twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'అమ్మా నాన్న రవితేజ' అంటున్నాడు (ఫొటోలు)

    By Srikanya
    |

    హైదరాబాద్: ''సంగీత దర్శకుడిగా నాకు కిక్‌ ఇచ్చింది రవితేజనే. ఇద్దరం కలసి ఏడు సినిమాలు చేశాం. ఆయనకు 'అమ్మా నాన్న తమిళమ్మాయి' అయితే నాకు 'అమ్మా నాన్న రవితేజ'. నటీనటులను, సాంకేతిక నిపుణులను ఆయన నమ్మే విధానం అద్భుతం'' తమన్‌ అన్నారు.

    ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన 'పవర్‌' చిత్రం పాటల విడుదల వేడుకకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. రవితేజ హీరోగా నటించిన చిత్రమిది. హన్సిక, రెజీనా హీరోయిన్స్ . కె.ఎస్‌.రవీంద్ర (బాబి) దర్శకత్వం వహిస్తున్నారు. తమన్‌ స్వరాలు సమకూర్చారు. రాక్‌లైన్‌ వెంకటేష్‌ నిర్మాత.

    అతిథిగా వచ్చిన వి.వి.వినాయక్‌ మాట్లాడుతూ... ''సహాయ దర్శకులకు దగ్గరగా ఉంటాడు రవితేజ. వాళ్ల ప్రతిభను గుర్తిస్తూ అవకాశాలిస్తుంటాడు. మేమిద్దరం బావ.. బావ అని పిలుచుకుంటాం. నేను, సురేందర్‌రెడ్డి సహాయ దర్శకులుగా ఉన్నప్పుడు మా కథలకు మొదటి ప్రేక్షకుడు రవితేజనే. ఆయన్ని వూహించుకునే ప్రతి కథను రాసుకునేవాళ్లం'' అన్నారు.

    తొలి సీడిని

    తొలి సీడిని

    వినాయక్‌ తొలి సీడీని ఆవిష్కరించారు. కర్ణాటక రాష్ట్రం రాజరాజేశ్వరీ నగర్‌ నియోజకవర్గ శాసనసభ్యుడు మునిరత్న నాయుడు అందుకున్నారు.

    వి.వి.వినాయక్‌ మాట్లాడుతూ...

    వి.వి.వినాయక్‌ మాట్లాడుతూ...

    ''బలుపు' చిత్రీకరణ సమయంలో బాబి పని తీరు గమనించి రవితేజ అతనికి అవకాశమిచ్చాడు. ఈ సినిమా తప్పక విజయం సాధిస్తుంది. ఆత్మవిశ్వాసంతో చెప్తున్న మాట ఇది. ఎందుకంటే బాబి ప్రేక్షకులకు ఆలోచనలకు దగ్గరగా ఆలోచిస్తాడు. వాళ్లకు ఎలాంటి సినిమాలో కావాలో బాబికి బాగా తెలుసు. భవిష్యత్తులో పెద్ద దర్శకడు అవుతాడు. తమన్‌ పాటలు బాగున్నాయి. రాక్‌లైన్‌ వెంకటేష్‌ ప్రతిష్ఠాత్మక చిత్రంతో తెలుగు పరిశ్రమలోకి అడుగు పెడుతున్నారు'' అన్నారు.

    రవితేజ మాట్లాడుతూ...

    రవితేజ మాట్లాడుతూ...

    ''అందరూ కష్టపడితే తప్పకుండా మంచి సినిమా ప్రేక్షకుల ముందుకొస్తుంది. అందుకు ఉదాహరణ ఈ సినిమానే. హన్సిక, రెజీనా మంచి పాత్రలు పోషించారు. తమన్‌, నేను కలసి చాలా సినిమాలు చేశాం. అందులో ఘన విజయాలున్నాయి, మోస్తరుగా ఆడినవి ఉన్నాయి, పరాజయాలున్నాయి. తమన్‌ సంగీతం మాత్రం ఎప్పుడూ నిరాశ పరచలేదు. నాతో 'బలుపు'లో చిన్న బిట్‌ పాడించాడు తమన్‌. ఇందులో మొత్తం పాటంతా సరదాగా పాడేశాను. రాక్‌లైన్‌ వెంకటేష్‌ అభిరుచిగల నిర్మాత. రాజీపడకుండా చిత్రాన్ని నిర్మించారు. బాబి రూపంలో తెలుగు పరిశ్రమకు మంచి దర్శకుడు వస్తున్నాడు. తనతో మళ్లీ మళ్లీ సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. ప్రచార చిత్రంతోనే బాబి సత్తా ఏంటో చూపించాడు. అప్పుడే సినిమా విజయం ఖరారైపోయింది'' అన్నారు.

    దర్శకుడు మాట్లాడుతూ..

    దర్శకుడు మాట్లాడుతూ..


    ''బలుపు' సమయంలో రవితేజకు ఈ కథ చెప్పాను. సగం కథ వినగానే ఈ సినిమా చేస్తున్నాం అన్నారు. 'బలుపు' విజయవంతమైన తర్వాత ఎంతోమంది దర్శకులు ఆయన్ను సంప్రదించారు. మాట నిలబెట్టుకొని నాకే అవకాశమిచ్చారు. ఇలాంటి హీరో పరిశ్రమలో తప్పకుండా ఒకరుండాలి. సెట్‌లో ఆయనందించిన సహకారం ఎప్పటికీ మరచిపోను. ఒక సహాయ దర్శకుడిలా మాతో కలసి కష్టపడ్డారు. హన్సిక, రెజీనా ప్రేక్షకుల మనసు దోచుకుంటారు. నా అభిమాన సంగీత దర్శకుడు తమన్‌ మంచి బాణీలు అందించారు. కోన వెంకట్‌ దగ్గర వినోదం అంటే ఏంటో నేర్చుకున్నాను. ఈ సినిమాకు చక్కటి సహకారం అందించారు'' అన్నారు బాబి.

    హన్సిక మాట్లాడుతూ.....

    హన్సిక మాట్లాడుతూ.....

    ''రవితేజ గొప్ప నటుడు. బాబి మంచి దర్శకుడు అవుతాడు. తొలి సినిమా అయినా ఎక్కడా తడబాటు లేకుండా పూర్తి చేశాడు'' అన్నారు.

    రెజీనా మాట్లాడుతూ...

    రెజీనా మాట్లాడుతూ...

    ''ఇందులో వైష్ణవి అనే వైవిధ్యమైన పాత్రను పోషించాను. నాపై నమ్మకంతో అవకాశమిచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. రవితేజతో నటించడం చక్కని అనుభవం. ఆయన జోరు చూస్తే ముచ్చటేస్తుంది. నేను, రవితేజ కలసి చేసిన 'చంపేసింది..' పాట నయనానందకరంగా ఉంటుంది'' అన్నారు రెజీనా.

    నిర్మాత మాట్లాడుతూ...

    నిర్మాత మాట్లాడుతూ...

    ''తెలుగు సినిమా నిర్మించాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. ఈ విషయమై నాలుగేళ్లగా రవితేజతో మాట్లాడుతున్నాను. మంచి కథ దొరికితే చెబుతా అనేవారు. 'పవర్‌' కథ విని నాకు కబురు పెట్టారు. కథ వినగానే నాకూ నచ్చింది. వెంటనే ప్రారంభించాం. ఈ సినిమాతో రవితేజలోని జోరును కొద్దిగానే వినియోగించుకున్నాం. ఇంకా చాలా వినియోగించుకోవాల్సి ఉంది. బాబి దర్శకత్వ శైలి, తమన్‌ పాటలు బాగున్నాయి. సినిమాను సెప్టెంబరు 5న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాము''అన్నారు నిర్మాత.

    స్టెప్పులేసిన బ్రహ్మీ

    స్టెప్పులేసిన బ్రహ్మీ

    ఈ సినిమాలో రవితేజ పాడిన 'నోటంకి నోటంకి...' అనే పాటకు వేదికపై రవితేజ, హన్సిక, బ్రహ్మానందం, తమన్‌ స్టెప్పులేసి ప్రేక్షకులను అలరించారు.

    వీరంతా అతిధులు

    వీరంతా అతిధులు


    కార్యక్రమంలో బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌, దిల్‌రాజు, కోన వెంకట్‌, అజయ్‌, భాస్కరభట్ల, వరికుప్పల యాదగిరి, రామ్‌లక్ష్మణ్‌, సంపత్‌, ప్రగతి, గౌతంరాజు, నీరజ కోన తదితరులు పాల్గొన్నారు.

    తెర వెనుక,ముందు

    తెర వెనుక,ముందు

    ఈ చిత్రంలో బ్రహ్మానందం, పరుచూరి వెంకటేశ్వరరావు, బ్రహ్మాజీ, పోసాని కృష్ణమురళి, ముఖేష్ రుషి, రావూ రమేష్, సంపత్, సుబ్బరాజు, సప్తగిరి, సురేఖావాణి, జోగి బ్రదర్స్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం:ఎస్.ఎస్.తమన్, కెమెరా:ఆర్థర్ ఎ.విల్సన్, ఎడిటింగ్:గౌతమ్‌రాజు, మాటలు:కోన వెంకట్, నిర్మాత:రాక్‌లైన్ వెంకటేష్, కథ, దర్శకత్వం: కె.ఎస్.రవీంద్రనాధ్ (బాబి).

    English summary
    
 
 Director VV Vinayak was the chief guest at the audio launch of Ravi Teja's upcoming film Power held at Shiplakala Vedika on Sunday evening. VV Vinayak presented the audio CD of the film to Karnataka MP Maniratna Naidu amidst thundering applause from the audience.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X