twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పాస్‌మార్కులు రాని 'గుడ్‌బాయ్‌'

    By Staff
    |

    Good Boy
    -జోశ్యుల సూర్యప్రకాష్‌
    సినిమా: గుడ్‌బాయ్‌
    విడుదల తేదీ: 22 సెప్టెంబర్‌ 2005
    నటీనటులు: రోహిత్‌, నవనీత్‌కౌర్‌, వేణుమాధవ్‌, ఎల్‌బి శ్రీరాం,
    రాజ్యలక్ష్మి, బబ్లు, పోసాని కృష్ణమురళి, బ్రహ్మానందం తదితరులు
    సంగీతం: వందేమాతరం శ్రీనివాస్‌
    మాటలు: మరుదూరి రాజా
    కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: నాగేశ్వరరెడ్డి
    నిర్మాత: పైడి బాబు, సునీల్‌కుమార్‌రెడ్డి

    కాలేజి నేపధ్యం, కొంతమంది పనీపాటా లేని కుర్రాళ్ళు ఒక పొగరుబోతు అమ్మాయితో ప్రేమ వంటి అంశాలు కలిగిన సినిమాలు ఈమధ్య తగ్గాయి. ఆ లోటును భర్తీ చేద్దామని చేసిన ప్రయత్నం 'గుడ్‌బాయ్‌'. కథ ఇంటర్వల్‌ వచ్చేసరికే దారి తప్పినా పాటలు, కామెడీ ట్రాక్‌ కాలక్షేపంగా ఉండి ప్రేక్షకులు పారిపోకుండా కాపుకాశాయి.

    నాగేశ్వరరెడ్డి గత చిత్రాల్లో లాగానే ఒక మధ్యతరగతి కుటుంబం, చదువురాని పిల్లలు ఇందులోనూ కామన్‌గా ఉంటారు. ఎల్‌బి శ్రీరాం, శంకరాభరణం రాజ్యలక్ష్మిల ఒక్కగానొక్క కొడుకు వంశీ (రోహిత్‌) చదువు మాని ఎప్పుడూ నలుగురు ఫ్రెండ్స్‌ని వెంటేసుకుని బేవార్సుగా తిరుగుతుంటాడు. కొడుకుకు ఉద్యోగం ఇప్పిద్దామని తండ్రి వాలంటరీ రిటైర్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకుంటాడు. డిగ్రీ పాసైతేనే ఆ ఉద్యోగమైనా వచ్చేది. కానీ వంశీ ఒక గాళ్‌ఫ్రెండ్‌ని ప్రసాదించమని భగవంతుడిని వేడుకుంటాడు. అతని మొరను దేవుడు ఆలకించినట్టుగా కృష్ణవేణి (నవనీత్‌ కౌర్‌) కనబడుతుంది. ఆమెను వెంబడించి 'ఐ లవ్‌యు' అని చెప్పేస్తాడు. ఆమె ఛీకొట్టదు. నవ్వుతుంది. దానితో ఉత్సాహం పట్టలేక పాటలు పాడుకోవడమే గాక ఒక రాత్రి కృష్ణవేణి ఇంటిగోడ దూకుతాడు. దొరికిపోతాడు. ఆమె సీరియస్‌గా 'ఇలాంటి పిచ్చి పనులు చేయకు, నిన్ను ప్రేమించట్లేదు' అని చెప్పేస్తుంది. దానితో షాక్‌ తిన్న వంశీ 'కానీ నేను ప్రేమిస్తున్నాను. నీకోసం ఏదైనా చేస్తాను' అంటాడు. ఆమె విసుగెత్తి'అయితే పరీక్షలు రాయడం మానేయ్‌' అంటుంది. అతను మానేస్తాడు. ఆ విషయం తండ్రికి తెలిసి కోప్పడతాడు. పరీక్షలు మానేశానని కృష్ణవేణికి గర్వంగా చెబుతాడు. ఆమె మళ్ళీ ఛీకొట్టి పొమ్మంటుంది. దానితో వళ్ళు మండి వంశీ ఆమెపై కోర్టులో కేసు పెడతాడు. అలా కోర్టుకెక్కిన వంశీ గెలుస్తాడా? వారి ప్రేమ ఏమౌతుంది? అనేది మిగితా కథ.

    ఈ సినిమాలో హీరో పాత్ర స్వభావం అర్ధం కాదు. అతను పొగరుబోతు హీరోయిన్‌కు బుద్ధి చెబుతున్నాడా? ఆమె ప్రేమను గెలవడానికి ప్రయత్నిస్తున్నాడా? తలిదండ్రుల ఆశయాల కోసం కృషి చేస్తున్నాడా అన్నది సినిమా పూర్తయ్యేవరకు అర్ధం కాకుండా నడపడం విడ్డూరం. హీరోయిన్‌ వంశీని ఎందుకు ద్వేషిస్తున్నదో దర్శకుడికే తెలియాలి. (ఎందుకంటే కథకుడు కూడా ఆయనే కాబట్టి). వదలకుండా వెంటపడుతున్న హీరోకి ఆమె ఒక్కసారైనా తానెందుకు ప్రేమించడం లేదో చెప్పదు. దీనికితోడు బాగా చదవని వాళ్ళు ప్రేమకు అర్హులు కారా అని లాజిక్‌. డైలాగులు, పాటలు, గుళ్ళో, కోర్టులో, పరీక్ష హాల్లో పాటలు ప్రారంభం కావడం చిత్రంలో విచిత్రం. సినిమా పూర్తయినా హీరో చేస్తున్న ఒప్పు ఏమిటో, హీరోయిన్‌ చేస్తున్న తప్పేమిటో తెలియదు. ఇక స్క్రీన్‌ప్లే అంటే సన్నివేశాలను పేర్చుకుంటూ పోవడమేనన్న భావన కలిగించారు. దర్శకత్వం పరంగా చెప్పికోదగినది ఏమీలేదు. ఉన్నంతలో రోహిత్‌, ఎల్‌బి శ్రీరాం బాగా నటించారు. కుర్రకారుకి నచ్చే పాటలు, డ్యాన్సులు, వేణుమాధవ్‌ కామెడీ ట్రాక్‌ సినిమాను బతికించాలి.

    గమనిక: వినోదం, అసభ్యత లేకపోవడం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్‌ ఉంటుంది. సినిమా జయాపజయాలకు రేటింగ్‌కు సంబంధం ఉండనవసరం లేదు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X