twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ది గ్రేట్ డైరెక్టర్ కన్నుమూత, విషాదం

    By Bojja Kumar
    |

    కొచ్చి: ప్రముఖ మళయాల దర్శకుడు జె శశికుమార్ కన్నుమూసారు. 86 ఏళ్ల శశికుమార్ కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. అతన్ని కొచ్చి లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ గురువారం మరణించారు. శశికుమార్ మరణంతో మళయాల చిత్ర సీమలో విషాదం నెలకొంది.

    మళయాల సినీ పరిశ్రమలో తొలి హిట్ మేకర్‌గా ఆయనకు పేరుంది. 1960 నుండి 70 మధ్య కాలంలో ఆయన పలు హిట్ చిత్రాలను తెరకెక్కించారు. శశికుమార్ అసలు పేరు నంబియాతుసెరిల్ వార్కే జాన్. కేరళలోని అలపుజలో జన్మించారు. మళయాల చిత్ర సీమలో ఇప్పటి వరకు ఎవరూ చేయనన్ని సినిమాలు ఆయన తెరకెక్కించి రికార్డు సృష్టించారు. 141 సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు. దీంతో పాటు ఒకే హీరోతో అత్యధిక సినిమాలో, ఒకే హీరోయిన్‌తో అత్యధిక సినిమాలు, ఒకే సంవత్సరంలో అత్యధిక సినిమాలు లాంటి రికార్డులు ఆయన సొంతం.

    Veteran Director J Sasikumar Passed Away

    మళయాలం ఎవర్ గ్రీన్ యాక్టర్ ప్రేమ్ నజీర్ తో ఆయన ఏకంగా 84 సినిమాలు తీసారు. అదే విధంగా నటి శీలాతో 47 సినిమాలు చేసారు. ప్రేమ్ నజీర్, శశికుమార్ కాంబినేషన్లో సినిమా వచ్చిందే అది సూపర్ హిట్ అనే పేరుంది. మొదట్లో వాస్తవిక చిత్రాలు తీసిన శశికుమార్...ఆ తర్వాత ఎంటర్టెన్మెంట్, థ్రిల్లర్ మూవీస్ కూడా తెరకెక్కించారు. కేరళ ప్రభుత్వం గతేడాది ఆయన్ను జేసి డేనియల్ అవార్డుతో సత్కరించింది.

    English summary
    Veteran director J Sasikumar (86) passed away. The director, who was referred to as the first hitmaker of Malayalam cinema passed away on Thursday at a private hospital in Kochi due to age-related illness.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X