twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇది రావటానికి ఆరేళ్ళు పట్టింది : విశాల్‌

    By Srikanya
    |

    హైదరాబాద్ : నన్ను హీరోగా ఒప్పుకోరనే ఆలోచన ప్రారంభంలో ఉండేది. కానీ 'ప్రేమ చదరంగం' చిత్రంతో హీరో అయ్యా. ఈ సినిమా విజయం సాధించడంతో నన్ను హీరోగా అంగీకరించారని తెలిసింది. ఆ తర్వాత విజయాలను ఆశ్వాదించాను. కానీ ఇటీవల ఆ తరహా హిట్టు కోసం చాలా శ్రమించా. 'వాడు వీడు‌' వంటి భిన్నమైన పాత్రలను కూడా పోషించా. కానీ ఏకంగా ఆరేళ్ల తర్వాత ఈ తరహా విజయం నన్ను వరించింది. ఈ రోజు కోసమే ఎదురుచూశా. ప్రస్తుతం తిరు దర్శకత్వంలో 'నాన్‌ సిగప్పు మనిదన్‌' చిత్రంలో నటిస్తున్నా. మళ్లీ నా సొంత బ్యానరులో సుశీంద్రన్‌ దర్శకత్వంలో నటిస్తానని చెప్పాడు అని విశాల్ చెప్పుకొచ్చారు.

    పందెం కోడి, భరణి, వాడు వీడు, వెంటాడు వేటాడు వంటి వైవిధ్యమైన సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన విశాల్‌ తొలిసారి విశాల్‌ ఫిలింఫ్యాక్టరీని స్థాపించి స్వయంగా నిర్మించిన ద్విభాషా చిత్రం 'పల్నాడు'. 'నా పేరు శివ' ఫేం సుశీంద్రన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. 'గజరాజు' ఫేం లక్ష్మీమీనన్‌ హీరోయిన్.

    విశాల్‌ అంటే పదిమందిని ఒక్కడే తంతాడు. ఇదీ జనాల్లో ఉన్న ఇమేజ్‌. దానికి దూరంగా చేసిన తొలి ప్రయత్నమిది. దాదాపు పదేళ్ల తర్వాత నా ఇమేజ్‌కి పూర్తి ఆపోజిట్‌ పాత్రలో కనిపిస్తున్నా. కొట్టాలంటే భయపడే కుర్రాడిగా ఈసారి కనిపిస్తున్నా. నా కెరీర్‌లో మర్చిపోలేని పాత్ర ఇది అన్నారు విశాల్‌.

    అలాగే... ''ఇప్పటిదాకా హీరోగానే మాట్లాడాను. తొలిసారి నిర్మాతగా మాట్లాడుతున్నాను. ఈ సినిమా వెనక చాలా కష్టం ఉంది. అదంతా ఇష్టంతోనే చేశాను. ప్రతీ హీరో జీవితంలోనూ ఓ మలుపు అనేది ఉంటుంది. అది దర్శకుడితోనే వస్తుంది. ఈ కథ విన్నాక కూడా నాకు ఓ మంచి మలుపునిచ్చే చిత్రమవుతుందనిపించింది. నాలో ఆవేశం, సినిమాపై వున్న ప్రేమవల్ల నిర్మాతనయ్యాను. 'పల్నాడు' అందరినీ ఆకట్టుకొనే ఓ మంచి చిత్రమైంది. ఇక తెలుగు సినిమా గురించి ప్రతీసారీ చెబుతూనే ఉన్నాను. నేను నిర్మాతగా మారడం వల్లే నా తెలుగు సినిమా ఆలస్యమైంది. త్వరలోనే ఆ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లబోతున్నా'' అన్నారు.

    ఇక " ఎవరికైనా ఏదో ఒక సమయంలో టర్నింగ్ పాయింట్ వస్తుంది. సుశీంద్రన్ ఈ కథ చెప్పినప్పుడే ఇది అలాంటి కథ అనిపించింది. నా కెరీర్‌కు ఇది చాలా ముఖ్యమైన చిత్రం.ఇప్పటికే మా కుటుంబానికి ఓ బ్యానర్ ఉన్నప్పటికీ, ఈ సినిమా నిర్మాణాన్ని నేనే స్వయంగా చూసుకోవాలనే ఉద్దేశంతో విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీని ఏర్పాటుచేశాను. వచ్చే సంక్రాంతికి తెలుగులో శశి దర్శకత్వంలో ఓ స్ట్రయిట్ సినిమా చేయబోతున్నా'' అని చెప్పారు.

    English summary
    Vishal's latest Palnadu released two weeks back. Directed by Suseenthiran and Produced by Vishal Krishna under Vishal Film Factory Banner. Music scored by D.Imman.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X