twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'ఫ్రెండ్స్ బుక్' సినిమా రివ్యూ

    By Bojja Kumar
    |

    తారాగణం : నిశ్చల్, ఉదయ్, అర్చన, సుర్య, సురేష్, నిషా శెట్టి, రావు రమేష్ తదితరులు
    కథ, సంగీతం, దర్శకత్వం : ఆర్పీ పట్నాయక్
    నిర్మాత : ముళ్లా విజయప్రసాద్
    బ్యానర్ : వెల్ఫేర్ క్రియేషన్స్

    కథ : నిశ్చల్, అక్షయ్, సూర్య, నిత్యా, మధు, రాజు చిన్నప్పటి నుంచి స్నేహితులు. రాజు మినహా అంతా సాఫ్ట్ వేర్ ఉద్యోగులు. మిగతా వారంతా జాబ్ చేయడం ఇష్టం లేక బిజినెస్ చేద్దామని ట్రై చేస్తారు. ఈ క్రమంలో వారికి ఫేస్‌బుక్ లో ఫేక్ అకౌంట్ల వల్ల కలిగే నష్టాన్ని నివారించానికి సాఫ్ట్ వేర్ కనిపెట్టాలనే ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన వచ్చిందే ఆలస్యం చాలా కష్టపడి సాఫ్ట్ వేర్ డెవలప్ చేస్తారు. దీన్ని ఫేస్ బుక్ వారికి అమ్మాలని తిరుగుతుండగా వారికి ఫేస్ బుక్‌లో పని చేసే శ్రీనివాస్ మహాలింగం అనే వ్యక్తి పరిచయం అవుతాడు. అతను వారు తయారు చేసిన సాఫ్ట్ వేర్‌ను మెచ్చుకుని....కంపెనీ యాజమాన్యంతో డీల్ కుదుర్చుకునేందుకు అమెరికా తీసుకెళ్లడానికి ప్రయత్నాలు మొదలు పెడతాడు. అయితే అనుకోని ప్రమాదంలో సూర్య చనిపోతాడు. వారి సాఫ్ట్ వేర్ కూడా దొంగిలించ బడుతుంది. ఏమీ అర్థం కాని పరిస్థితుల్లో ఉన్న వారికి అక్షయ్‌తో సూర్య ఆత్మ చాటింగ్‌లోకి వస్తుంది. తాను ప్రమాదంలో చనిపోలేదని, చంపబడ్డానని చెబుతుంది ఆ ఆత్మ. మరి సూర్యను ఎవరు ఎందుకు చంపారు అనేది మిగిలిన కథ.

    పెర్ఫార్మెన్స్ : సూర్య, నిశ్చల్, సురేష్ పెర్ఫార్మెన్స్ బాగుంది. నీట్‌గా నటించి వారి పాత్రలకు న్యాయం చేశారు. నెగెటివ్ క్యారెక్టర్లో రావు రమేష్ మంచి నటన కనబరిచాడు. చాలా సినిమాల్లో ఆయన్ను పాజిటివ్‌గా చూసిన ప్రేక్షకులకు అతన్ని నెగెటివ్ పాత్రలో చూడటం కాస్త ఇబ్బంది అనిపిస్తుంది. ఇతర నటీనటులు వారి వారి పాత్రల మేరకు రాణించారు.

    టెక్నికల్ : రెడ్ 5డి కెమెరాలతో చిత్రీకరించి మంచి ఔట్ పుట్ తీసుకొచ్చారు. అయితే సినిమాటోగ్రీఫీ కొన్ని చోట్ల బాగోలేదు. ఆర్పీ సంగీతం ఫర్వాలేదు అనిపిస్తుంది. బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది. ఎడిటింగ్ యావరేజ్‌గా ఉంది. డైలాల్స్ ఓకే.

    విశ్లేషణ : కొత్తదనం అని ముందు నుంచి ఊదర గొడుతున్న దర్శకుడు....సినిమాలో మాత్రం చూపెట్టలేక పోయాడు. కథ కొత్తదే అయినా దాన్ని నడిపిన తీరు రొటీన్ గా ఉంది. ఈ సినిమా మాస్, ఫ్యామిలీ‌కి అర్థంకాని విషయమే. క్లాస్ ప్రేక్షకులు అందులోనూ ఫేస్‌బుక్‌పై అవగాహన ఉన్న వారి కోసమే ఈ సినిమా. యూత్‌ను ఆకట్టుకునే అంశాలు పెద్దగా కనిపించవు. కథలో సస్పెన్స్ అంశం ఉన్నా...క్యూరియాసిటీ కనిపించదు. సినిమాలో టెంపో మిస్సవకుండా పీల్ మెయింటెన్ చేయడంలో దర్శకుడు పూర్తిగా విఫలం అయ్యాడు. పాత్రల రూపకల్పనలో కూడా కొత్తదనం లేదు. నవ్వురాని రొటీన్ కామెడీ ఎబ్బెట్టుగా అనిపించింది.

    ఫైనల్ వర్డ్ : మీరు 100 సినిమాలు ఊహించుకున్నా...101వ సినిమా చూపిస్తామని ట్రైలర్లలో ఊదరగొట్టడం చూసి కొత్తదనం కోసం వెళితే నిరాశ తప్పదు.

    English summary
    
 Veteran movie director R.P.Patnaik has come up with his second offering as a movie director with the film ‘Friends Book’. The movie has Nischal, Uday, Archana, Surya, Suresh and Nisha Shetty in lead roles. Welfare Creations group has produced the movie. R.P.Patnaik triend to do too many things at once in this movie and he ends up doing a poor job with all of them. There is absolutely no logic in much of the film and you can safely stay away from this ‘thriller’. Spend time on your Facebook account instead.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X