twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఈ వేసవి సినిమాల రివ్యూలు చదవండి

    By Staff
    |

    Pokiri
    పోకిరి
    పూరీ మాస్‌ ట్రీట్‌మెంట్‌కి మహేష్‌ క్లాస్‌ యాక్షన్‌ కలిపి తయారు చేసిన కాక్‌టెయిల్‌ 'పోకిరి' సినిమా. సెకండాఫ్‌ కథ కాస్తా పక్కదారి పట్టినా క్లైమాక్స్‌కు వచ్చే సరికి సర్దుకోవటంతో చిత్ర నిలబడింది. ప్రత్యేకంగా పోకిరిగా మహేష్‌ బాబు వంక పెట్ట వీలు లేని విధంగా నటించాడు.... పూర్తి సమీక్ష చదవండి

    వీరభద్ర
    బాలయ్యకు మళ్లీ బాక్సాఫీసు వద్ద విజయం మొహం చాటేసే అవకాశాలే వున్నాయి. కథ, కథనంలో ఫార్ములాను మాత్రమే దృష్టిలో పెట్టుకుని మిగతా అంశాలను విస్మరించడం వల్ల 'సమరసిహారెడ్డి'లా ప్రత్యేకమైన సినిమాగా 'వీరభద్ర' నిలువలేకపోయింది. బాలకృష్ణ ఎప్పటిలాగే కష్టపడి నటించినా ఆశించిన విజయాన్ని అందించే పరిస్థితి లేదు... పూర్తి సమీక్ష చదవండి

    బంగారం
    కూల్‌ (తమిళ) వంటి మెగాహిట్స్‌ దర్శకుడు ధరణి బంగారం సినిమాను తనదైన శైలిలో పూర్తి యాక్షన్‌ చిత్రంగా రూపొందించారు. పవన్‌ కళ్యాణ్‌ ఎప్పటిలాగే తనదైన మ్యానరిజం, బాడీ లాంగ్వేజ్‌లతో ఎనర్జీగా నటించాడు. కానీ కథలో హీరోహీరోయిన్ల ప్రేమ సన్నివేశాలు లేకపోవడం, హీరోయిన్‌ వేరే అతణ్ని ప్రేమిస్తే వారిని కలపడానికి హీరో యాక్షన్‌లోకి దిగడమే సినిమా కావడం మితిమీరిన హింస వంటి విషయాలను చాలా మంది ప్రేక్షకులకు మింగుడు పడవు. పూర్తి సమీక్ష చదవండి

    మాయాజాలం
    తెలుగులో అరుదుగా వచ్చే సోషియో ఫాంటసీలకు 'మాయాజాలం' చిత్రంతో మరోసారి తెరలేపాడు కృష్ణారెడ్డి. గతంలో ఇదే కోవలో ఆయన దర్శకత్వం వహించిన 'యమలీల', 'మాయలోడు', ఘటోత్కచుడు' చిత్రాల హిట్‌కి కారణమైన సమర్ధవంతమైన స్క్రిప్ట్‌ ఈసారి లోపించింది. పూర్తి స్ధాయిలో హాస్యం పండిద్దామనుకున్నా ప్రధాన పాత్ర ఎక్కడా యాక్టివ్‌ కాకపోవడంతో ఆశించిన బిగి రాలేదు, ఊహించిన వినోదం అందలేదు.... పూర్తి సమీక్ష చదవండి

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X