twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘ఉయ్యాలా జంపాలా’ హీరోయిన్ ఇంకోటి

    By Srikanya
    |

     'Uyyala Jampala' Avika Gor on signing spree
    హైదరాబాద్: చిన్న చిత్రాల్లో మంచి విజయం సాధించిన చిత్రం 'ఉయ్యాలా జంపాలా' హీరోయిన్ అవికా గోర్. ఈ చిత్రం హిట్ ఈమెకు బాగానే కలిసి వచ్చింది. ఆమెకు వరస ఆఫర్స్ వచ్చినా ఆచితూచి అడుగులు వేస్తోంది. తను డిమాండ్ చేసిన రెమ్యునేషన్ ఇచ్చేవాళ్లు,బ్యానర్ వంటి అంశాలు పరిగణలోకి తీసుకుని ఓకే చేస్తోంది. తాజాగా ఆమె మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బెక్కం వేణు గోపాల్ నిర్మిచే చిత్రం ఆమె సైన్ చేసిందని సమాచారం. ఈ చిత్రం ద్వారా మురళీధర్ అనే దర్శకుడు పరిచయమవుతున్నాడు.

    అలాగే రచయిత నంధ్యాల రవి దర్శకత్వంలో రూపొందే లక్ష్మీ రావే మా ఇంటికి...చిత్రం ఆమె చేస్తోంది. జర్నలిస్ట్ అయిన గిరిధర్ నిర్మిస్తున్న ఈ సినిమా లాంచ్ అయ్యి షూటింగ్ జరుగుతోంది. మీడియం బడ్జెట్ తో తెరకెక్కుతోందని సమాచారం. ఇలా ఈ రెండు చిత్రాలు కొత్త దర్శకులతోనే కావటం విశేషం.

    'ఉయ్యాలా జంపాలా'కు ముందే అవికాగోర్ తెలుగువారికి పరిచయం. 'చిన్నారి పెళ్లికూతురు' సీరియల్ తో ఆంధ్రప్రదేశ్ లో మంచి గుర్తింపు వచ్చింది. దాంతో ఆమె ఫ్యాన్స్ తో ఈ చిత్రానికి ఓపినింగ్స్ సైతం రాబట్టుకుంది. నాగార్జున, హిట్‌ చిత్రాల నిర్మాత రామ్మోహన్‌ పి. నిర్మించిన ఈ విభిన్న కథా చిత్రం బావా మరదళ్ల ప్రేమ కథగా రూపొంది విడుదలైంది.

    ఈ చిత్రం రిలీజైన రోజు నుంచి మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. పబ్లిసిటీ తో కలిపి రెండున్నర కోట్లు బడ్జెట్ అయిన ఈ చిత్రం 17 కోట్లు(గ్రాస్)కలెక్టు చేసిందని ట్రేడ్ వర్గాల సమాచారం. చిన్న సినిమాగా రిలీజైన ఈ చిత్రం కలెక్షన్స్ లో పెద్ద సినిమాతో పోటీ పడటం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.

    English summary
    
 After the super success of her first film, Avika Gor is doing Lakshmi Raave Maa Intiki which is progressing brisk pace. Now, this teenager has signed another Telugu film which is to be directed by Muralidhar and Bekkam Venugopal will produce the film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X