twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘వర్ణ’ ఫస్ట్‌డే కలెక్షన్...పివిపి సంస్థకు భారీ స్ట్రోక్?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: అనుష్క, ఆర్య ప్రధాన పాత్రల్లో 'యుగానికొక్కడు' ఫేం సెల్వరాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కిన ద్విబాషా చిత్రం 'వర్ణ' శుక్రవారం గ్రాండ్ గా విడుదలైంది. అయితే సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. తెలుగులో మాత్రం ఈచిత్రానికి క్రిటిక్స్ నుంచి చాలా తక్కువ రేటింగ్ వచ్చింది. దీంతో తెలుగులో ఈచిత్రం ఎక్కువ రోజులు థియేటర్లలో నిలబడే పరిస్థితి లేదని టాక్.

    మరో వైపు తమిళంలోనూ ఈ చిత్రానికి క్రిటిక్స్ నుంచి యావరేజ్ రేటింగే వచ్చింది. అయితే సినిమాపై మొదటి నుంచి భారీ అంచనాలు ఉండటంతో తొలి రోజు కలెక్షన్లు కాస్త ఆశాజనకంగానే ఉన్నాయి. తొలి రోజు ఈచిత్రం రూ. 6 కోట్ల పైచిలుకు వసూలు చేసినట్లు తెలుస్తోంది. అయితే దాదాపు రూ. 65 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈచిత్రం కనీసం పెట్టబడి తిరిగి రాబట్టుకోగలదా? లాంటి సందేహాలు సినిమా ట్రేడ్ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యాయి.

    ఇప్పుడిప్పుడే సినిమా నిర్మాణ రంగంలో నిలదొక్కుకుంటున్న పివిపి బేనర్‌ వారికి స్ట్రోక్ తప్పదనే వాదన వినిపిస్తోంది. అయితే భారీ సంఖ్యలో థియేటర్లలో రిలీజ్ చేయడం, అనుష్క, ఆర్య, సెల్వరాఘవన్‌లకు ఇప్పటికే ఉన్న గుడ్‌విల్ వల్ల నష్టాలు తక్కువ స్థాయిలోనే ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

    'వర్ణ' ఒక రొమాంటిక్ ఫాంటసీ ఫిల్మ్. ఈ చిత్రానికి కథ, దర్శకత్వం సెల్వరాఘవన్. రెండు విభిన్నమైన ప్రపంచాల నేపథ్యంలో ఈ చిత్రం నడుస్తుంది. ఈచిత్రంలో ఆర్య, అనుష్క ద్విపాత్రాభినయం చేసారు. ఈ చిత్రంలో క్యారెక్టర్ కోసం ఆర్య సిక్స్ ప్యాక్ బాడీ పెంచడం విశేషం. చిత్రంలోని పోరాట సన్నివేశాల కోసం ఆర్య, అనుష్క కత్తి యుద్ధంలో శిక్షణ పొందారు.

    ఆంధ్రప్రదేశ్‌లోని అందమైన లొకేషన్లతో పాటు, జార్జియా దేశంలోని అడవుల్లో, గోవా, రియో డె జానెరియో, బ్రిజిల్ తదితర ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపారు. ఈచిత్రానికి హరీష్ జైరాజ్ సంగీతం అందించగా, అనిరుద్ రవిచంద్రన్ బ్యాగ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేసారు. రామ్ జీ సినిమాటోగ్రఫీ అందించారు. ఫరూఖ్, సత్యం శివకుమార్, సోనుసూద్, ఢిల్లీ గణేష్, అను హాసన్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. అవతార్ చిత్రానికి పని చేసిన హాలీవుడ్ టెక్నీషియన్స్ ఈచిత్రానికి స్పెషల్ ఎఫెక్ట్స్ అందించారు.

    English summary
    Varna is a romantic fantasy film and Arya and Anushka Shetty's brilliant performances are the main highlight of the film. Selva's symbolic script, amazing visual effects, Anirudh's background score, Harris Jayaraj's tunes, Ramji's cinematography, well-choreographed action, beautiful locales, art direction.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X