twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఛ..లేకి( చలాకి) రివ్యూ

    By Srikanya
    |
    Chalaki
    Rating
    -జోశ్యుల సూర్య ప్రకాష్
    సంస్థ: ఆదిత్య ఆర్ట్స్‌
    నటీనటులు: ఆదిత్యబాబు, రోమా, బియాంకా దేశాయ్‌, బ్రహ్మానందం, చంద్రమోహన్‌,
    ఆహుతి ప్రసాద్‌, రావు రమేష్‌, జీవి, సుమన్‌శెట్టి, వెన్నెల కిషోర్‌, కొండవలస,
    కవిత, ప్రగతి, హేమ, అల్లరి సుభాషిణి తదితరులు.
    కెమెరా: బాల మురగన్
    మాటలు: గంగోత్రి విశ్వనాధ్
    ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్
    సంగీతం: వి. హరి కృష్ణ
    దర్శకుడు: కె. మాదేష్
    నిర్మాత: ఆదిత్యబాబు
    విడుదల తేది: మే 20, 2010

    మూడువేల మంది అమ్మాయిలున్న లేడీస్ కాలేజీలో హీరో కి సీటొస్తుంది...అప్పుడు ఏం జరుగుతుంది అన్నది ఇంట్రస్టింగ్ పాయింటే. అయితే అది తెరమీదకెక్కేటప్పుడు సినిమాటెక్ గా నయినా లాజిక్ ఉంటేనే నమ్మబుద్దేస్తుంది. అంతేగాని హీరో వాళ్ళ అమ్మ అక్కడ లెక్చరర్ కాబట్టి ప్రిన్సిపాల్ ని ఒప్పించి జాయిన్ చేసింది అని అంటే అక్కడే ఆగిపోతాం. అదే ఆదిత్యబాబు హీరోగా రిలీజ్ అయిన చలాకి చిత్రానికి జరిగింది. జగడం, ఆర్య 2 చిత్రాల నిర్మాత అయిన ఆదిత్య బాబు హీరోగా తన లాంచింగ్ కి చాక్లెట్ అనే మళయాళ చిత్రం ఆధారం చేసుకున్నాడు. కానీ ఆ పాయింట్ తెలుగుకి పనికి వస్తుందా లేదా అనేది చూసుకుంటే బావుండేది.

    సుబ్బారావు(ఆదిత్యబాబు) అల్లరి చిల్లరిగా తిరుగుతూ ఎప్పుడూ ఫైట్స్ చేస్తూ అచ్చ తెలుగు మాస్ హీరోలా బిహేవ్ చేస్తూంటాడు. అతని ప్రవర్తనలో మార్పు తేవాలని తల్లి (ఈమె మహిళా కాలేజీ లెక్చరర్) తను పనిచేస్తున్న మహిళా కాలేజీలో ప్రిన్సిపాల్ ని ఒప్పించి జాయిన్ చేస్తుంది. అక్కడ అతనికి సుబ్బలక్ష్మి(రోమా) పరిచయమవుతుంది. ఆమె చాలా ఫాస్ట్. ఆమెతో పరిచయం..కొద్ది రోజులకు ప్రేమగా మారుతుంది. ఆ విషయం చెప్పేలోగా ఆమెకు ఎంగేజ్ మెంట్ జరుగుతుంది. అప్పుడు కలత చెందిన సుబ్బారావు ఏం చేసాడు. ఎలా ఆమెను దక్కించుకున్నాడనే కథతో సెకెండాఫ్ నడుస్తుంది.

    ముందే చెప్పుకున్నట్లుగా కథకు కీలకమైన మలుపు అయిన కాలేజీ లో జాయిన్ అవటం అనేదే ఇల్లాజికల్ గా ఉండటంతో సినిమాలో బిలీవ్ బులిటీ తగ్గిపోయి బోర్ కొట్టడం ప్రారంభిస్తుంది. అలాగే కథను లైటర్ వీన్ లో నడపాలని ఫిక్సయినట్లుగా ఎక్కడా ఏ టెన్షన్ లేకుండా మన అటెన్షన్ గ్రాబ్ చేయకుండా కథనం అల్లారు. ఏ సీన్ లోనూ హీరో ఇరుకున పడడు. ఇంటర్వెల్ లోనే అతని ప్రేమించిన అమ్మాయికి ఎంగేజ్ మెంట్ అవటం ఒక్కడే పాతదయినా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ఆ తర్వాత అయినా కథనం వెడెక్కుతుందంటే హీరో...ఆ దిశలో ఏమీ చేయకపోవటం సినిమాను నీరసపరుస్తుంది. ఇక హీరోయిన్ రోమా కన్నడకు అద్బుతం ఏమో కానీ తెలుగుకి మాత్రం ఓకే అని కూడా అన్పించదు. అలాగే హీరోగా పరిచయమైన ఆదిత్యబాబు నిర్మాతగానే గొప్పగా అన్పిస్తాడు. తెరపై ఎక్కడా ఏ విధమైన ఎక్సప్రెషన్స్ పలకకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. దర్శకుడు కూడా ఏ టెక్నికల్ విలవలూ లేకుండా చక్కగా టీవీ సీరియల్ మాదిరిగా సీన్ తర్వాత సీన్ చేసుకుంటూ పోయారు. ఇక గంగోత్రి విశ్వనాధ్ మాటలు అక్కడక్కడా బాగానే ఉన్నట్లు అనిపిస్తాయి. ఉన్నంతలో సీనియర్ ఆర్టిస్టులే కాస్త సినిమాను ఆ కాస్సేపయినా చూసేలా చేసారు. ఇక పాటల్లో ఓ రెండు మాత్రమే బాగున్నాయి. అలాగే చలాకీ..టైటిల్ కీ కథకీ సంభందం ఎక్కడా ఉండదు.

    ఏదైమైనా కాన్సెప్ట్ లెవెల్లో ఆసక్తి రేపిన ఈ చిత్రంలో చెప్పుకోవటానికి ప్లస్ అనేవి ఎక్కడా బూతద్దం వేసినా కనపడని ఈ చిత్రాన్ని టీవీల్లో వేసినప్పుడు చూడ్డానికి బావుంటుంది. ఎందుకంటే రిమోట్ మన చేతిలో ఉంటుంది..బాగోని సీన్ వచ్చినప్పుడల్లా స్కిప్ చేయవచ్చు. ధియోటర్ కి వెళ్ళి చూడాలి అంటే ఆదిత్యబాబు లేక ఆ యూనిట్ మనకు పరిచయం ఉంటే..తప్పదు. అప్పటికీ తప్పక ఈ సినిమాకు వెళ్ళదామని ఫిక్స్ అయితే మరొకర్ని తోడు తీసుకు వెళ్తే..మధ్యలో కాలక్షేపంగా ఉంటుంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X