twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సమంత ఊరిస్తోంది...అదేనంటారా

    By Srikanya
    |

    హైదరాబాద్: తెలుగులో ఈ మధ్యకాలంలో వచ్చిన మల్టి స్టారర్ సీతమ్మ వాకిట్లో సిరి మల్లె చెట్టు. ఈ చిత్రం లో చేసిన సమంతకు మంచి పేరే వచ్చింది. ఆమె మరో చిత్రం కమిటయ్యాయని చెప్తోంది. అయితే ఏ సినిమా ఒప్పుకుందో చెప్పకుండా మరో మల్టి స్టారర్ ఒప్పుకున్నానంటూ ట్వీట్ చేసి అందరినీ ఊరిస్తోంది. అయితే ఎన్టీఆర్,నాగార్జున కాంబినేషన్ లో చిత్రమని టాక్. అయితే తాను చాలా ఎక్సైట్ మెంట్ తో ఉన్నావని త్వరలోనే పూర్తి డిటేల్స్ ఇస్తానంటోంది కాబట్టి వెయిట్ చేద్దాం.

    అలాగే..... '' ముఖ్యంగా కథ, పాత్రల విషయంలో పక్కాగా ఉంటాను. అలాగని ప్రతిసారీ 'ఏ మాయ చేసావె', 'ఈగ', 'మనం'లాంటి పాత్రలే దొరకాలని కోరుకోను. అది సాధ్యం కాదు కూడా. ఒక కథగా చూసినా అది ప్రేక్షకుల మనసుకు హత్తుకొనేలా ఉండాలి. అప్పుడే అంగీకరిస్తా. హీరోయిన్ అంటే కేవలం గ్లామర్‌ కోసమే అన్నట్టు ఉండకూడదు. నా దగ్గరికొచ్చిన ఆ తరహా కథల్ని చాలానే తిరస్కరించా. నా బలమో, బలహీనతో తెలియదు కానీ విన్న ఓ కథగానీ, పాత్రగానీ నేను నమ్మలేకపోతే అస్సలు చేయను'' అని చెప్పుకొచ్చింది.

    Samantha in One more Multi-Starrer

    'మనం'లో ఇటు అందంతోనూ, అటు అభినయంతోనూ అదరగొట్టేసింది. అందరికళ్లనూ తనవైపు తిప్పుకొంది. అక్కినేని హీరోలంతా కలిసి నటించిన ఆ చిత్రంలో సమంత పోషించిన పాత్రకి కూడా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఎలాంటి పాత్ర అప్పజెప్పినా తాను న్యాయం చేయగలుగుతానని మరోసారి నిరూపించింది సమంత. వరుస విజయాలతో దూసుకెళుతున్న సమంత తెలుగుతో పాటు ఇప్పుడు తమిళంలోనూ బిజీ అయిపోయింది.

    అక్కడ కాసింత గ్లామర్‌పాళ్లు ఎక్కువుండే పాత్రలు పోషిస్తున్నట్టు సమాచారం. ''నటనను నమ్ముకొనే వచ్చాను. అందాల ప్రదర్శన బ్రహ్మ విద్య కాదు. అది ఎవరైనా చేస్తారు. పాత్రలకు తగ్గట్టుగా ఒదిగిపోవడంలోనే అసలు ప్రతిభ దాగుంది'' అని సమాధానమిచ్చింది సమంత. సమంత ప్రస్తుతం తెలుగులో ఎన్టీఆర్‌తో 'రభస'లో చేస్తోంది. తదుపరి అల్లు అర్జున్‌తో కలిసి ఓ చిత్రంలో ఆడిపాడుతుంది. తమిళంలో మాత్రం మూడు చిత్రాలతో హల్‌చల్‌ చేస్తోంది. ఇక సమంత మరోసారి మాయ చేసింది.

    English summary
    Samantha tweeted that "Excited about a new multistarrer film I might be doing. Hope everything works out. Details soon,".
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X