twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫస్ట్ డే కలెక్షన్స్ : ఈ యేడాది రికార్డ్ దీనికే

    By Srikanya
    |

    Singham returns with 30 crores
    ముంబై: సినిమా కలెక్షన్స్ ఒక ఎత్తు...ఫస్ట్ డే కలెక్షన్స్ ఒక ఎత్తుగా లెక్కేస్తూంటారు. ఓపినింగ్స్ ఎంత ఎక్కువ తెచ్చుకోవటం అనేది ఆ హీరో, ఆ ప్రాజెక్టు క్రేజ్ పై ఆధారపడి ఉంటుంది. ఈ సంవత్సరం తొలిరోజు కలెక్షన్స్ రికార్డులలో 'సింగమ్‌ రిటర్న్స్‌' మొదటి స్ధానంలో నిలబడింది.

    వివరాల్లోకి వెళితే...

    'సింగమ్‌ రిటర్న్స్‌' అంటూ ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకొచ్చిన అజయ్‌దేవగణ్‌ బాక్సాఫీస్‌ దగ్గర గర్జిస్తున్నాడు. తొలి రోజు రూ.32.09 కోట్ల వసూళ్లు సాధించిందీ చిత్రం. ఈ ఏడాది విడుదలైన చిత్రాల తొలి రోజు వసూళ్లలో ఇదే అత్యధికం.

    దీంతో ఇప్పటిదాకా తొలి స్థానంలో ఉన్న సల్మాన్‌ఖాన్‌ 'కిక్‌' (రూ.26.40కోట్లు) రెండో స్థానానికి చేరింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విడుదల కావడం వల్ల 'సింగమ్‌ రిటర్న్స్‌'కు వసూళ్ల పంట పండిందని విమర్శకులు అంటున్నారు.

    మొత్తంగా బాలీవుడ్‌లో ఇప్పటిదాకా విడుదలైన చిత్రాల్లో తొలిరోజు వసూళ్లను పరిశీలిస్తే 'సింగమ్‌ రిటర్న్స్‌'కు నాలుగో స్థానం దక్కింది. తొలి మూడు స్థానాల్లో 'ధూమ్‌3' (రూ.36.22 కోట్లు), 'చెన్నై ఎక్స్‌ప్రెస్‌' (రూ.33.12 కోట్లు), 'ఏక్‌ థా టైగర్‌' (రూ.32.93కోట్లు) చిత్రాలున్నాయి.

    English summary
    
 ‘Singham Returns' opened to packed cinema houses and the box office collections only soared towards the evening. As per the report, 'Singham Returns' has done a business of approximately Rs 30 crores on the first day itself.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X