twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మూడు డాన్స్‌లు ..ఆరు ప్యాక్‌లు ('పూల రంగడు' రివ్యూ)

    By Srikanya
    |

    -జోశ్యుల సూర్య ప్రకాష్
    సంస్థ: మాక్స్‌ ఇండియా ప్రొడక్షన్స్‌
    నటీనటులు: సునీల్‌, ఇషాచావ్లా, దేవ్‌గిల్‌, కోట శ్రీనివాసరావు, ప్రదీప్‌రావత్‌, అలీ, రఘుబాబు తదితరులు
    సంగీతం: అనూప్‌ రూబెన్స్
    కెమెరా: ప్రసాద్ మురెళ్ల
    ఎడిటర్: గౌతమ్ రాజ్
    నిర్మాత: కె.అచ్చిరెడ్డి
    కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: వీరభద్రమ్‌
    విడుదల: 18, ఫిబ్రవరి 2012

    అప్పలరాజు ప్లాప్ తర్వాత దాదాపు సంవత్సరం పైగా విరామం తీసుకుని సునీల్... పూల రంగడుగా ఒంటరి పోరాటం చేసి గెలిచాడు. మలయాళ మాతృక ఫెయిలైనా తెలుగులో హిట్ చేయటానికి సునీల్ పడ్డ కష్టం అణుఅణువునా కనిపించి ప్రేక్షకులను అలరించింది. కామెడీ పెద్దగా వర్కవుట్ కాకపోయినా, సునీల్ చేసిన డాన్స్ లు, క్లైమాక్స్ లో వచ్చే సిక్స్ ప్యాక్ ఫైట్ జనాలను ఆకట్టుకుంటోంది.

    హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో దెబ్బ తిన్న వారిలో ఒకడు రంగా(సునీల్‌). అప్పులు చేసి తప్పించుకుని తిరుగుతున్న అతనికి వరంగల్ నుంచి ఓ రియల్ ఎస్టేట్ ఆఫర్ వస్తుంది. ఆ బిజినెస్ లో ఉన్న లిటిగేషన్ వల్ల రంగా ... ఇద్దరు ప్రత్యర్దులు (దేవ్ గిల్, ప్రదీప్ రావత్)ల మధ్య ఇరుక్కుపోతాడు. వారి నుంచి తప్పించుకుంటూ ఆ బిజినెస్ లో ఎలా సక్సెస్ అయ్యాడు. అతన్ని ఇష్టపడ్డ ప్రత్యర్ది కూతురు అనిత (ఇషాచావ్లా)ని ఎలా దక్కించుకున్నాడు అనేది తెరపై చూడాల్సిన కథ.

    మలయాళ కామిడీ హీరో దిలీప్ నటించిన Pandippada(2005)రీమేక్ గా వచ్చిన ఈ చిత్రం అక్కడలాగే కామెడీ పరంగా కిక్కు ఇవ్వలేదు. కేవలం ప్రి క్లైమాక్స్ లో వచ్చే కొన్ని సన్నివేశాలు మాత్రమే నచ్చుతాయి. కథలో హీరోకి ఉన్న లక్ష్యమైన తను కొనుక్కున్న స్దలం లిటిగేషన్ విడతీసేందుకు ప్రయత్నాలు పెద్దగా ఆకట్టుకోవు. హీరో తన సమస్య ని విడతీయటానికి ఏ ప్రయత్నమూ కరెక్టు గా చేసినట్లు కనపడడు. కథనంతో కబుర్లు చెప్పుకుంటూ ఎటు వెళ్తే అటు కొట్టుకుపోతూంటాడు. దాంతో హీరో పాత్ర పూర్తి ప్యాసివ్ గా మారి ఆ సన్నివేసాలు అనాసక్తిగా మారిపోయాయి. క్లైమాక్స్ వరకూ హీరో కేవలం విలన్స్ మధ్య ఇరుక్కుపోవటమే అన్నట్లుగా సీన్స్ ముందుకు వెళ్తుంటాయి. మలయాళ మూల కథని మాత్రమే తీసుకుని మరింత వర్క్ చేసి ఉంటే మర్యాద రామన్న రేంజిలో వర్కవుట్ అయ్యేది. అలా చేయకపోవటంతో కేవలం సునీల్ కష్టం పైనే ఆధారపడాల్సి వచ్చింది. ముఖ్యంగా మలయాళంలో అద్బుతంగా పండాయనుకున్న సిట్యువేషన్ కామెడీ సీన్స్ ఇక్కడ పెద్దగా ఆకట్టుకోలేదు.

    నటీనటుల్లో సునీల్ ... సిక్స్ ప్యాక్ బాగున్నా.. హీరో కాక ముందు ఫ్యామిలీ ప్యాక్ తో చేసిన కామెడీ మిస్సైంది. హీరోయిన్ గా ఇషా ఛావ్లా మైనస్. కాస్తో కూస్తో బాగున్నాయి అనుకున్న సన్నివేశాలకి అలీ ప్లస్ అయ్యాడు. అలాగే కోట, సుమిత్ర,సుధ, సత్యం రాజేష్, పృథ్వీ, దువ్వాసి మోహన్ వంటి రెగ్యులర్ నటుల వల్ల సినిమాకు నిండుతనం వచ్చింది. ఇలాంటి సినిమాలకు కీలకమైన పంచ్ డైలాగులు పెద్దగా పేలలేదు. అనూప్ రూబెన్స్ సంగీతం ఓకే అనిపిస్తుంది. ఎడిటింగ్ మరింత షార్పుగా చేస్తే బాగుండేది. కెమెరా వర్కు బాగుంది. సినిమాను నిలబెట్టిన క్లైమాక్స్ క్రెడిట్ మాత్రం ఫైట్ మాస్టర్ కనల్ కణ్ణన్ దే. నిర్మాణ విలువలు బాగున్నాయి. దర్శకుడు ద్వితీయ విఘ్నాన్ని సునిల్ ని అడ్డం పెట్టుకుని దిగ్విజయింగా దాటేసాడు. ఫైనల్ గా సునీల్ కోసమే ఈ చిత్రాన్ని చూడాలి.

    English summary
    Sunil's action entertainer 'Poola Rangadu' released with positive talk.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X