Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
తాప్సీ టెన్షన్..రోజుకు వంద సిగరెట్లు
హైదరాబాద్: తాప్సీకి కొత్త టెన్షన్ పట్టుకుంది. రోజులు వంద సిగరెట్లును కాల్చి పొగ పీల్చడమంటే మాటలు కాదు అంటోంది. అదేంటి తాప్సీ కి ఈ కొత్త సిగరెట్లు కాల్చే బుద్ది అనుకుంటున్నారా..అయితే మీరు ఒక్క సెకన్ ఆగి మొత్తం చదివి నిర్ణయానికి రావాల్సిందే. ఆమె చెప్పేది ముంబై పొల్యూషన్ గురించి. ముంబై ఒక్క రోజు కాలుష్యం పీలిస్తే..వంద సిగరెట్లు కాల్చినంత ఎఫెక్టు ఉంటుందిట. దాన్ని గుర్తు చేసుకుని ముంబైలో ఉన్న తాప్సీ టెన్షన్ పడిపోతోంది.
తాప్సీ ట్వీట్ చేస్తూ... " ఓహ్ షిట్ !!! నేను ఇన్నాళ్లు ఓ నాన్ స్మోకర్ ని అనుకుంటున్నాను. అయితే అర్బన్ ఫాక్ట్స్ ఏమిటంటే...ఒక్కరోజు ముంబై గాలిని పీలిస్తే... వంద సిగెరెట్లు కాల్చినంత ." అంటోంది.
ఇక తన తాజా చిత్రాలు గురించి మాట్లాడుతూ... విశేషం ఏమిటంటే ప్రస్తుతం నేను 'ముని 3'లో నటిస్తున్నా. అదీ.. హారర్ సినిమానే. నటిస్తున్నానన్న మాటేగానీ, ఈసినిమా విడుదలైనా నేను చూడను. ఎందుకంటే... నాకు అంత భయం'' అని చెబుతోంది.
''నిజ్జం.. దెయ్యాలున్నాయి. నేను చూడలేదు గానీ, నా స్నేహితుల అనుభవాలు వింటే నిజమే అనిపిస్తుంటుంది. కొంతమంది ఏ కారణం లేకుండా పిచ్చి పట్టినట్టు ప్రవర్తిస్తుంటారు. దాన్ని ఏమనాలి?? దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాం కదా..? దైవ శక్తిని నమ్మినప్పుడూ దుష్ట శక్తినీ నమ్మాల్సిందే. అందుకే నేను ఈ తరహా సినిమాల్ని చూడ్డానికి ఇష్టపడను.
అర్థరాత్రి, ఇంట్లో ఎవరూ లేనప్పుడు, తలుపులన్నీ మూసేసి, టీవీలో హారర్ సినిమాల్ని చూడడంలో.. ఓ వింతైన అనుభవం దాగుంటుంది. భయపడుతూనే ఆ అనుభవాన్ని ఆస్వాదించడం ఓ సరదా అలవాటు. అందుకే హారర్ సినిమాల్ని చూసే ప్రేక్షకుల సంఖ్య పెరుగుతోంది. మీరూ దెయ్యాల సినిమాల్ని చూస్తుంటారా? అని తాప్సిని అడిగితే ఏం చెప్పిందంటే - ''అమ్మో.. హారర్ సినిమాలా? నాకు చాలా భయం. ఒకసారి ఓ సినిమా చూశానంటే నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఆ సినిమానే మళ్లీ మళ్లీ గుర్తొస్తుంది. అందుకే.. వాటి జోలికి అస్సలు వెళ్లను..'' అంటోంది. దెయ్యాల టాపిక్ అనేసరికి చాలా విషయాలే మాట్లాడింది.