twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలీవుడ్ టాప్ భారీ బడ్జెట్ చిత్రాలు ఇవే (ఫోటో ఫీచర్)

    By Bojja Kumar
    |

    ముంబై: బాలీవుడ్ చిత్ర పరిశ్రమ రోజు రోజుకు తన పరిధిని ప్రపంచ వ్యాప్తంగా పెంచుకుంటోంది. పలువురు హాలీవుడ్ సెలబ్రిటీలు సైతం బాలీవుడ్ సినిమాలను మెచ్చుకునే స్థాయికి ఎదిగింది. కొందరు హాలీవుడ్ తారలు నేరుగా బాలీవుడ్ సినిమాల్లో కూడా నటించిన సందర్భాలు అనేకం. బాలీవుడ్ సినిమాలు ప్రపంచం దృష్టిని ఆకర్షించడానికి ప్రధాన కారణం...డ్రామా, ఎమోషన్, రొమాన్స్, యాక్షన్ అన్నీ ఒకే సినిమాలో అద్భుతంగా చూపెట్టగలగడం.

    ఈ నేపథ్యంలో పలు బాలీవుడ్ చిత్రాలకు భారీ బడ్జెట్ అవసరమవుతోంది. యాక్షన్ సీన్లు, లొకేషన్లు ఇలా అన్ని విభాగాల్లో దర్శకుడు అనుకున్న విధంగా తీయడానికి ఎంతఖర్చయినా పెట్టడానికి వెనుకాడటం లేదు నిర్మాతలు. తాజాగా బాలీవుడ్లో విడుదలకు సిద్దంగా ఉన్న 'ధూమ్-3' చిత్రంలో ఒక పాటకే రూ. 5 కోట్లు ఖర్చు చేసారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అఫ్ కోర్స్... సినిమా మార్కెట్ ఏమేరకు ఉంటుందో అంచనా వేసిన తర్వాతే ఖర్చు పెడతారు.

    ఇలా కథానుగునంగా....పలు బాలీవుడ్ చిత్రాలకు అత్యధికంగా ఖర్చయింది. ఇందులో టాప్-10 చిత్రాల వివరాలను స్లైడ్ షోలో పరిశీలిద్దాం....

    మొఘల్-ఇ-అజం

    మొఘల్-ఇ-అజం


    మోగల్-ఇ-అజం 1960లో తెరకెక్కింది. దివంగత దర్శకుడు కె. ఆసిఫ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో పృథ్విరాజ్ కపూర్, దిలీప్ కుమార్, మధుబాల నటించారు. ఈ చిత్రం అప్పట్లో ఇండియన్ సినిమా చరిత్రలో భారీగా వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. పలు నేషనల్ అవార్డులను సైతం గెలుచుకుంది. ఈచిత్రానికి అప్పట్లోనే 10.6 మిలియన్ డాలర్లు కర్చు పెట్టారు.

    గజిని

    గజిని


    అమీర్ ఖాన్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో 2008లో హిందీలో తెరకెక్కిన చిత్రం ‘గజిని'. యాక్షన్ సైకలాజికల్ థ్రిలర్‌గా తెరకెక్కిన ఈచిత్రంలో అమీర్ ఖాన్, అసిన్ హీరో హీరోయిన్లు. ఈ చిత్రానికి 12 మిలియన్ డాలర్లు ఖర్చు పెట్టారు.

    లవ్ స్టోరీ 2050

    లవ్ స్టోరీ 2050


    హర్మాన్ భజేవా, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా హ్యారీ బజేవా దర్శకత్వంలో తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘లవ్ స్టోరీ 2050'. అయితే ఈచిత్రం బాక్సాఫీసు వద్ద విజయం సాధించలేక పోయింది. 2008లో వచ్చిన ఈచిత్రానికి 12.7 మిలియన్ డాలర్లు ఖర్చు చేసారు.

    ఏక్ థా టైగర్

    ఏక్ థా టైగర్


    అమీర్ ఖాన్-కత్రినా కైఫ్ హీరో హీరోయిన్లుగా కబీర్ ఖాన్ దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిల్మ్ 2012లో తెరకెక్కించిన యాక్షన్ చిత్రం ‘ఏక్ థా టైగర్'. ఈచిత్రంలో బాక్సాఫీసు వద్ద భారీ విజయం సాధించింది. ఈచిత్రానికి 13 మిలియన్ డాలర్లు ఖర్చు పెట్టారు.

    డాన్ 2

    డాన్ 2


    షారుక్ ఖాన్-ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రల్లో పర్హాన్ అక్తర్ దర్శకత్వంలో 2011లో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం డాన్ 2. డాన్ చిత్రానికి ఇది సీక్వెల్. ఈ చిత్రినికి 14 మిలియన్ డాలర్లు ఖర్చు పెట్టారు.

    విశ్వరూపం

    విశ్వరూపం


    కమల్ హాసన్ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కి చిత్రం ‘విశ్వరూపం'. 2013లో విడుదలైన ఈచిత్రం బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించింది. ఈచిత్రానికి 14 మిలియన్ డాలర్లు ఖర్చు చేసారు.

    ద్రోణ

    ద్రోణ


    2008లో వచ్చిన అడ్వెంచర్ ఫాంటసీ చిత్రం ‘ద్రోణ'. బోల్డె బెహ్ల్ దర్శకత్వం వహించారు. అభిషేక్ బచ్చన్, ప్రియాంక చోప్రా హీరోహీరోయిన్లు. ఈ చిత్రంలో స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం నిర్మాత దాదాపు 2 మిలియన్ డాలర్లు ఖర్చు పెట్టారు. ఇండియన్ మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో ఈచిత్రం తెరకెక్కింది. ఈచిత్రానికి మొత్తం 17 మిలియన్ డాలర్ల బడ్జెట్ ఖర్చు పెట్టారు.

    బ్లూ

    బ్లూ


    2009లో వచ్చి ఇండియన్ అండర్ వాటర్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘బ్లూ'. ఆంటోనీ డిసౌజా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సంజయ్ దత్, అక్షయ్ కుమార్, లారా దత్త ముఖ్య పాత్రల్లో నటించారు. 24 మిలియన్ డాలర్లతో తెరకెక్కిన ఈచిత్రం బాక్సాఫీసు వద్ద ఘోర పరాజయం పాలైంది.

    . రా.వన్

    . రా.వన్


    2011లో వచ్చిన సైన్స్ ఫిక్షన్ సూపర్ హీరో చిత్రం ‘రా.వన్'. అనుభవ్ సిన్హా దర్శకత్వం వహిచిన ఈచిత్రంలో షారుక్ ఖాన్, కరీనా కపూర్ మెయిన్ రోల్స్‌లో పోషించారు. ఈచిత్రం పలు విభాగాల్లో అవార్డులను అందుకుంది. ఈచిత్రానికి ఏకంగా 27 మిలియన్ డాలర్లు ఖర్చు పెట్టారు.

    రోబో

    రోబో


    రజనీకాంత్, ఐశ్వర్యరాయ్ హీరో, హీరోయిన్లుగా దర్శకుడు శంకర్ తెరకెక్కించిన చిత్రం ‘రోబో'. రెండు సంవత్సరాల పాటు చిత్రీకరణ జరుపుకున్న ఈచిత్రం మచు పిచ్చు, ఆస్ట్రేలియా, బ్రెజిల్, అమెరికా లాంటి ప్రాంతాల్లో షూటింగ్ జరిపారు. ఈ చిత్రానికి 35 మిలియన్ డాలర్లు ఖర్చు చేసారు.

    English summary
    Bollywood is getting famous around the world and even Hollywood celebrities are admiring Indian movies. Some of them are even looking forward to working in Bollywood.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X