twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నటుడు, డాన్స్ మాస్టర్ ముక్కు రాజు కన్నుమూత

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: టాలీవుడ్ ప్రముఖ నటుడు, డాన్స్ మాస్టర్ ముక్కు రాజు కన్ను మూసారు. కొంతకాలంలో అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం పాలకొండి మండలం కుమటి గ్రామంలో తుదిశ్వాస విడిచారు. ముక్కురాజు అసలుపేటు సాయిరాజు రాజంరాజు.

    దాదాపు 600 సినిమాల్లో ముక్కురాజు నటించారు. అనారోగ్యంతో ఉన్నప్పటికీ ముక్కురాజు సినిమాలు చేస్తునే ఉన్నారు. 2010లో వచ్చిన '1940లో ఓ గ్రామం' అనే చిత్రంలో నటించిన ముక్కురాజుకు జాతీయ స్థాయి అవార్డు లభించింది. 2013 ముక్కురాజు చివరి సారిగా 'మధసింహం' అనే చిత్రంలో నటించారు.

    పశ్చిమగోదావరి జిల్లా భీవరం దగ్గర కుముదపల్లిలో 1931లో ఒక వ్యవసాయ కుటుంబంలో ముక్కురాజు జన్మించారు. తండ్ిర బాపిరాజు, తల్లి సత్యవతమ్మ. 1941 క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా ఈ ఇంగ్లీష్ చదువులు మాకొద్దు అంటూ పుస్తకాలు విసిరేసి చదువు మానేసారు.

     Telugu movie Dance master Mukku Raju passes away

    1955లో కెవీ రెడ్డి దర్శకత్వంలో మాయాబజార్ సినిమాలో మోహినీ భస్మాసుర డాన్స్ డ్రామాతో సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటి వరకు ఆయన దాదాపు 600 చిత్రాల్లో నటించారు. 200 సినిమాలకు డాన్స్ మాస్టర్ గా పని చేసారు. నందమూరి తారక రామారావుకు వ్యక్తిగత డాన్స్ మాస్టర్‌గా కూడా పని చేసారు. చిరంజీవి ప్రాణం ఖరీదు, పునాది రాళ్లు, మనవూరి పాండవులు చిత్రాలకు డాన్స్ మాస్టర్ గా పని చేసారు. ఆర్ నారాయణ మూర్తి సినిమాల్లో ముక్కురాజుకు తప్పకుండా ఒక పాత్ర ఉండేది.

    ముక్కురాజు భార్య, ఇద్దరు కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. శుక్రవరాం ఉండి మండలం చెరుకువాడలో ముక్కురాజు అంత్యక్రియలు జరుగనున్నాయి.

    English summary
    
 Tollywood Dance master & artist Mukku Raju passes away. The real name of Mukku Raju is Sairaju Rajam Raju, who has acted in 600 films.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X