twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కొట్లాటకు కారణమైన ‘రేసు గుర్రం’, పలువురి అరెస్ట్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: రేసుగుర్రం టిక్కెట్ల వ్యవహారం రెండు వర్గాల మధ్య గొడవకు కారణం అయింది. ఒక వర్గం యువత మరో వర్గం యువతపై దాడి చేయడంలో పరిస్థితి ఉద్రిక్తతలకు దారి తీసింది. సైఫాబాద్ పీజీ కళాశాల విద్యార్థులు ఖైరతాబాద్‌లోని సెన్సేషన్ థియేటర్‌లో ప్రదర్శితమవుతున్న రేసుగుర్రం చిత్రానికి వెళ్లిన సందర్బంగా ఈ సంఘటన చోటు చేసుకుంది.

    టిక్కెట్ల విషయంలో వీరికి, స్థానిక యువతకు మధ్య వివాదం జరిగింది. ఇది కొట్లాటకు దారి తీసింది. దెబ్బలు తిన్న విద్యార్థులు కళాశాలకు వెళ్లి మరికొంతమందితో థియేటర్ వద్దకు వచ్చారు. ఇది గమనించిన సైఫాబాద్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడ యువత ఎందుకు దాడి చేశారో తెలుసుకునేందుకు వచ్చామని వారు చెప్పినా పోలీసులు వినిపించుకోలేదు. వారందర్నీ స్టేషన్‌కు తరలించడంతో అక్కడ ఆందోళనకు దిగారు.

    Youth melee for Race Gurram tickets

    రేసు గుర్రం సినిమా విషయాల్లోకి వెళితే...
    అల్లు అర్జున్ తాజా చిత్రం "రేసు గుర్రం" 1050 థియోటర్స్ తో ప్రపంచవ్యాప్తంగా మొన్న శుక్రవారం విడుదల అయ్యింది. మార్నింగ్ షోకే ఈ చిత్రం హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. అలాగే ఓపినింగ్స్ సైతం అల్లు అర్జున్ కెరీర్ లో బెస్ట్ అన్న రీతిలో వచ్చాయి. ఇప్పుడు వీకెండ్ కలెక్షన్స్ (మూడు రోజులు) లో కూడా ఈ సంవత్సరం బెస్ట్ కలెక్షన్స్ కలెక్టు చేసి రికార్డు క్రియేట్ చేసిందంటున్నారు. ఏపీ /నైజాంలో 15.5 కోట్ల షేరు, ప్రపంచవ్యాప్తంగా 22Cr షేర్ సాధించిందని ట్రేడ్ వర్గాల అంచనా.

    English summary
    Youth melee for Race Gurram tickets at Sensation theater, Khairatabad.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X