twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ కల్యాణ్ విషయమై క్లారిటీ ఇచ్చిన వర్మ

    By Srikanya
    |

    హైదరాబాద్ : పవన్‌కల్యాణ్ లో నిజాయితీ ఉంది. చూట్టానికి బాగుంటాడు. సినిమాల్లో అయితే... థియేటర్లోనే చూడాలి. రాజకీయాల్లోకొస్తే రోజూ న్యూస్ చానల్స్‌లో చూడొచ్చు కదా . అయినా ప్రజలకు సేవ చేయాలనే తపన ఉందనే... పవన్‌ కల్యాణ్‌ని రాజకీయాల్లోకి రమ్మని పిలుస్తున్నాను. మరి మీరెందుకు రారు అని అడగొచ్చు... నాకు ప్రజా సేవ చేయాలన్న ఆలోచన లేదు కదా. అన్నారు రామ్ గోపాల్ వర్మ. రాజకీయాల్లోకి రావాలని ఎందుకు పవన్‌కల్యాణ్ కి పదేపదే చెబుతున్నారు? అన్న ప్రశ్నకు ఆయన ఇలా సమాధానమిచ్చారు. ట్విట్టర్ లో ఆయన పవన్ కళ్యాణ్ ...రాజకీయాల్లోకి రావాలని కామెంట్స్ చేసారు. దానిని గురించి మీడియాకు ప్రశ్నిస్తే వర్మ ఇలా స్పందించారు. ఆయన దర్శకత్వంలో తెలుగు, హిందీల్లో తెరకెక్కిన 'సత్య2' ఇటీవల విడుదలైంది. ఈ సందర్భంగా ఆయన శనివారం హైదరాబాద్‌లో విలేకర్లతో మాట్లాడారు.

    అలాగే 'సత్య2' తెలుగు సినిమా విషయంలో సెన్సార్‌ దగ్గర కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ఈ విషయంలో పోలీసుల్ని ఆశ్రయించాలనే ఆలోచన ఉంది. ఈ విషయంపై నాంపల్లి కోర్టులో క్రిమినల్‌ కేసు పెట్టాలనుకుంటున్నా... అన్నారు దర్శకులు రామ్ గోపాల్ వర్మ. ''నేను 'సత్య' సినిమా తీసేటప్పటికి సాంకేతిక పరిజ్ఞానం ఇప్పటిలా అభివృద్ధి చెందలేదు. ఏం చేయాలన్నా, చేసినా... ఆ పని చేసిందెవరో.. చేయించిందెవరో తెలిసిపోయేది. ఇప్పుడు పరిస్థితి అలా లేదు. అంతా ఫోన్‌లలోనూ, ఇంటర్నెట్‌లోనూ ఒకరికి ఒకరు తెలియకుండానే జరిగిపోతోంది. ఇప్పుడు చంపాలనుకునేవాడికి అవతలి వ్యక్తి ఎవరు అనేది తెలిస్తే చాలు. ఇలాంటి ఆలోచనలే నాతో 'సత్య2' సినిమాని తీసేలా చేశాయి'' అన్నారు

    ఇక ''నా సినిమా అందరికీ నచ్చాలని ఏముంది. నచ్చినవాళ్లు బాగుంది అంటే.. నచ్చనివాళ్లు బాగోలేదు అంటారంతే. నా సినిమా కోసం పెద్దగా ఇమేజ్‌ ఉన్న నటుడు వద్దనుకున్నాను. రెండు భాషల్లోనూ హీరోల ఎంపిక ఇలాగే జరిగింది. స్టార్స్‌తో సినిమాలు తీయడం నాకు చేతకాదు. వాళ్లతో సినిమాలంటే ఏవో ఆలోచనలు, ఇబ్బందులు ఉంటాయి. అందుకే నా వల్ల కాదు. ''

    ఓ కూడలి దగ్గర రెడ్‌ లైట్‌ పడినప్పుడు 99 శాతం మంది మళ్లీ గ్రీన్‌లైట్‌ పడే వరకు వేచి చూస్తారు. ఏదో ఒక్క శాతం మంది దాన్ని బ్రేక్‌ చేసి ముందుకెళ్తారు. అలాంటివాళ్ల మీదే నా కన్ను పడుతుంది. అలాంటివాళ్ల నుంచి ఎన్నో కొత్త కథలొస్తాయి. ఎందుకంటే వాళ్లు ఏ అవసరం ఉండి సిగ్నల్‌ జంప్‌ చేశారనేదే నాకు ముఖ్యం. అయితే నేను ఆ 99శాతం మందిలోనూ ఉండను. అందరికీ పైన ఉండి వారిని చూస్తుంటాను. నాకు ఎవరి నుంచో ఆపద ఉందని పోలీసులు చెప్పారు. అయితే నాకు అలా ఏమీ అనిపించడం లేదు. ఇంటెలిజెన్స్‌ బ్యూరో కంటే నాకే ఎక్కువ తెలుసు అని నమ్మకం అన్నారు.

    English summary
    RGV says that he is not intrested in poltics. He says that only he wants to see pawan as a politision.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X