twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రవితేజ ‘పవర్’ వస్తోంది, రిలీజ్ ఎప్పుడంటే?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: మాస్ మహారాజ రవితేజ హీరోగా రాకలైన్ ఎంటర్టెన్మెంట్స్ ప్రై.లి పతాకంపై కె.ఎస్.రవీంద్రనాథ్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ నిర్మిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టెనర్ 'పవర్'. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. పోస్టు ప్రొడక్షన్ పనులు కూడా త్వరలోనే ప్రారంభమవుతాయని తెలుస్తోంది.

    సినిమా యూనిట్ సభ్యుల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రాన్నిజూన్ నెలలో ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. రవితేజ గత చిత్రం 'బలుపు' కూడా గతేడాది జూన్ నెలలో విడుదలైన సంగతి తెలిసిందే. త్వరలోనే విడుదల విషయమై నిర్మాతల నుండి ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

    Raviteja's Power movie release date

    రవితేజ సరసన హన్సిక హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం, పరుచూరి వెంకటేశ్వరరావు, బ్రహ్మాజీ, పోసాని కృష్ణ మురళి, ముఖేష్ రిషి, రావు రమేష్, మిర్చి సంపత్, సుబ్బరాజు, సప్తగిరి, సురేఖా వాణి, జోగి బ్రదర్స్ తదితరులు ముఖ్య పాత్రల్ని పోషిస్తున్నారు.

    ఈ చిత్రానికి సంగీతం : ఎస్ఎస్. థమన్, ఫోటోగ్రఫీ: ఆర్థర్ ఎ. విల్సన్, ఆర్ట్ : బ్రహ్మ కడలి, ఎడిటర్: గౌతం రాజు, మాటలు : కోన వెంకట్, స్ర్కీన్ ప్లే: కె. చక్రవర్తి, మోహన్ కృష్ణ, కో డైరెక్టర్: నందగోపాల్ కురుళ్ల, ప్రొడక్షన్ కంట్రలర్: పి.ఎ.కుమార్ వర్మ, నిర్మాత: రాక్ లైన్ వెంకటేష్, కథ-దర్శకత్వం: కె.ఎస్.రవీంద్రనాథ్(బాబి).

    English summary
    Mass Maharaja Raviteja starrer Power film has reached the final leg of the shoot and the post-production works will commence in a while. The makers are planning to release Power movie in June. Incidentally, Ravi Teja’s previous film Balupu which was a hit was also released in June.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X