Englishবাংলাગુજરાતીहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்
 
Share This Story

క్రైం కామెడీతో రెడీ...(‘డి ఫర్ దోపిడి’ప్రివ్యూ)

Posted by:
Published: Tuesday, December 24, 2013, 8:06 [IST]

హైదరాబాద్: క్రైమ్ కామెడీ చిత్రాలకు మళ్లీ ఊపు వచ్చినట్లే కనపడుతోంది. స్వామిరారా వచ్చి హిట్టైంది. ఇప్పుడు మరికొంతమంది కుర్రవాళ్లు కలిసి క్రైం, కామెడీ నేపథ్యంలో ‘డి ఫర్ దోపిడి'అంటూ ముందుకు వస్తున్నారు. ప్రేక్షకులకు సస్పెన్స్ తో పాటు థ్రిల్, కామెడీని ఈచిత్రం నుంచి ఆశించ వచ్చని చెప్తున్నారు. హిందీలో ‘99', ‘షోర్ ఇన్ ద సిటీ' చిత్రాలకు దర్శకత్వం వహించిన రాజ్ నిడిమోరు, కృష్ణా డి.కెలు ‘డి ఫర్ దోడిపి' చిత్రాన్ని తెలుగులో నిర్మిస్తున్నారు. సిరాజ్ కల్లాన్ని ఈచిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. రీసెంట్ గా ఈ చిత్రం నిర్మాణ టీమ్ లో హీరో నాని కూడా జాయిన్ అవటంతో సినిమాపై మంచి అంచనాలు మొదలయ్యాయి.

కథలో... విక్కీ (వరుణ్‌ సందేశ్‌), సుబ్బ రాజు(సందీప్‌ కిషన్‌) హరీష్‌ (నవీన్‌) బన్నూ (రాకేష్‌) స్నేహితులు. చదివిన చదువు, తెలివితేటలు కడుపు నింపలేకపోతాయి. తప్పని పరిస్థితుల్లో ఓ బ్యాంకు దోపిడీ చేయాలనుకొంటారు. దొంగతనం ఎలా చేయాలో తెలియని కుర్రాళ్లు.. ఈ సాహసం ఎలా చేశారు. విజయవంతం అయ్యారా? లేదా? అనేదే ఈ చిత్ర కథ. షాలిని (మెలనీ), లోకముద్దు (భరణి), కృష్ణమాచారి (దేవాకట్టా) పాత్రలు కీలకం.

క్రైం కామెడీతో రెడీ...(‘డి ఫర్ దోపిడి’ప్రివ్యూ)

దర్శకుడు మాట్లాడుతూ ''చాలాకాలం క్రితం ఇద్దరు ఐఐటీ విద్యార్థులు ఓ ఏటీఎంని కొల్లగొట్టే ప్రయత్నం చేశారు. ఆ సంఘటనని స్ఫూర్తిగా తీసుకొని తయారు చేసిన కథ ఇది. కథని నడిపే విధానం ఆకట్టుకొంటుంది. మహేష్‌శంకర్‌ నేపథ్య సంగీతం కథకు బలాన్నిచ్చింది'' అన్నారు.


చిత్ర నిర్మాతల్లో ఒకరైన నాని మాట్లాడుతూ- ఇబ్బందుల్లో ఉన్న నలుగురు కుర్రాళ్లు ఓ దొంగతనం చేసి ఎటువంటి పరిణామాలకు గురయ్యారనే కధాంశంతో వినోదాత్మకంగా ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని, సన్నివేశంలో హాస్యం ప్రేక్షకుడు ఎంజాయ్ చేస్తాడని, సినిమా చూస్తేనే నచ్చుతుందని తెలిపారు.


మిగతా నిర్మాతలు మాట్లాడుతూ...ఎప్పటినుంచో తెలుగులో సినిమా చేయాలనుకుంటున్నాం. మా దర్శకత్వంలో ఓ సినిమా తీయడానికంటే ముందు ఒక తెలుగు చిత్రాన్ని నిర్మిస్తే బాగుంటుందనే ఆలోచనతో ఉన్న మాకు సిరాజ్‌ చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా ప్రారంభించాం. హిందీలో మేం రూపొందించిన షోర్‌ ఇన్‌ ద సిటీ అనే చిత్రానికి అతను అసోసియేట్‌ డెరెక్టర్‌గా పనిచేశారు. తెలుగు సినిమాలు చూస్తూ పెరిగిన మేం తెలుగు నేటివిటీకి అనుగుణంగా నిర్మిస్తున్న చిత్రమిది. క్రైమ్‌, కామెడీ, సెటైర్‌ అంశాలతో తయారవుతున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. ప్రేక్షకులకు వినోదాన్ని కలిగించే సినిమాలు తీయాలన్నది మా ధ్యేయం. వచ్చే ఏడాది రెండు తెలుగు చిత్రాలు నిర్మించాలనుకుంటున్నాం అని తెలిపారు.


చిత్రం: డి ఫర్‌ దోపిడి
సంస్థ: డి 2 ఆర్‌ ఫిలిమ్స్‌
నటీనటులు: వరుణ్‌సందేశ్‌, సందీప్‌ కిషన్‌, మెలనీ, రాకేష్‌, నవీన్‌, దేవా కట్టా, తనికెళ్ల భరణి,హేమ, పృథ్వి, పావలా శ్యామల తదితరులు
సంగీతం: మహేష్ శంకర్,
కెమెరా: లుకాస్,
కళ: ఉపేంద్ర రెడ్డి,
కూర్పు: ధర్మేంద్ర,
నిర్మాతలు: రాజ్‌ నిడిమోరు, కృష్ణ డికె, నాని
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సిరాజ్ కల్లా.
విడుదల: బుధవారం.

English summary
D for Dopidi is a 2013 Telugu film directed by Siraj Kalla, starring Varun Sandesh, Sundeep Kishan, Naveen, Rakesh and Melanie Kannokada in the lead roles. This film is produced by Raj Nidimoru and Krishna D.K.,Nani under D2R Films Pvt Ltd Banner. Mahesh Shankar composed the music.
మీ వ్యాఖ్య రాయండి

Please read our comments policy before posting

Click here to type in Telugu
Subscribe Newsletter
Coupons
My Place My Voice