Englishবাংলাગુજરાતીहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்
 
Share This Story

తెరపైకి ప్లేబ్యాక్ సింగర్ సునీత కూడా...!

Posted by:
Updated: Monday, February 3, 2014, 16:36 [IST]

హైదరాబాద్: తన గాన మాధుర్యంతో పాటు, ఆకట్టుకునే రూపంతో తెలుగు ప్రేక్షకుల మదిలో చెదరని ముద్ర వేసుకుంది ప్లే బ్యాక్ సింగర్ సునీత. ఆమె పాడిన పాటలు నచ్చని వారు తెలుగు గడ్డపై ఉండరంటే అతిశయోక్తి కాదేమో? మరి అంతటి గుర్తింపు తెచ్చుకుందామె. కోకిల లాంటి స్వరంతో పాటు ముగ్దమనోహర రూపం...ఆమె ఎక్కడికెళ్లినా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తూ ఉంటుంది.

సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్టుగా ఇప్పటి వరకు సినిమా తెరవెనక విభాగాల్లోనే తన సేవలు అందించిన సునీతా....త్వరలో తెరపైకి రాబోతోంది. నటనా రంగంలోకి అడుగు పెట్టబోతోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రాబోతున్న ‘అనామిక' చిత్రం ద్వారా ఆమె నటిగా తెరంగ్రేటం చేయబోతున్నారు. అయితే ఆమె పూర్తి స్థాయి పాత్రలో నటించడం లేదు. ‘అనామిక' ప్రమోషన్ సాంగులో మాత్రమే నటిస్తున్నారు.

ఈ రోజు(ఫిబ్రవరి 3) నుండి సునీతపై ఈ పాట చిత్రీకరణ ప్రారంభమైంది. మరి సునీత మున్ముందు తన నట ప్రస్తానాన్ని పూర్తి స్థాయిలో కొనసాగిస్తుందా? లేదా? అనేది కాలమే నిర్ణయించాలి. అయితే విశ్లేషకులు మాత్రం సునీతకు ఉన్న టాలెంట్, అందం దృష్ట్యా ఆమెకు మరిన్ని అవకాశాలు రావడం ఖాయమని అంటున్నారు.

‘అనామిక' సినిమా వివరాల్లోకి వెళితే....శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రం హిందీలో విజయవంతమైన ‘కహానీ' చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కుతోంది. నయనతార టైటిల్ రోల్ చేస్తుండగా, హర్షవర్ధన్ రాణె, వైభవ్ రెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఫిబ్రవరి 28న ఈ చిత్రం విడుదల కానుంది.

నాణ్యమైన వార్తలను అందిస్తున్న వన్ఇండియా... ఇప్పుడు మీకోసం ఫేస్‌బుక్, ట్విట్టర్‌ ల ద్వారా మరిన్ని అప్‌డేట్స్
Topics: nayantara, sunitha, shekar kammula, anamika, నయనతార, శేఖర్ కమ్ముల, అనామిక
Story first published:  Monday, February 3, 2014, 16:35 [IST]
English summary
Telugu singer, dubbing artist Sunitha who is also beautiful is all set to star in a film. Buzz is she will be seen in a special promo song in Sekhar Kammula's ‘Anamika’ starring Nayanatara.
మీ వ్యాఖ్య రాయండి

Please read our comments policy before posting

Click here to type in Telugu
Subscribe Newsletter
Coupons
My Place My Voice