twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఓటింగ్ పెంచేందుకు రామ్ గోపాల్ వర్మ ఐడియా...

    By Bojja Kumar
    |

    ముంబై: ముంబైలో అత్యల్పశాతం ఓటింగు నమోదు కావడంతో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అధికారులకు సరికొత్త ఐడియా ఇచ్చారు. ఇంటి నుండే ఓటు వేసే విధంగా సిస్టం రూపొందించాలని, అలా చేస్తే 100 శాతం ఓటింగ్ నమోదు అవుతుందని రామ్ గోపాల్ వర్మ సూచిస్తున్నారు.

    'ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రజలు బయటకు వెళ్లి ఓటు వేయడానికి ఎవరూ ఇష్ట పడటం లేదని, ప్రభుత్వం ఇంటి నుండే ఓటే వేసే విధంగా ఏర్పాట్లు చేస్తే తప్పకుండా ఓటింగ్ శాతం పెరుగుతుందని, 100 శాతం ఓటింగ్ నమోదైనా ఆశ్చర్య పడాల్సిన పని లేదు' అంటూ వర్మ తన ట్విట్టర్లో కామెంట్ చేసారు.

    RGV suggests a solution to low voter turnout

    ట్విట్టర్లో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ దేశంలో జరిగే పరిస్థితులపై తదనైన రీతిలో స్పందిస్తూ.....రామ్ గోపాల్ వర్మ అందిరినీ ఆకర్షిస్తున్నాడు. రాష్ట్ర విభజన సమయంలోనూ, పవన్ కళ్యాణ్ కొత్త పార్టీ పెట్టిన సమయంలోనూ, ఇలా ప్రతి విషయంలోనూ తన అభిప్రాయాలను ట్విట్టర్ ద్వారా వెల్లడిస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నాడు.

    ఇంటీవల ములాయ సింగ్ రేపిస్టులపై చేసిన వ్యాఖ్యలపై కూడా వర్మ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఇంతకీ వర్మ ఏమని ట్వీట్ చేసాడంటే... ''ములాయం సింగ్ అలా అత్యాచార నిందితులని వెనకేసుకొచ్చాడంటే కచ్చితంగా ఆయనలో ఓ రేపిస్ట్ వుండే వుండుంటాడు. అంతేకాదు, ములాయం యువకుడిగా వున్నప్పుడు ఎన్నిసార్లు అత్యాచారం చేశాడోనని వర్మ అనుమానం వ్యక్తం చేశాడు. లేదంటే అత్యాచారం చేయాలనే ఆలోచనైనా చేసి వుంటాడు'' అని వర్మ ట్వీట్ చేసారు.

    English summary
    "Since ppl dont want 2 go out n vote govt shud devlop a system where people can vote from home..atleast then there will b near 100% vote", Ram Gopal Varma tweeted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X