twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అలా చేస్తే చర్యలే: సినిమాలు, సీరియళ్లపై కేసీఆర్ వ్యాఖ్య

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: సినిమాలు, టీవీ సీరియళ్లలో మహిళలపై హింసాత్మక సన్నివేశాలు పెచ్చు మీరితే తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్య మంత్రి కె.చంద్రశేఖరరావు తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మకు సూచించారు. సినిమాలు, సీరియళ్లలో మహిళలపై హింసాత్మక సన్నివేశాలు ఉండటం వల్ల క్రైం రేటు పెరుగుతోందని ఆయన అన్నారు.

    వీలైనంత వరకు సినిమాలు, సీరియళ్లలో మహిళలపై హింసాత్మక సన్నివేశాలు ఉండకుండా చూడాలని, అలా కాకుండా ఎవరైనా హద్దు మీరితే చర్యలు తప్పవని కేసీఆర్ హెచ్చరించారు. ప్రతి సబ్ డివిజన్ లోనూ మహిళా పోలీస్టేషన్ ఏర్పాటు చేయాలని ఆయన పోలీసు విభాగానికి సూచించారు.

    తెలుగు సినీ పరిశ్రమపై కేసీఆర్ ప్రత్యేక దృష్టి

    Telangana CM for action against onscreen violence against women

    రాష్ట్ర విభజన తర్వాత ఫిల్మిండస్ట్రీ హైదరాబాద్ నుంచి తరలివెళ్తుందన్న పుకార్లకు కేసీఆర్ పుల్ స్టాప్ పెట్టారు. రెండు వేల ఎకరాల్లో సినిమా సిటీని నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత సినీ పరిశ్రమలో ఆందోళనలు నెలకొన్నాయి. పిల్మిండస్ట్రీ మొత్తం సీమాంధ్రలోని వైజాగ్ కు తరలివెళ్తుందని పుకార్లు షికార్లు చేశాయి. అయితే ఈ పుకార్లన్నింటికి పుల్ స్టాప్ పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్రంలో సినీ పరిశ్రమను మరింత అభివృద్ధి పరిచి, సినిమా దాని అనుబంధ రంగాల్లో ఉపాధి అవకాశాలను పెంపొందించాలని సీఎం కేసీఆర్ కృత నిశ్చయంతో ఉన్నారు.

    అందులో భాగంగానే ఆయన కొన్ని రోజుల క్రితం సినీ రంగంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ శివార్లలో రెండు వేల ఎకరాల్లో సినిమా సిటీని నిర్మించాలని నిర్ణయించుకున్నారు. హైదరాబాద్ నగరం నుంచి సినీ పరిశ్రమ తరలి వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. సినీ రంగానికి హైదరాబాద్ వాతావరణం ఎంతో అనుకూలమైందనీ... సినిమాలు, సీరియళ్ల షూటింగ్‌కు ఇటువంటి అనువైన ప్రదేశం ఎక్కడా లభించదన్నారు. అడ్వాన్స్ టెక్నాలజీతో కూడిన గ్రాఫిక్స్, స్టూడియోల నిర్మాణంతో సినిమా సిటీని ఏర్పాటు చేయాలని సిఎం ఆదేశించారు. సినీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తరలి వెళుతుందన్న వార్తల నేపథ్యంలో కేసీఆర్ నిర్ణయం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. సీఎం నిర్ణయంపై టాలీవుడ్ హర్షం వ్యక్తం చేస్తోంది.

    English summary
    Telangana Chief Minister K. Chandrasekhar Rao Thursday asked the state police chief to consider taking action against films and television serials portraying violence against women.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X