twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిన్న పిల్లల మాదిరి... జూ ఎన్టీఆర్, రాజమౌళిపై ఆ హీరో కామెంట్!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: కన్నడ హీరో సుదీప్ 'ఈగ' చిత్రం ద్వారా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తెలుగు సినీ పరిశ్రమలో ఆయనకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. మంచు మనోజ్, మోహన్ బాబు, జూ ఎన్టీఆర్, నాని, రవితేజ, తరుణ్, ఎస్ఎస్ రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ ఇలా చాలా మందే ఉన్నారు.

    ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తెలుగు స్టార్లతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తనకు నచ్చిన ప్రదేశాల్లో హైదరాబాద్ ఒకటని, ఇక్కడ తనకు చాలా మంది స్నేహితులు ఉన్నట్లు తెలిపారు. నేను ఎప్పుడు హైదరాబాద్ వెళ్లినా...కబురు పంపిన వెంటనే కనీసం 20 మంది స్నేహితులు వస్తారు. అంతా కలిసి ఎంతో జాలీగా గడుపుతాం, కలిసి డిన్నర్ చేస్తాం అని సుదీప్ తెలిపారు.

    SS Rajamouli Is A Child At Heart: Sudeep

    రాజమౌళి గురించి అడిగిన ప్రశ్నకు సుదీప్ సమాధానం ఇస్తూ...ఆయనది చిన్న పిల్లల మనసు. సినిమా ఆయనకు ఆట బొమ్మ లాంటిది. రాజమౌళి సింప్లిసిటీ, సినిమాల పట్ల డెడికేషన్ వర్క్ తనకెంతో నచ్చుతుందని చెబుతున్నాడు సుదీప్. మంచు మనోజ్ తన సోదరుడి లాంటి వాడని తెలిపారు.

    నేను ఎప్పుడు హైదరాబాద్ వెళ్లినా మోహన్ బాబు ఇంటి నుండి భోజనం వస్తుంది. నన్ను ఎంతో బాగా చూసుకుంటారు అని సుదీప్ చెప్పుకొచ్చారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి సుదీప్ మాట్లాడుతూ...ఎన్టీఆర్ కూడా చిన్న పిల్లాడి లాంటి వాడే. ఎంతో ఇన్నో సెంట్, సిన్సియర్ అని తన మనసులోని మాట పెట్టాడు ఈ కన్నడ స్టార్.

    English summary
    Kannada actor Sudeep has starred in just two Telugu movies like Eega and Action 3D, but he has made lot of friends like Manchu Manoj, Mohan Babu, Junior NTR, Nani, Ravi Teja, Tarun, SS Rajamouli, Ram Gopal Varma and many others in Hyderabad. The multifaceted star from Sandalwood has all praise for ace director SS Rajamouli for his simplicity and dedication to film-making.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X