది. దేశ చలనచిత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే రీతిలో 'రుద్రమదేవి'ని తెరకెక్కించాలన్నదే నా లక్ష్యం. అందుకే ఏ విషయంలోనూ రాజీపడకుండా అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం అంటున్నారు గుణశేఖర్. 'రుద్రమదేవి'కోసం భారీ సెట్...డిటేల్స్ అనుష్క ప్ భారత చలన చిత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా 'రుద్రమదేవి' చిత్రాన్ని రూపొందించాలన్న పట్టుదలతో ఏ విషయంలోనూ రాజీ పడకుండా అత్యున్నత సాంకేతిక విలువలతో ఇంటర్నేషనల్ స్టాండర్స్‌తో తీస్తున్నామని దర్శకుడు గుణశేఖర్ చెప్పుకొచ్చారు.

    ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కె.రాంగోపాల్ మాట్లాడుతూ..'తెలుగుజాతి గర్వించే రీతిలో కాకతీయ వైభవాన్ని కళ్లకు కట్టినట్లు చూపించేలా 'రుద్రమదేవి' చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాం అన్నారు. ఈ చిత్రానికి సంగీతం : ఇళయరాజా, ఆర్ట్: తోట తరణి, ఫోటోగ్రపీ : అజయ్ విన్సెంట్, కాస్టూమ్స్ : నీతా లుల్లా(జోధా అక్భర్ ఫేం), ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్, విఎఫ్ ఎక్స్ : కమల్ కణ్ణన్, మాటలు : పరుచూరి బ్రదర్స్, పాటలు : సిరివెన్నెల, మేకప్ : రాంబాబు, నిర్మాత-కథ-స్ర్కీన్ ప్లే-దర్శకత్వం : గుణ శేఖర్.'

    English summary
    
 Rana Daggubati going to Start a New Project under the Direction of Parasuram.Chuttalabbayi is the title under consideration for this family drama and the final draft is under preparation now. This Movie will be produced by his home Banner Suresh Productions by Suresh Babu and Movie details will be reviled soon.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X