twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సల్మాన్‌ కేసులో కొత్త ట్విస్ట్

    By Srikanya
    |

    ముంబయి: బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌పై నమోదైన నిర్లక్ష్య డ్రైవింగ్‌ కేసు విచారణలో మరింత జాప్యం చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ కేసుకు సంబంధించిన సాక్షుల వాంగ్మూలాల అసలు ప్రతులతోపాటు కేసు డైరీలు కూడా గల్లంతైనట్లు పోలీసులు న్యాయస్థానానికి తెలియజేశారు.

     Salman Khan's fresh trial in the 2002 hit-and-run case

    2002 సెప్టెంబర్‌ 28న ముంబయిలో సల్మాన్‌ కారు.. ఒక బేకరీ బయట రోడ్డు పక్కన నిద్రిస్తున్న జనంపై నుంచి వెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మరణించగా, నలుగురు గాయపడ్డారు. ఈ కేసుకు సంబంధించి 63 మంది సాక్షుల వాంగ్మూలాల్లో ఏడు మాత్రమే అసలు పత్రాలు ఉన్నాయని, మిగతావి నకలు పత్రాలు ఉన్నాయని పోలీసులు లోగడ న్యాయస్థానానికి తెలియజేశారు.

    తాజాగా కేసు డైరీలు కూడా కనిపించడంలేదని చెప్పారు. తొలుత మేజిస్ట్రేట్‌ కోర్టులో ఈ కేసును విచారించినప్పుడు అసలు పత్రాలు ఉన్నాయని, తర్వాత విచారణను సెషన్స్‌ కోర్టుకు బదిలీ చేసినప్పుడు గల్లంతయ్యాయని పోలీసులు తెలిపారు.

    English summary
    
 Salman Khan's fresh trial in the 2002 hit-and-run case looked set for further delay with the police informing the court that after most original statements of witnesses even the case diaries have gone missing.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X