twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆల్ ఈజ్ వేస్ట్ (‘ఆల్ ది బెస్ట్’ రివ్యూ)

    By Srikanya
    |

    ---సూర్య ప్రకాష్ జోశ్యుల
    సంస్థ: సుధా సినిమా
    నటీనటులు: శ్రీకాంత్‌, జేడీ చక్రవర్తి, లక్కీ శర్మ, అనీషా సింగ్‌, బ్రహ్మానందం, రావు రమేష్‌, రఘుబాబు, దువ్వాసి మోహన్‌ తదితరులు.
    మాటలు: కృష్ణమోహన్ చల్లా
    కెమెరా: జి.శివకుమార్
    సంగీతం: హేమచంద్ర
    ఎడిటింగ్: వెంకటేష్,
    నిర్మాత: జె.సాంబశివరావు
    కథ,స్క్రీన్ ప్లే,దర్శకత్వం: జేడీ చక్రవర్తి
    విడుదల: 29,జూన్,2012

    నటుడు నుంచి దర్సకుడిగా మారిన జెడీ చక్రవర్తి మరోసారి ప్రేక్షకులను కామెడీతో నవ్విద్దామనే ప్రయత్నం చేసి నవ్వుల పాలయ్యాడు. మలయాళంలో వచ్చిన Gulumal 2009 చిత్రాన్ని కాపీ చేస్తూ వచ్చిన ఈ చిత్రం బాక్సాపీస్ వద్ద వర్కవుట్ అయ్యే వాతావరణం కనపడటం లేదు. పూర్తి కామెడీ చిత్రంగా పబ్లిసిటీ చేసిన ఈ సినిమా మొత్తంలో రెండు మూడు చోట్ల కూడా నవ్వించలేకపోయారు. ముఖ్యంగా హీరో పాత్ర క్లైమాక్స్ ట్విస్ట్ కోసం మొదటి నుంచి చివరి వరకూ పూర్తి ప్యాసివ్ గా నడవటంతో బోర్ కొట్టి కథనం చతికిలపడింది.

    నీతి నిజాయతిలతో బ్రతికే రవి (శ్రీకాంత్‌)కి తన తండ్రి(కోట) మోసపోయి ఆర్దిక నేరంలో జైల్లో ఇరుక్కోవటంతో అర్జెంటుగా పదిహేను లక్షలు అవసరమవుతాయి. ఎక్కడా నయాపైసా అప్పు పుట్టని రవికి ఆపద్బాంధవుడులా చందు (జె.డి.చక్రవర్తి)పరిచయమవుతాడు. మాయమాటలు చెప్పి బ్రతికే చందు సాయింతో తన సమస్య నుంచి బయిటపడాలనుకుంటాడు. అందుకు చందు సాయింతో రవి ఓ ఎన్నారై(ప్రదీప్ రావత్)ని ప్లాన్ చేసి మోసం చేయాలనుకుంటాడు. ఇద్దరు కలిసి ప్లాన్ చేసి అమలుపరిచే క్రమంలో లక్కీ (లక్కీ శర్మ), ఉపాసన (అనీషా) తదితరులను కలుపుకొంటారు. వీరంతా కలిసి చివరికి ఏం చేశారనేది అసలు కథ.

    నిజానికి ఈ చిత్రం Nueve reinas (2000)అనే అర్జైటైనా చిత్రం మూలంగా సాగుతుంది. దీనినుంచి మలయాళ సినిమా Gulumal 2009 రీళ్లు పోసుకుంది. ఆ తర్వాత హిందీలోనూ అభిషేక్ బచ్చన్ తో కొద్దిగా మార్చి బ్లఫ్ మాస్టర్ చేసారు. ఇప్పుడు తెలుగులోగి దిగింది. అలాగే ఈ చిత్రాలన్నీ క్రైమ్ ధ్రిల్లర్లు జనర్ లో సాగుతాయి. కామెడి బలవంతంగా ఇరికిద్దామనుకున్నా పొసగలేదు. ఎక్కడో క్లైమాక్స్ లో ట్విస్ట్ ఉండటంతో అప్పటివరకూ కథ డైరక్టర్ పాయింటాఫ్ వ్యూలో సాగటంతుంది.

    హీరోలు, వారి హీరోయిజం చూపెట్టేందుకు అవకాశం ఉండదు. దాంతో తెరపై సంఘటనలు వరసగా జరుగుతూంటాయి కానీ కథలో కాంప్లిక్ట్ ఎక్కడా పుట్టదు. శ్రీకాంత్ ని హీరోగా చూపెట్టాక అతను ఏదన్నా చేస్తాడు తన సమస్య నుంచి బయిటపడటం కోసం అని ఎదురుచూస్తాంటాం. కానీ కథ ప్రకారం శ్రీకాంత్ చెయ్యటానికి అవకాశం ఉండదు. శ్రీకాంత్ కి క్లైమాక్స లో ట్విస్ట్ ఉందని తెలుసు కాబట్టి కులాసాగా సీన్స్ గడిపేస్తాడు. కానీ మనకు తెలియదు కాబట్టి ఇబ్బంది పడుతూ బోర్ అనుభవిస్తూ దిక్కులూ చూస్తూ, సెల్ ఫోన్ లో గేమ్స్ ఆడుకుంటూంటాం. అదే సినిమాను చావు దెబ్బ కొట్టింది.

    నిజానికి ఈ సినిమా రిలీజ్ కు ముందు జెడీ మాట్లాడుతూ..శ్రీకాంత్ చేయకపోతే నేనీ సినిమా చేసేవాణ్ణి కాదు అన్నారు. అదే నిజమనిపిస్తుంది ఈ సినిమా చూస్తూంటే... తెరపై ఏమీ చేయని క్యారెక్టర్ ని శ్రీకాంత్ తప్ప మరెవరూ ఒప్పుకోరు అని అర్దమవుతుంది. నటీనటుల్లో శ్రీకాంత్,జెడీ ఎప్పటిలాగే అంటే వన్ బై టూ టైమ్ నాటి నటనతోనే నడిపించే ప్రయత్నం చేసారు. ఇక రఘుబాబు పాత్ర బాగా పండింది. సినిమాలో నవ్వించిన సీన్స్ ఏమన్నా ఉన్నాయా అంటే రఘుబాబువే.

    పోలీస్ అధికారిగా రఘుబాబు ఓ రౌడీని వెంటాడుతూంటే అతను ఒక బిల్డింగ్ పై నుంచి మరొక దానిపైకి సాహసంగా దూకటం...అతన్ని వెంబడిస్తున్న రఘుబాబు కూల్ గా బిల్డింగ్ కి బిల్డింగ్ కి మధ్య ఉన్న దారి గుండా నడిచి వెళ్లి అతనికి అడ్డుపడటం. అలాగే రౌడీ..పై నుంచి కష్టపడి పైపులు పట్టుకుని దిగుతూంటే రఘుబాబు..లిప్ట్ లో క్రిందటి వచ్చి అతనికి ఎదురయ్యి అతనికి షాక్ అవటం వంటివి నవ్విస్తాయి. ఇక బ్రహ్మానందం మూగోడుగా గోచి సావిత్రి అంటూ కామీడీ చెయ్యబోయాడు కానీ నవ్వించలేకపోయాడు.

    ఎడిటింగ్ లో పోయిందో ఏమో కానీ వేణు మాధవ్ ఉత్తినే వచ్చి కనపడి వెళ్లిపోతాడు. మిగతా పాత్రలు ఎంతకు అంతే. ఎడిటింగ్,కెమెరా సినిమాకు తగ్గట్లే ఉన్నాయి. పాటల్లో రెండు బాగున్నాయి. హేమచంద్ర పెద్ద సినిమా పడితే మంచి సంగీత దర్శకుడు అవుతాడనిపించింది. ఫైనల్ గా కామీడి చిత్రం చూడాలనుకుంటే ఈ చిత్రాన్ని ఎవాయిడ్ చేయటం బెస్ట్. అలా కాకుండా ఒరిజనల్ సినిమా ఇప్పటికే చూసి ఉండి ఎలా దాన్ని తెలుగుకు ఎడాప్ట్ చేసారో తెలుసుకోవాలనుకుంటే నిరభ్యంతరంగా వెళ్లండి..ఆల్ ది బెస్ట్.

    English summary
    Actor-turned-director JD Chakravarthy's "All the Best" relesed with divide talk. It is an uncredited remake of the 2000 Argentine film Nine Queens.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X