Don't Miss!
- News కోర్టు తీర్పుతో ఎన్నికల అస్త్రాన్ని కోల్పోయిన వైఎస్ షర్మిల, సునీత.. వాట్ నెక్స్ట్!!
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Sports IPL: ఆ కుర్రాడిపై అంబానీ కన్ను!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
నయనతార, శింబు ప్రేమ వ్యవహారంలో....వేలు పెడుతున్న తాప్సీ!
హైదరాబాద్: చాలా కాలం తర్వాత తన మాజీ ప్రియుడు శింబుతో కలిసి ఓ తమిళ సినిమాలో నటిస్తోంది నయనతా. ఈ చిత్రానికి పాండి రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈచిత్రంలో వీరు ప్రేమికులుగా కనిపించనున్నారు. ఇందులో వీరు పెద్దలను ఎదురించి రహస్యంగా పెళ్లి చేసుకుంటారు. ఇదంతా సినిమా కథలో భాగమే. అంతే కాదండోయ్...ఇద్దరి మధ్య ఘాటైన శృంగార సన్నివేశాలు కూడా ఉన్నాయట.
ఏది ఏమైనా ఈ మాజీ ప్రేమికులు ఒకప్పుడు రియల్ లైఫ్లో చేసిన పనులు, చేయాలనుకున్న పనులు....ఇపుడు రీల్ లైఫ్లో చేస్తుండటం చర్చనీయాంశం అయింది. వీరు నటించే ఈ తమిళ చిత్రానికి మంచి స్పందన వస్తుందని ఆశిస్తున్నారు. కాగా...ఈ చిత్రంలో తాప్సీ కూడా ఓ ముఖ్యమైన పాత్రను పోషిస్తుందని....వారిద్దరి ప్రేమకు, తాప్సీకి పాత్రకు లింక్ ఉంటుందని తెలుస్తోంది. త్వరలోనే ఈచిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.
నయనతార, శింబు మధ్య గతంలో ఘాటైన ప్రేమాయణం సాగిన సంగతి తెలిసిందే. అప్పట్లో వీరు పెళ్లి చేసుకుంటారా? లేదా? ఒక వేళ చేసుకుంటే ఎలా చేసుకుంటారు? రహస్యంగా ప్రేమ వివాహమా? పెద్దలను ఒప్పించి చేసుకుంటారా? అంటూ చాలా గాసిప్ వార్తలు ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే.
ఆ తర్వాత శింబు, నయనతార విడిపోవడం తెలిసిందే. శింబుతో విడిపోయిన తర్వాత నయనతార, ప్రభుదేవా మధ్య కొంత కాలం ప్రేమాయణం సాగింది. ఆ తర్వాత ప్రభుదేవాతో కూడా విడిపోయింది ఈ కేరళ బ్యూటీ. ప్రస్తుతం సింగిల్గానే ఉంటున్న నయనతారన సినిమాలపై దృష్టి సారించింది.