twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శివశంకర్‌- సమీక్ష

    By Staff
    |

    Shivshanker
    చిత్రం: శివ్‌శంకర్‌
    నటీనటులు: మోహన్‌బాబు, సౌందర్య, నెతాన్యాసింగ్‌, రాజా మురద్‌,
    రియాజ్‌ఖాన్‌, వేణుమాధవ్‌, అలీ, ఏవీఏస్‌, తదితరులు
    సంగీతం: ఇళయరాజా
    నిర్మాత: మోహన్‌బాబు ఎం
    స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కాపుగంటి రాజేంద్ర

    'శివశంకర్‌' చిత్రం కోసం మోహన్‌బాబు గుండు కొట్టించుకొని నటించాడు. ఆయన గుండు కొట్టించుకోవడానికి కారణాలు ఏమైనా, ఈ సినిమా చూసిన ప్రేక్షకుడు మాత్రం నిజంగానే 'గుండు' కొట్టించుకోవాల్సిందే - తలనొప్పి కారణంగా. మరీ ఓల్డ్‌ ఫ్యాషన్‌లో తీసిన ఈ సినిమాలో ఎక్కడా పెద్దగా ఆసక్తి కలగదు. కాపీ కొట్టడంలో కూడా మనవాళ్ళకు సృజనాత్మకత లేదని మరోసారి నిరూపించిన చిత్రం ఇది. అద్భుతమైన హాలీవుడ్‌ సినిమా 'రోడ్‌ టు పెరిడిషిన్‌'ను నుంచి మూలకథ తీసుకొని సత్యానంద్‌రుబ్బిన ఈ పాత చింతకాయపచ్చడి గురించి ఒక్క మాటలో చెప్పుతాను. ఇటీవల ఓ మిత్రుడుని ( ఓ సినిమా గురించి మాట్లాడుతూ) ఎలా ఉందని అడిగితే, 'బిలో ఫ్లాప్‌' అని అన్నాడు. అంటే ప్లాఫ్‌కు కూడా అర్హం కాదన్నమాట. ఈ సినిమా ఖచ్చితంగా అదే కేటగిరికీ చెందుతుంది. పోసాని కృష్ణమురళి, సత్యానంద్‌, జనార్థన మహర్షి ... ఇలాంటి 'అయిపోయిన' రచయతలంతా ఇంకా 'ఫీల్డ్‌'లో ఉండడమే ఒక వండర్‌. ఇంకా వారితో సినిమాలకు పనిచేయడం మరో వండర్‌.

    శోభనాద్రి (రాజా మురద్‌) వైజాగ్‌లో మాఫియా నాయకుడు. అనాథ అయిన శివాజీ(మోహన్‌బాబు)ను చేరదీస్తాడు. శివాజీ బడా మాఫియా నేతగా ఎదుగుతాడు. శోభనాద్రి కొడుకు హేమాద్రి(రియాజ్‌ఖాన్‌)కు శివాజీ అంటే ఈర్ష్య. హేమాద్రి ఆవేశంలో ఓ జడ్జిని చంపేస్తాడు. దీంతో శోభనాద్రి తను పెంపుడు కుక్క అనుకునే శివాజీ పేర తన యావదాస్తిని రాస్తాడు. హేమాద్రి శివాజీని, శివాజీ కుటుంబాన్ని మట్టుబెట్టాలనుకుంటాడు. కానీ శివాజీ భార్య (సౌందర్య), ఆయన కొడుకును మాత్రమే చంపగలుగుతాడు. దీంతో వైరాగ్యం చెందిన శివాజీ మైసూర్‌-కొడుగు రహదారిలోని బౌద్ద భిక్షవుల శరణార్థ శిబిరం బైలకుప్పికి చేరి అక్కడ బౌద్ధ బిక్షకుడిగా మారుతాడు. తన పేరు మీద ఉన్న ఆస్తినంతా ఈ శిబిరానికే రాస్తాడు. ఇక్కడ ఓ కుర్రది (నెతాన్యసింగ్‌) ముగ్గులోకి దింపే ఛీఫ్‌ ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఇదే సందర్భంలో శివాజీకి ఓ శుభవార్త తెలియడంతో తిరిగి వైజాగ్‌ వెళుతాడు. హేమాద్రి ఆ ముఠాను హీరో ఎలా ఎదుర్కుంటాడనేది మిగతా కథ.

    బౌద్ద భిక్షకుడిగా మోహన్‌బాబు 'గెటప్‌' బాగుంది. అయితే, మిగతా సందర్భంలో ఆయన నటన ఆయన గతచిత్రాల మాదిరిగానే ఉంది. బౌద్దభిక్షకుడితో నెతాన్యా రోమాన్స్‌ వంటి ఛీఫ్‌ కమర్షియల్‌ ట్రిక్కులు అభ్యంతరకరం. సౌందర్య నటించిన ఈ చివరి చిత్రంలో ఆమె పాత్ర స్వల్పమైనా బాగానే చేసింది. పౌల్‌ న్యూమాన్‌ నటించిన పాత్రను రాజా మురద్‌తో చేయించారు. పవన్‌కళ్యాణ్‌ 'జానీ' చిత్రంలోలోనే విఫలమైన రాజా మురాద్‌ ఇందులోనూ అదే పద్దతిలో చేశాడు.

    సినిమాకున్న ఏకైక బలం ఇళయరాజా సంగీతం. 'కృష్ణా ఇటు రాకు..' (కలోనియల్‌ కజిన్స్‌ పాటనే తిరిగి ఉపయోగించారు) వంటి మెలోడియస్‌ పాటలున్నాయి. నూతన దర్శకుడు రాజేంద్ర దర్శకుడిగా నిరూపించుకున్నదేమీ లేదు, బోర్‌ చిత్రం తీశాడన్న పేరు మూటగట్టుకోవడం తప్ప.

    ప్రథమార్థం, ద్వితీయార్థం అని లేకుండా హోల్‌సేల్‌గా ప్రేక్షకులకు గుండు కొట్టించే ప్రయత్నమే. చూడకుండా ఉండడం ఆరోగ్యానికి మంచిది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X