twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వాళ్లని ఇమిటేట్ చేయడానికి ప్రయత్నిస్తుంటా: వెంకటేష్

    By Srikanya
    |

    హైదరాబాద్ :"తెలుగు చిత్ర పరిశ్రమలో కామెడీని పండించినవారు ఎంతో మంది ఉన్నారు. నా కెరీర్ తొలినాళ్లలో నేనెక్కువగా అల్లు రామలింగయ్యగారిని తలచుకునేవాడిని. నేను చాలా వరకు కామెడీ ఆర్టిస్టులందరినీ ఇమిటేట్ చేయడానికి ప్రయత్నిస్తుంటాను. కెమెరా ముందు ఆ పర్టిక్యులర్ షాట్‌కు తగ్గట్టు ఏదో అనుకుని చేసేస్తాను. షాట్‌లలో పదే పదే చేస్తుంటే ఆ మేనరిజం మరలా రాదు. అందుకే రెండు, మూడు టేకుల కన్నా ఎక్కువ చేయడానికి ఇష్టపడను.'' అన్నారు వెంకటేష్.

    హీరో రామ్‌తో కలిసి వెంకీ నటించిన 'మసాలా' ఈనెల 14న థియేటర్లలోకి వస్తోంది. స్రవంతి రవికిషోర్‌, డి.సురేష్‌బాబు సంయుక్తంగా నిర్మించిన చిత్రమిది. వెంకటేష్‌ మాట్లాడుతూ-'' అభిమానుల ఎమోషన్‌ని నేను అర్థం చేసుకుంటా. తమ అభిమాన హీరోని రేయ్‌ అంటే ఫ్యాన్స్‌ ఫీలవుతారు. కాకపోతే సినిమాలో కేవలం హీరోని మాత్రమే చూడొద్దు. కథని చూడండి. సినిమాని సినిమాగానే చూడండి..ఇదే నా ఫ్యాన్స్‌కి చెబుతాను'' అన్నారు.

    ఇక "మసాలా స్పైసీగా, ఎనర్జీతో ఉంటుంది. హెల్దీ క్లీన్ ఎంటర్‌టైనర్. కడుపుబ్బ నవ్వించే సన్నివేశాలు, డైలాగులు చాలా ఉంటాయి. నేను ఇందులో బలరామ్ పాత్రలో కనిపిస్తాను. ఇంతకు ముందు ఇలాంటి పాత్రను నేనెప్పుడూ చేయలేదు. చాలా ఫ్రెష్‌గా అనిపించి చేశాను. బోళాతనం ఉన్న వ్యక్తిగా కనిపిస్తాను. రామ్ పాత్రకు రెండు షేడ్స్ ఉంటాయి. తను చాలా బాగా చేశాడు. బేసిగ్గా పాత్రలు నచ్చి సినిమా పెద్ద హిట్ అవుతుందనే పాజిటివ్ మెంటాలిటీతో మేం ఈ సినిమా చేశాం. హిందీ వర్షెన్ బోల్‌బచ్చన్‌కు తెలుగులో కొంత మార్పు ఉంటుంది. బట్లర్ ఇంగ్లిష్‌లో మాట్లాడటం ఈ సినిమాలో హైలైట్ అవుతుంది. నా పక్కన జె.పి పాత్ర కూడా మెప్పిస్తుంది. పాటలకు మంచి స్పందన వస్తోంది. జపాన్‌లో తెరకెక్కించిన పాట కనులపండుగగా ఉంటుంది.'' అన్నారు.

    అలాగే "సినిమా చూడ్డానికి వచ్చిన వారికి ఈ కథ చాలా సులభంగా అర్థమవుతుంది. లేనిపోని ట్విస్టులతో హంగామా ఉండదు. హాయిగా, ప్రశాంతంగా నవ్వుకుని సేదదీర్చేలా ఉంటుంది. నువ్వునాకు నచ్చావ్, మల్లీశ్వరి చిత్రాల తరహాలో ఉంటుంది. మామూలుగా ఏదో వచ్చీరాని ఇంగ్లిష్ మాట్లాడటానికి అందరూ సరదా పడుతుంటాం. ఈ సినిమాలో ఆ తరహా డైలాగులు చాలానే ఉన్నాయి. టీజర్‌కు అద్భుతమైన స్పందన వస్తోంది. సీతమ్మవాకిట్లో.. చిత్రంలో పెద్దోడి పాత్రకు ఇందులో బలరామ్ పాత్రకు ఎక్కడా పొంతన ఉండదు. ఇది హై ఓల్టేజ్ ఎంటర్‌టైనర్. నా పాత్ర చాలా మేన్లీగా, అందరికీ నచ్చేలా ఉంటుంది. షూటింగ్ స్పాట్‌లో మానిటర్‌లో చూసుకుని చాలా ఎంజాయ్ చేశాం.'' చెప్పారు.

    కొత్త చిత్రాల గురించి చెప్తూ... "ఈ ఏడాది మూడు సినిమాలు విడుదలవుతున్నాయి. వచ్చే ఏడాది కూడా మూడున్నాయి. మారుతితో 'రాధ' చేస్తున్నాను. నయనతార నాయిక. కృష్ణవంశీ దర్శకత్వంలో రామ్‌చరణ్, నేను కలిసి ఓ సినిమా, మా సంస్థలో ఓ సినిమా. నేనెప్పుడూ ఏదీ ప్లాన్ చేయను. కానీ చేసేదాన్ని శ్రద్ధగా చేస్తాను. మిగిలిన వారితో పోలిస్తే నా కెరీర్‌లో రీమేక్‌లు ఎక్కువున్నాయని అందరూ అనుకుంటున్నారు. కానీ ఇతరులు కూడా రీమేక్‌లు చేశారు. కాకపోతే సక్సెస్ రేట్ నాకు ఎక్కువ ఉండటంతో అలా అనుకుంటున్నారేమో. ఇప్పటికీ సల్మాన్, విజయ్ పొరుగు భాషల్లో మాంఛి హిట్ పడితే రీమేక్ చేసేద్దామని వెయిట్ చేస్తున్నారు. నా స్ట్రెయిట్ సినిమాల్లోనూ చాలా పెద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌లున్నాయి. మా సంస్థ ఈ ఏడాది స్వర్ణోత్స వం జరుపుకోవడం ఆనందంగా ఉంది. మా సంస్థ అభివృద్ధికి నాన్న, అన్నయ్య కారకులు. మంచి కథ కుదిరితే తప్పకుండా మా ఫ్యామిలీ హీరోలంద రం కలిసి సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. పవన్‌తో నూ, ఇతర హీరోలతోనూ మంచి కథలొస్తే చేయడానికి సిద్ధంగా ఉన్నా.'' అని వివరించారు.

    English summary
    
 Makers Venkatesh-Ram starrer 'Masala' are planning to release the film on November 14. The film is a remake of the Hindi hit 'Bol Bachchan'. The Telugu version of the hilarious entertainer features Anjali and Shahzn Padamsee opposite Venkatesh and Ram respectively. 'Masala' has been produced by Sravanthi Ravikishore and Suresh Babu is presenting it. Vijaybhasker, who had earlier directed Venkatesh in 'Nuvvu Naaku Nachchav' and 'Malliswari', has teamed up with the star once again for this project.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X