twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దొంగ దొంగది

    By Staff
    |

    Dongadongadi
    చిత్రం: దొంగ దొంగది
    నటీనటులు: మనోజ్‌కుమార్‌, సదా, వర్షిత, మానిక్య వినాయగం,
    సునీల్‌, రాజీవ్‌ కనకాల, తదితరులు
    సంగీతం: దిన
    మాటలు: చింతపల్లి రమణ
    నిర్మాతలు: శానం నాగ అశోక్‌కుమార్‌, ఎన్‌.వి.ప్రసాద్‌
    కథ, స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం: సుబ్రమణ్యం శివ

    థాంక్‌గాడ్‌, ఇటీవల వచ్చిన 'కొడుకు'ల చిత్రాల మాదిరిగా, 'దొంగ దొంగది' మరీ అధ్వాన్నంగా లేదు. 'కొడుకు'ల చిత్రాలంటేనే భయమేస్తున్న ప్రస్తుతం తరుణంలో తమిళంలో సూపర్‌హిట్‌ అయిన 'తిరుడా తిరుడి' పేరిట రీమేక్‌ చేసిన ఈ చిత్రం ఫర్వాలేదనే చెప్పాలి. మోహన్‌బాబు రెండో కుమారుడు మనోజ్‌కుమార్‌ అందంగా లేకపోయినా, రుబ్బురోలులా ఉన్నా, తొలి సినిమాలో ఫర్వాలేదనిపించేలా చూశాడు. మరీ తలపట్టుకొని, బాదుకోవాల్సిన అవసరమూ రాకపోవడం రిలీఫే ('కొడుకు', 'పల్లకీలో పెళ్ళికూతురు'లా మాదిరిగా). అయితే, గుడ్డిలో మెల్ల చిత్రంగానే పరిగణించాలే తప్ప సినిమా బాగుందనడానికి లేదు. అంతే.

    తమిళంలో ఈ సినిమా అంత పెద్ద హిట్‌ కావడానికి ప్రధాన కారణం హీరో ధనుష్‌. అతను కూడా అందహీనుడే. కాకపోతే, బాగా టాలెంట్‌ ఉన్నవాడు. మాస్‌కు నచ్చేవిధంగా బాగా చేశాడు. మనోజ్‌ ఈ పాత్రకు బాగానే నప్పినా, తెలుగులో ఈ సినిమా మాతృక స్థాయి అంత వినోదకరంగా లేదు. ప్రథమార్థం మరీ రోటీన్‌. పాత చింతకాయ పచ్చడి. ద్వితీయార్థంలోనే సినిమా కాస్తా బాగుంది. బహుశా దర్శకుడు సుబ్రమణ్యం శివకి తెలుగు భాష తెలియకపోవడం మూలానా కాబోలు, డైలాగ్స్‌లో 'పస' ఉందా లేదా అనేది పట్టించుకోలేదనుకుంటా.

    'చంద్రగిరి చంద్రు'గా సునీల్‌ కామెడీ నవ్వు కలిగించినా, సరియైన డైలాగ్‌లు లేనప్పుడు సునీల్‌ నటన తేలిపోయింది.

    నాటు వినోదం నచ్చేవారికి ఇందులో హీరో, హీరోయిన్లు తిట్టుకునే తిట్లు, తిట్ల ద్వారా కలిగే ప్రేమ సన్నివేశాలు నచ్చుతాయి. బేవార్సుగా తిరిగే వాసు (మనోజ్‌), విజ్జి (సదా) తిట్టుకుంటూనే ఒకరినొకరు ఇష్టపడుతారు. విజ్జి వలన వాసు తన తండ్రి ఇచ్చిన డబ్బును పోగొట్టుకోవాల్సి వస్తుంది. తండ్రి చెడామడా తిట్టడంతో తిరుపతి నుంచి వైజాగ్‌ వెళ్ళి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటాడు. విజ్జికి కూడా వైజాగ్‌ ట్రాన్స్‌ఫర్‌ అవుతుంది. అయితే, విజ్జి వాసుపై విపరీతమైన ఇష్టం పెంచుకుంటుంది. వేరే అమ్మాయితో వాసు కలిసి నడిచినా, యుద్దానికి దిగుతుంది. వాసు తన ప్రేమ నిరాకరించడంతో విజ్జి ఆత్మహత్యకు యత్నించడం, అనంతరం వాసు తన ప్రేమను కాపాడుకోవడం, తండ్రికి తన ఎదుగుదలను చూపించుకోవడం మిగతా కథ.

    సినిమాలో ప్రధానంగా లోపం చిక్కని స్క్రీన్‌ప్లే లేకపోవడం, మరీ నాసిరకం సంగీతం ఉండడం. అంతే కాకుండా, సీన్లన్ని అతికించినట్లు ఉన్నాయి. దిన అందించిన సంగీతంలో తమిళంలో హిట్‌ అయిన 'మన్మధ రాజా..' పాట ఒక్కటే ఫర్వాలేదు. అయితే, తమిళనాడులో మాదిరిగా, ఫీమేల్‌ సింగర్స్‌తో హైపిచ్‌లో పాడించే మాస్‌ పాటలు వంటి గిమ్మిక్కులు ఆంధ్రప్రదేశ్‌లో పెద్దగా చెల్లవన్న సంగతి, తమిళదర్శకులు, తమిళ చిత్రాలను చూసి ప్రభావితమయ్యే దర్శకులు, సంగీత దర్శకులు గ్రహిస్తే మంచిది.

    మనోజ్‌ మరీ లావుగా ఉన్నా, నటన లో, డైలాగ్‌ డెలివరిలో ఫర్వాలేదనిపించాడు. సదా పాత్రకు తగ్గట్టుగా నటించింది. వర్షిత ఎక్స్‌పోజింగ్‌కు మాత్రమే పరిమితం.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X