twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వెటకారం జోరు : కేసీఆర్ పై మళ్లీ వర్మ కామెంట్స్

    By Srikanya
    |

    హైదరాబాద్: ఎప్పుడూ ఎవరో ఒకరిపై కామెంట్స్ చేస్తూ నిత్యం వార్తల్లో ఉండే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఈ సారి ఆయన తన ట్విట్టర్ బాణం మరోసారి గులాబి దళపతి కేసీఆర్ కు గురి పెట్టారు. ఆయన కామెంట్స్ వెనక అంతులేని వెటకారం ఉందని వీటిని చదివిన వారు అంటున్నారు. మరి టీఆర్ఎస్ పార్టీ ఈ ట్వీట్స్ పై ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

    వర్మ ట్వీట్ చేస్తూ ... ఆయనది లవ్ లీ ఫేస్ అని,ఆయన అంతర్ సౌందర్యం,ఆలోచనలు ఆయన ముఖంలో ప్రతిఫలిస్తాయని అన్నారు. ఒకరి ముఖం అంటే వారి లోపలి ఎమోషన్స్ కి ప్రతిరూపమని,ఈ విషయం కేసీఆర్ ముఖం కరెక్టుగా ఎక్సప్లెయిన్ చేస్తుందని అన్నారు.

    RGV tweets target to KCR

    అలాగే కేసీఆర్ ని ఒక్కసారి చూస్తే ప్రపంచంలో ఎవరూ మరిచిపోలేరని, చివరకు గజనీ సైతం గుర్తు పెట్టుకుంటాడని అన్నారు. తనతో ఓ కాలేజ్ అమ్మాయి...కేసీఆర్ పై తమ స్నేహితురాళ్ళలో చాలా మందికి క్రష్ ఉందని చెప్పిందని,వారు సిటీలో ఎక్కడ చూసినా కేసీఆర్ కనపడటాన్ని థ్రిల్ అవుతున్నారని చెప్పారు.

    అయితే ఆడవాళ్లు కేసీఆర్ ని ఇష్టపడటాన్ని తాను ఆశ్చర్యపోలేదని,ఆడవాళ్లు ఎప్పుడూ పవర్ ని కోరుకుంటారని,ముఖ్యంగా కేసీఆర్ ముక్కు ఆ పవర్ ని తెలియచేస్తోందని అన్నారు.అదే అమ్మాయి...హైదరాబాద్ లో మరిన్ని పెద్ద పెద్ద కేసీఆర్ హోర్డింగ్ లు,విగ్రహాలు పెట్టడం ద్వారా మరింత అందంగా తయారవుతుందని అంది. టీఆర్ ఎస్ ఆఫీస్ బయిట తమకు కేసీఆర్ లో దేవుడు ని చూసుకుంటున్నామని, రాముడు,కృష్ణుడు కన్నా ఎక్కువగా అంటూ చెప్పిందని ఆయన ట్వీట్ చేసారు.

    English summary
    
 Ram Gopal Varma tweeted: " The loveliest sight I have ever seen in my life is the lovely face of KCR utmostly beautifying the landscape of hyderabad. KCR's inner beauty of thoughts reflect in the intensity of the expressional beauty of his outer face. A man's face is nothing but his emotions radiating from within his inner soul and that explains the tremendous beauty of KCR'S face"
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X