twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మిర్చి అవార్డ్స్: బెస్ట్ ఆల్బం 'అత్తారింటికి దారేది'

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: దక్షిణాది సినీ ప్రముఖులు,అతిరథ మహారథుల మధ్య సౌత్ ఇండియన్ మిర్చి మ్యూజిక్ అవార్డ్స్-2013 కార్యక్రమం శనివారం సాయంత్రం హైదరాబాద్ లో కన్నులపండువగా జరిగింది. సినీ సంగీత కళాకారుల్ని ప్రోత్సహించే ఉద్దేశ్యంతో గత నాలుగేళ్లుగా రేడియో మిర్చి నిర్వహిస్తున్న ఈ వేడుక ఈ ఏడాది కూడా ఘనంగా జరిగింది.

    తెలుగు, తమిళం, మళయాళం, కన్నడ బాషలకు చెందిన అనేక చిత్రాలు పలు విభాగాల్లో పోటీలో నిలిచిన అవార్డులను సొంతం చేసుకున్నాయి. తెలుగు చిత్ర పరిశ్రమ నుండి జీవిత సాఫల్య పురస్కారాన్ని అలనాటి గాయని కె.రాణి స్వీకరించారు. తెలుగులో సాంగ్ ఆఫ్ ది ఇయర్ గా 'ఆరడుగుల బుల్లెట్(అత్తారింటికి దారేది), బెస్ట్ ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్ గా అత్తారింటికి దారేది ఎంపికయ్యాయి.

    South Indian Mirchi Music Awards

    అలాగే ఉత్తమ గేయ రచయితగా సిరివెన్నెల సీతారామశాస్త్రి (మరీ అంతగా- సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు), ఉత్తమ గాయనిగా చిత్ర(సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు), ఉత్తమ గాయకుడిగా కైలాష్ కేర్(మిర్చి), ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్(అత్తారింటికి దారేది), బెస్ట్ అఫ్ కమింగ్ మ్యూజిక్ డైరెక్టర్ గా నాగ్ శ్రీవాత్సవ్(జగద్దురు ఆదిశంకరాచార్య) ఎంపికయ్యారు.

    స్పెషల్ జ్యూరీని కె.ఎన్.రామసుబ్రహ్మణ్యం, బెస్ట్ సౌండ్ మిక్సింగ్ ఉదయ్ కుమార్(ఇద్దరమ్మాయిలతో)లకు అందజేసారు. ఈ కార్యక్రమంలో డి. రామానాయుడు, సురేష్ బాబు, భాగ్యరాజా, మంచు లక్ష్మీప్రసన్న, రెజీనా, తమ్మారెడ్డి భరద్వాజ, సునీత, కె.ఎం. రాధాక్రిష్ణతో పాటు దక్షిణాదికి చెందిన పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.

    English summary
    Mirchi Music Awards - 2013 event has been held grandly in the presence of famous movie personalities of the South Indian film industries.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X