Don't Miss!
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్‌తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- News ఘోర ప్రమాదం: లారీని ఢీకొనడంతో చిన్నారి సహా ఆరుగురు మృతి
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రీమేక్ కమిటైన సునీల్..డిటేల్స్
తమిళంలో విజయవంతమైన 'సుందరపాండ్యన్' చిత్రాన్ని తెలుగులో సునీల్ హీరోగా తెరకెక్కిస్తారని సమాచారం. ఇటీవలే కథ విన్న సునీల్ ఇందులో నటించేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కథాచర్చలు సాగుతున్నాయని ఫిల్మ్‌నగర్ వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లబోతోందని సమాచారం. ప్రస్తుతం సునీల్ 'దసరాబుల్లోడు' చిత్రంలో నటిస్తున్నారు.
గతంలో తమిళ పదం రీమేక్ ..సుడిగాడు హిట్ ఇచ్చిన భీమినేని మరోసారి ఈ రీమేక్ తో హిట్ కొట్టడానికి సిద్దమవుతున్నారు. రీసెంట్ గా సునీల్ తో చేసిన తమిళ చిత్రం వెట్టై రీమేక్ గా వచ్చిన తడాఖా చిత్రం మాత్రం మంచి సక్సెస్ అయ్యింది. ఆ చిత్రంలో సునీల్ పిరికివాడైన పోలీస్ గా కనిపించారు. ఈ చిత్రాలతో పాటు లేడీ డైరక్టర్ బి.జయ దర్శకత్వంలో ఆయన హీరోగా చిత్రం త్వరలో తెరకెక్కనుంది. ఈ చిత్రానికి సంభందించి స్క్రిప్టు వర్క్ ఇప్పటికే పూర్తైందని సమాచారం. లవ్ లీ చిత్రం తో హిట్ కొట్టిన బి.జయ ఈ చిత్రాన్ని కామెడీ ఎంటర్టైనర్ తెరకెక్కించటానికి సన్నాహాలు చేస్తోందని సమచారం.
ఇప్పటి వరకు అల్లరి చిల్లర పాత్రల్లో నటించిన సునీల్ త్వరలో ఓ విభిన్నమైన పాత్రలో తెరపై కనిపించబోతున్నాడు. 'భక్త కన్నప్ప'గా సునీల్ నటించబోతున్నాడని సమాచారం. ఈ చిత్రానికి తనికెళ్ల భరణి దర్శకత్వం వహించబోతున్నారట. ఇప్పటికే భక్త కన్నప్ప కథ తెలుగులో రెండు సార్లు తెరకెక్కింది. గతంలో కన్నడ కంఠీవర రాజ్ కుమార్, రెబల్ స్టార కృష్ణం రాజు లాంటి లెజెండ్స్ భక్త కన్నప్ప పాత్రలను పోషించారు. అయితే ఈ సారి తనికెళ్ల భరణి ఆ పాత్రకు సునీల్‌ను ఎంచుకోవడం సర్వత్రా చర్చనీయాంశం అయింది.