twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    షాకింగ్: అనుష్క ‘వర్ణ’ బడ్జెట్ అంతా?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: పి.వి.పి సినిమా సంస్థ సెల్వరాఘవన్ దర్శకత్వంలో అనుష్క, ఆర్య ప్రధాన పాత్రల్లో 'వర్ణ' చిత్రాన్ని తమిళం, తెలుగు భాషల్లో తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని రేపు(నవంబర్ 22)న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా ఈచిత్రానికి సంబంధించిన ప్రెస్ నోట్ విడుదల చేసారు.

    ప్రొడక్షన్ టీం చెప్పిన వివరాల ప్రకారం ఈచిత్రాన్ని రూ. 65 కోట్లకు పైగా బడ్జెట్‌తో నిర్మించారని స్పష్టం అవుతోంది. ఇప్పటి వరకు తెలుగులో ఇంత బడ్జెట్ సినిమా రాక పోవడం గమనార్హం. ఈ సినిమాకు నిర్మాతలు ఇంత ఖర్చు పెట్టడానికి ముందుకు రావడం దర్శకుడు సెల్వరాఘవన్ పనితీరు, కథ నచ్చడంతో పాటు అనుష్క స్టార్ ఇమేజ్ కూడా కారణమని స్పష్టమవుతోంది.

    హాలీవుడ్ చిత్రాలకు ఏ మాత్రం తీసిపోని గ్రాఫిక్స్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. భారీ బడ్జెట్ చిత్రం కాబట్టి విడుదల విషయంలోనూ భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 1200 స్క్రీన్లలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం యొక్క ఓవర్సీస్ రైట్స్ హీరో ఆర్య సొంతం చేసుకుని అక్కడ ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారంటే....సినిమా ఏ రేంజిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

    ఈ చిత్రంలో అనుష్క ద్విపాత్రాభినయం చేసింది. ఒక పాత్రలో ఆమె సాధారణ గృహిణిగా, ఒక పాత్రలో ట్రైబల్ ఉమన్(ఆటవిక యువతి)గా కనిపించనుంది. జార్జియా అడవుల్లో అనుష్కపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ సినిమాలో పోషిస్తోన్న విలక్షణమైన పాత్ర కోసమే అనుష్క మార్షల్ ఆర్ట్స్ ని సైతం నేర్చుకుంది. అరుంధతి తర్వాత అనుష్కకు ఈచిత్రం బాగా పేరు తెస్తుందనే టాక్ సినీ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: రామ్‌జీ, సంగీతం: హారిస్‌ జైరాజ్‌.

    English summary
    Director Selva Raghavan's bilingual Irandam ulgam/ Varna is going to hit the theaters on 22nd November. Music was given by Harris Jayaraj. The film, Starring Anushka and Arya was produced by PVP.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X