twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అయ్యో... మర్చిపోయానే: సమంత

    By Srikanya
    |

    హైదరాబాద్ : సమంత రీసెంట్ గా రిలీజైన ఆటోనగర్ సూర్య చిత్రం ప్రమోషన్ లో భాగంగా ఓ ఇంటర్వూ ఇచ్చింది. అందులో నాగ చైతన్య గురించి, దేవకట్టా గురించి, నిర్మాతల గురించి చెప్పుకొచ్చింది...కానీ హీరో ప్రెండ్ గా చేసిన నందు గురించి, హీరో మామయ్య గా చేసిన సాయి కుమార్ గురించి మర్చిపోయింది. దాంతో వీరిద్దరనీ తాను ఇంటర్వూలో మర్చిపోయానంటూ ట్వీట్ చేసింది.

    సమంత ట్వీట్ చేస్తూ.... నేను ఆటోనగర్ సూర్య కి ఇచ్చిన ఇంటర్వూలో సపోర్టింగ్ కాస్ట్ గురించి మాట్లాడటం మర్చిపోయాను. ఎంటైర్ టీమ్ అందరికీ ధాంక్స్. సాయికుమార్ సార్, అజయ్, నందు వీరందరికీ కూడా. నందు కిచ్చాగా సూపర్బ్ గా ఉన్నాడు. అతనికి మంచి భవిష్యత్ ఉండాలని ఆశిస్తున్నాను అంది.

    ఆర్ధిక ఇబ్బందులలో చాలా కాలం ఆగిపోయి, మొత్తానికి విడుదల అయి 'ఆటోనగర్‌ సూర్య' ఆశించిన మేరకు ప్రేక్షకులను ఆకట్టుకోవటంలో దారుణంగా విఫలమైందనే సంగతి తెలిసిందే. అయితే విడుదల అవటమే చాలా వరకూ విజయంగా చాలా మంది అబిప్రాయపడుతున్నారు. మరికొంతమందైతే అసలు విడుదల కాకుండా ఉంటే మంచి జ్ఢాపకంగా మిగిలేది అనే కామెట్స్ సైతం చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రంలో హీరోయిన్ గా చేసిన సమంత ఏమంది అనేది చూద్దాం...

    Samantha tweet about Nandu

    సమంత ట్వీట్ చేస్తూ... 'ఆటోనగర్ సూర్య చిత్రం నేను బృందావనం చిత్రం అనంతరం సైన్ చేసాను. అయితే చిత్రం పూర్తి అయ్యి విడుదల అవటానికి మూడేళ్లు పట్టింది. ఫలితం విషయం ప్రక్కన పెడితే చిత్రం విడుదల అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ', అలాగే...చైతు, దేవకట్టా సినిమాని బయిటకు తీసుకురావటానికి చాలా కష్టపడ్డారు అన్నారామె. ఇక చిత్రంలో ..'పెళ్లి ఎవరిని చేసుకున్నా కూడా పిల్లలు మాత్రం వాడి పోలికే... డైలాగు నాకు చాలా బాగా నచ్చింది... ఈ డైలాగు షూట్ జరుగుతున్నప్పుడు నవ్వు ఆపుకోలేకపోయాను ', అన్నారామె.

    ఆటోనగర్‌ నీడలో పెరిగిన ఓ నవతరం యువకుడి కథ ఇది. అతడి పేరు సూర్య (నాగచైతన్య). అందరూ ఆటోనగర్‌ సూర్య అంటారు. అతనికి కార్లు రిపేర్‌ చేయడం వృత్తి అయితే సమాజంలో చెడ్డవాళ్లను సరిచేయడం ప్రవృత్తి. పేదల కడుపుకొట్టాలని చూసేవాడికి ముచ్చెమటలు పట్టిస్తుంటాడు. అలాంటివాడు ఓ సారి నగర మేయర్‌తోనే గొడవకు దిగుతాడు. పెద్దవాళ్లతో మనకెందుకురా అంటే.. 'ఇది నాకు మేయర్‌కు జరుగుతున్న పోరాటం కాదు. అత్మాభిమానానికి ఆత్మవంచనకు జరుగుతున్న పోరాటం అంటాడు'.. 'మనిషి విలువకు జంతు బలానికి జరుగుతున్న పోరాటం'అని చెబుతాడు. అసలు ఈ సూర్య ఎవరు.. అతడలా మారడానికి కారణాలేంటి? అనేదే చిత్ర ప్రధానాంశం.

    English summary
    
 Samantha tweeted: Also in my interview on ANS I missed out on mentioning about the supporting cast. Thanks to the entire team. Sai Kumar sir, Ajay and Nandu aka kiccha. He was superb in the film. Wish him all the luck for the future.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X