twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘రుద్రమదేవి’ నగల మాయం: అసలు దొంగ ఎవరంటే..?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: అనుష్క ప్రధాన పాత్రలో గుణశేఖర్ దర్శక నిర్మాణంలో తెరకెక్కుతున్న 'రుద్రమదేవి' చిత్రానికి సంబంధించిన నగలు మాయం కావడం ఇటీవల సంచలన సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో పోలీసులు శరవేగంగా విచారణ జరుపుతున్నారు. తాజాగా కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి.

    నాదేళ్ల ఆంజనేయులు శెట్టి నగల కంపెనీ నుండి సినిమా షూటింగు కోసం నగలు అద్దెకు తెచ్చారు. జులై 19వ తేదీన షూటింగ్ సెట్లో నగలు మాయం అయ్యాయి. నగల కంపెనీ ఎగ్జిక్యూటివ్ రవిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తూ అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. నగలు మాయం వ్యవహారంలో అతనిదే కీలక పాత్ర అని అనుమానిస్తున్నారు.

    రవి పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఆందోళనకు గురైన అతని భార్య ఇంట్లో నగలు ఉన్నట్లు నగల కంపెనీ ప్రతినిధులకు సమాచారం అందించి నట్లు సమాచారం. కంపెనీ ప్రతినిధులు గచ్చిబౌలి పోలీసులకు చెప్పగా.....వారు రవి ఇంటికి వెళ్లి దాదాపు 10 కేజీల గిల్ట్ నగలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

    Ravi arrested in Rudrama Devi movie jewellery case

    ఈ వ్యవహారంతో రవి ఒక్కసారిగా మాట మార్చారని....షూటింగ్ వద్దకు నగలు తీసుకొచ్చానని అప్పటి వరకు చెప్పుకొచ్చిన రవి, ఇంట్లో కొన్నినగలు ఉన్నట్లు కొత్త వాదన మొదలు పెట్టారని, తమ ఇంట్లో నగలు ఉన్నట్లు కంపెనీ ప్రతినిధులకు తెలియదని చెప్పినట్లు సమాచారం. కంపెనీ ప్రతినిధులకు తెలియకుండా రవి ఇంట్లో నగలు ఎందుకు పెట్టుకున్నాడనే విషయం అర్థం కావడం లేదు.

    కాగా....నగల కంపెనీ నుండి షూటింగ్ కోసం గిల్ట్ నగలతో పాటు, కొన్ని బంగారు నగలు కూడా పంపినట్లు కంపెనీ ప్రతినిషధులు చెబుతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి కేసు ఓ కొలిక్కి రావడంతో పోలీసులు పూర్తి విచారణ అనంతరం అసలు నగల దొంగ ఎవరు అనే విషయాన్ని బయట పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

    నగలు ఇలా మాయం అయ్యాయి...
    ఈ చిత్రంలో రుద్రమదేవి పాత్రను పోషిస్తున్న అనుష్క అలంకరణకు సంప్రదాయ నగలు ఉపయోగిస్తున్నారు. నగలను చెన్నైలోని నాదెండ్ల అంజనేయశెట్టి సంస్థ సరఫరా చేస్తోంది. ఆ సంస్థ ప్రతినిధి రవి సుబ్రమణ్యం వాటిని చెన్నై నుంచి తీసుకొచ్చి నిర్వాహకులకు ఉదయాన్నే ఇచ్చి షూటింగ్‌ అనంతరం తిరిగి తీసుకెళ్తున్నారు. శనివారం ఉదయం సుబ్రమణ్యం కిలోన్నర బరువున్న ఆభరణాలతో వచ్చారు. మధ్యాహ్నం నగల సంచిని షూటింగ్‌ జరుగుతున్న ప్రాంతంలో ఉన్న విశ్రాంతి వ్యాన్‌లో డ్రైవర్‌ సీటు వెనుక ఉంచారు. భోజనం అనంతరం చూడగా సంచిలో నగల పెట్టెలు కనిపించలేదు.

    English summary
    
 Nathella Anjaneyulu Chetty jewellers executive Ravi arrested in Rudrama Devi movie jewellery case.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X